సాక్షి, హైదరాబాద్ : గీతమ్ యూనివర్సిటీ విద్యార్ధులు గురువారం సంప్రదాయ వస్త్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులందరూ విభిన్న సంస్కృతులు ప్రతిబింబించేలా వస్త్రధారణతో కనువిందు చేశారు. విద్యార్ధులు లుంగీలు, పంచెలతో అలరించగా, విద్యార్ధినులు చీరకట్టుతో ఆకట్టుకున్నారు. ఈ వేడుకలో మెహిందీ, వంటలు, రంగవల్లి పోటీలు నిర్వహించారు. అందరూ ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన క్యాట్‌వాక్, నృత్యాలు, ఫోటో సెషన్లు, సెల్ఫీలతో ఆ ప్రాంగణం అంతా కోలాహలంగా మారింది.
జాతీయ ఓటరు దినోత్సవ సందర్భంగా జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో గీతం యూనివర్సిటీ అదనపు ఉపకులపతి ర్యాలీని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ...బుల్లెట్ కంటే బ్యాలెట్ ప్రభావవంతమైనదని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించి, విద్యార్థులందరితో ప్రతిజ్ఞ చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment