celeberation
-
International Yoga Day 2024: స్పెషల్ ఈవెంట్ ఫోటోలు
-
జోయ్ బర్త్‌డే.. ఈ కుక్కకి రోజు వచ్చిందోచ్ !
బషీరాబాద్: మనుషులు బర్త్‌డేలు చేసుకోవడం అందిరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఓ కుక్క బర్త్‌డే చేసుకుంది. అదేంటి కుక్క బర్త్‌డే చేసుకోవడమేంటని ఆశ్చర్యపోకండి. ప్రతీ కుక్కకి ఓ రోజు వస్తుందనే సామెత ఉందిగా.. అలా ఈ రోజు జోయ్ ది అన్నమాట. ఇటీవల నగరాల్లో సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, సంపన్నులు వారి ఇళ్లళ్లో పెంపుడు కుక్కలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్న ‘జోయ్’ అనే కుక్క సోమవారం తన రెండో పుట్టిన రోజును జరుపుకొంది. తన బర్త్‌డే సందర్భంగా కేక్‌కట్ చేసింది. ఇది ఎక్కడ జరిగిందనుకుంటున్నారా..? హైదరాబాద్‌లోని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి ఇంట్లోనే. మూగజీవాలను అమితంగా ప్రేమించే సునీతారెడ్డి తన పెంపుడు కుక్కకు రెండో పుట్టిన రోజు సందర్భంగా ఇలా బర్త్‌డే చేశారు. ఇదండీ మ్యాటరు. ఆన్లైన్ తరగతులపై దృష్టి సారించాలి దోమ: విద్యార్థుల ఆన్లైన్ తరగతులపై ప్రతి ఉపాధ్యాయుడు ప్రత్యేక దృష్టి సారించాలని దోమ మండల విద్యాధికారి హరిశ్చందర్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని పలుగుతండా, కుమ్మరికుంటతండా, బుద్లాపూర్, హుస్సేన్ నాయక్ తండాలలోని పాఠశాలలను ఆయన సందర్శించారు. పాఠశాలలలో విద్యార్థుల విద్యాబోధన గురించి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలోని ప్రతి పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులను బోధించాలన్నారు. విద్యార్థులకు ఆన్లైన్ తరగతుల పట్ల ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో బుద్లాపూర్ సర్పంచ్ మారోనిబాయ్, పాండు నాయక్, సీఆర్పీ రెడ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పేదల గొంతుక వైఎస్సార్ సీపీ
సాక్షి, మొగల్రాజపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేదల గొంతుకగా నిలబడుతుందని పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త యలమంచిలి రవి పేర్కొన్నారు. పార్టీ తొమ్మిదో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 6వ డివిజన్లో మంగళవారం కేక్ కటింగ్, పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా యలమంచిలి రవి మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలనను ముగిసి సంక్షేమ రాజ్యం వైఎస్ జగన్మోహన్రెడ్డి ద్వారా మొదలవుతుందన్నారు. పార్టీ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి సారేపల్లి సుధీర్‌కుమార్, డివిజన్ అధ్యక్షుడు వియ్యపు అమర్నాథ్, బీసీ విభాగం నియోజకవర్గ కన్వీనర్ బొమ్మన శివశ్రీనివాస్, డివిజన్ నాయకులు రేగళ్ల మధు, గౌరి నాయుడు, బి.మహేష్ పాల్గొన్నారు. స్థానిక జమ్మిచెట్టు సెంటర్ సమీపంలోని పార్టీ సీనియర్ నాయకుడు నల్లమోతు మధుబాబు (రమేష్ చౌదరి) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యలమంచిలి రవి పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. మధుబాబుతో పాటుగా బొడా ప్రేమ్, మందా వెంకన్న, లింగారెడ్డి, కోమల్, రణదేవ్, కె.రవి తదితరులు పాల్గొన్నారు. 7వ డివిజన్లో... పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం ఉదయం బందులదొడ్డి సెంటర్లో పార్టీ జెండాను సమన్వయకర్త యలమంచిలి రవి ఆవిష్కరించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నాయకులు పరసా క్లైవ్, జక్రయ్య, జంపాన సాయి కుమార్, ఎం.శ్రీనివాసరావు, ఎన్.ప్రవీణ్, టి.ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం కేక్ కటింగ్ చేశారు. కృష్ణలంకలో... కృష్ణలంక: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కృష్ణలంకలోని 24, 23, 16, 15 డివిజన్లలో ఘనంగా నిర్వహించారు. పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త యలమంచిలి రవి ఆయా ప్రాంతాలలో జరిగిన వేడుకల్లో పాల్గొని పార్టీ జెండాలను ఆవిష్కరించి పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. స్థానిక కృష్ణలంకలోని మలేరియా ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్‌చేశారు. కార్యక్రమంలో 15, 16డివిజన్ల కార్పొరేటర్లు కావటి దామోదర్, మద్దా శివశంకర్, నాయకులు తంగిరాల రామిరెడ్డి, తాటిపర్తి కొండారెడ్డి, నిమ్మల జ్వోతిక, మేడా రమేష్, నాగిరెడ్డి, గోపాల్‌రెడ్డి, రంగారావు, అంజిరెడ్డి, కొమ్మిరి వెంకటేశ్వరరావు, మచ్చా శ్రీనివాసరెడ్డి, రంగారావు తదితరులు పాల్గొన్నారు. -
దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
-
గీతమ్లో ఘనంగా వేడుకలు
సాక్షి, హైదరాబాద్ : గీతమ్ యూనివర్సిటీ విద్యార్ధులు గురువారం సంప్రదాయ వస్త్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులందరూ విభిన్న సంస్కృతులు ప్రతిబింబించేలా వస్త్రధారణతో కనువిందు చేశారు. విద్యార్ధులు లుంగీలు, పంచెలతో అలరించగా, విద్యార్ధినులు చీరకట్టుతో ఆకట్టుకున్నారు. ఈ వేడుకలో మెహిందీ, వంటలు, రంగవల్లి పోటీలు నిర్వహించారు. అందరూ ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన క్యాట్‌వాక్, నృత్యాలు, ఫోటో సెషన్లు, సెల్ఫీలతో ఆ ప్రాంగణం అంతా కోలాహలంగా మారింది. జాతీయ ఓటరు దినోత్సవ సందర్భంగా జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో గీతం యూనివర్సిటీ అదనపు ఉపకులపతి ర్యాలీని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ...బుల్లెట్ కంటే బ్యాలెట్ ప్రభావవంతమైనదని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించి, విద్యార్థులందరితో ప్రతిజ్ఞ చేయించారు. -
ఘనంగా నేతాజీ జయంతి
రెబ్బెన : నేటి తరం యువత సుభాష్‌చంద్రబోస్‌ను ఆదర్శంగా తీసుకుని దేశ సేవ చేయాలని సింగరేణి పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం గోలేటిలోని సింగరేణి ఉన్నత పాఠశాలో సుభాష్ చంద్రబోస్ 121వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో ఉపాధ్యాయలు శ్రీనివాసరావు, అరుణ్‌కుమార్, పీఈటీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్వీ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సంజీవ్, కరస్పాండెంట్ విజయకుమారి పాల్గొన్నారు. అలాగే టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో గోలేటి టౌన్షిప్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ మస్క రమేష్ పాల్గొన్నారు. -
‘బతుకమ్మ’ నిర్వహణపై భిన్నాభిప్రాయాలు
–రసాభాసాగా మారిన సమావేశం – బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటుకు నిర్ణయం –ఉత్సవ కమిటీ ఏర్పాటు కోదాడఅర్బన్: బతుకమ్మ పండుగను విజయవంతంగా నిర్వహించేందుకుగాను మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో వివిధ మహిళా సంఘాలు, వార్డు కౌన్సిలర్లతో ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసాగా మారింది. భిన్నాభిప్రాయాల మధ్య సాగిన ఈ సమావేశం చివరకు వాగ్వాదాలు, అరుపులతో హోరెత్తి మున్సిపాలిటీ పాలకవర్గ సమావేశాన్ని తలపించింది. బతుకమ్మ పండుగను గతంలో మాదిరిగా ఒకేచోట కాకుండా పట్టణంలోని మహిళల సౌకర్యం కోసం వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించాలని కొందరు ప్రతిపాదించగా, మరికొందరు దానిని వ్యతిరేకించారు. పండుగ నిర్వహణకు వచ్చే నిధులను వార్డుల వారిగా పంచిఇవ్వాలని కొందరు కోరగా, తమకు నిధులతో సంబంధం లేదని తమ వార్డులలో తామే ఉత్సవాలను నిర్వహించకుంటామని తెలిపారు. ఈ వివాదంలో చివరకు కమిషనర్ జోక్యం చేసుకుని బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించే ఉత్సవాలకు మాత్రమే మున్సిపాలిటీ పరంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. భిన్నాభిప్రాయాల నడుమ సాగిన సమావేశం..... చైర్పర్సన్ వంటిపులి అనిత అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు, మహిళా సంఘాలు, సమభావన సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు వార్డులకు చెందిన మహిళలు మాట్లాడుతూ ఈ దఫా ఉత్సవాలను తమ వార్డులోనే నిర్వహించేందుకు నిర్ణయించామని చైర్‌పర్సన్‌కు తెలిపారు. అలాగే ఉత్సవాలకు మున్సిపల్ అధికారులు రాయితీపై పూలు సరఫరా చేయాలని కోరారు. అనంతరం చైర్పర్సన్ అనిత మాట్లాడుతూ ఉత్సవాలను ఒకేచోట నిర్వహిస్తే పండుగ వాతావరణం నెలకొంటుందని, నిర్వహణాపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు జనరల్‌ఫండ్ నిధులు కేటాయిస్తున్నందున కొన్ని వార్డుల్లో నిర్వహించే ఉత్సవాలకు మున్సిపాలిటీ పరంగా సౌకర్యాలు కల్పించాలని కోరారు. దీనికి వైస్ చైర్మన్ తెప్పని శ్రీనివాస్, కౌన్సిలర్లు ఉప్పగండ్ల సరోజ, షఫీలు తమ మద్దతు తెలిపారు. ఈ క్రమంలో కౌన్సిలర్ ఖాజాగౌడ్,టీఆర్ఎస్ పార్టీ పట్టణ కార్యదర్శి గట్ల కోటేశ్వరరావులు దీనిని వ్యతిరేకించడంతో వారికి మిగిలిన కౌన్సిలర్ల మధ్య చాలాసేపు వివాదం నడిచింది. చివరకు బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించే ఉత్సవాలకు మున్సిపాలిటీ పరంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలపడంతో సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో నాయకులు నూనె సులోచన, కుక్కడపు బాబు, బెలిదె అశోక్, పలు మహిళా సంఘాల, సమభావన సంఘాల సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఉత్సవ కమిటీ ఏర్పాటు.. బాలుర ఉన్నత పాఠశాలలో ఉత్సవాల నిర్వహణకు గాను సమావేశం అనంతరం ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ అధ్యక్షురాలిగా చైర్పర్సన్ వంటిపులి అనిత, గౌరవ సలహాదారులిగా నూనె సులోచన, ఉపాధ్యక్షులుగా పబ్బా గీత, నాగుబండి నళిని, కారంపూడి రమాదేవి, ఇమ్మడి భాగ్యలక్ష్మి, కార్యదర్శులుగా యాదా రాణి, చందా నిర్మల, తూము శాంత, పండు పద్మ, బొగ్గారపు రేఖారాణి, ఓరుగంటి రమాదేవి, పిట్టల భాగమ్మ. చింతా కెజ్జమ్మలతో పాటు మహిళ వార్డు కౌన్సిలర్లు, టీఎల్ఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులను సభ్యులుగా నియమించారు. -
బతుకమ్మ నిర్వహణపై నేడు సమావేశం
కోదాడఅర్బన్: ఈనెల 30 నుంచి కోదాడ పట్టణంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు మంగళవారం కోదాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మహిళా మండలి కార్యవర్గం, స్వచ్ఛంద సంఘాలు,ఎస్ఎల్ఎఫ్, టీఎల్ఎఫ్, మహిళా సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ అమరేందర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి కౌన్సిలర్లు, ఆయా సంఘాల మహిళలు పాల్గొని ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకుగాను తగిన సలహాలు,సూచనలు అందించాలని ఆయన కోరారు.