6వ డివిజన్‌లో జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేస్తున్న యలమంచిలి రవి
సాక్షి, మొగల్రాజపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేదల గొంతుకగా నిలబడుతుందని పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త యలమంచిలి రవి పేర్కొన్నారు. పార్టీ తొమ్మిదో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 6వ డివిజన్‌లో మంగళవారం కేక్ కటింగ్, పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా యలమంచిలి రవి మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలనను ముగిసి సంక్షేమ రాజ్యం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ద్వారా మొదలవుతుందన్నారు.
పార్టీ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి సారేపల్లి సుధీర్‌కుమార్, డివిజన్ అధ్యక్షుడు వియ్యపు అమర్‌నాథ్, బీసీ విభాగం నియోజకవర్గ కన్వీనర్ బొమ్మన శివశ్రీనివాస్, డివిజన్ నాయకులు రేగళ్ల మధు, గౌరి నాయుడు, బి.మహేష్ పాల్గొన్నారు.
స్థానిక జమ్మిచెట్టు సెంటర్ సమీపంలోని పార్టీ సీనియర్ నాయకుడు నల్లమోతు మధుబాబు (రమేష్ చౌదరి) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యలమంచిలి రవి పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. మధుబాబుతో పాటుగా బొడా ప్రేమ్, మందా వెంకన్న, లింగారెడ్డి, కోమల్, రణదేవ్, కె.రవి తదితరులు పాల్గొన్నారు.
7వ డివిజన్‌లో...
పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం ఉదయం బందులదొడ్డి సెంటర్‌లో పార్టీ జెండాను సమన్వయకర్త యలమంచిలి రవి ఆవిష్కరించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నాయకులు పరసా క్‌లైవ్, జక్రయ్య, జంపాన సాయి కుమార్, ఎం.శ్రీనివాసరావు, ఎన్.ప్రవీణ్, టి.ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం కేక్ కటింగ్ చేశారు.
కృష్ణలంకలో...
కృష్ణలంక: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కృష్ణలంకలోని 24, 23, 16, 15 డివిజన్‌లలో ఘనంగా నిర్వహించారు. పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త యలమంచిలి రవి ఆయా ప్రాంతాలలో జరిగిన వేడుకల్లో పాల్గొని పార్టీ జెండాలను ఆవిష్కరించి పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు.
స్థానిక కృష్ణలంకలోని మలేరియా ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్‌చేశారు. కార్యక్రమంలో 15, 16డివిజన్‌ల కార్పొరేటర్లు కావటి దామోదర్, మద్దా శివశంకర్, నాయకులు తంగిరాల రామిరెడ్డి, తాటిపర్తి కొండారెడ్డి, నిమ్మల జ్వోతిక, మేడా రమేష్, నాగిరెడ్డి, గోపాల్‌రెడ్డి, రంగారావు, అంజిరెడ్డి, కొమ్మిరి వెంకటేశ్వరరావు, మచ్చా శ్రీనివాసరెడ్డి, రంగారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment