mogalrajapuram
-
శ్రీమతి .. అమరావతి
సాక్షి, మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రముఖ మోడల్స్ అంజనా, అపర్ణ, మిసెస్ తెలంగాణ టైటిల్ విన్నర్ స్నేహా చౌదరి అన్నారు. మొగల్రాజపురంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో శుక్రవారం తేజాస్ ఎలైట్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో మిసెస్ అమరావతి-2019 పేరుతో సంప్రదాయ ఫ్యాషన్ షో ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. నగరంతో పాటుగా వివిధ ప్రాంతాల నుంచి 60 మంది మహిళలు హాజరై సంప్రదాయ, టాలెంట్ రౌండ్స్‌లో ప్రతిభను ప్రదర్శించారు. ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేశారు. ఈ విషయం గురించి తేజాస్ ఎలైట్ ఈవెంట్స్ అధినేత, పోటీల నిర్వాహకుడు ప్రదీప్ చౌదరి మాట్లాడుతూ సంప్రదాయ ఫ్యాషన్ షోకు మహిళల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. మహిళల్లో దాగి ఉన్న ప్రతిభ పెళ్లి అయిన తర్వాత కొంతమందిలో పోతుందని చెప్పారు. చాలామంది తమ వృత్తికి, ఇంటికే పరిమితం అవడం వల్ల వారిలో ఉన్న ప్రతిభను ప్రదర్శించే అవకాశం లేకుండా పోతుందన్నారు. అలాంటి వారికి అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అదే విధంగా ఈ నెల 20న ఇబ్రహీంపట్నంలో ఫైనల్స్ పోటీలు నిర్వహిస్తామని, ప్రతిభ చూపిన వారికి శ్రీమతి అమరావతి-2019 టైటిల్‌ను సినీ హీరోయిన్ ప్రేమ చేతుల మీదుగా అందజేస్తామన్నారు. ఆ రోజు జరిగే ఫైనల్స్ పోటీలకు జబర్దస్త్ టీమ్‌తో పాటు సినీ రంగానికి చెందిన పలువురు పాల్గొంటారని చెప్పారు. మిసెస్ అమరావతి టైటిల్ మాజీ విన్నర్స్ వర్షితా వినయ్ (2017), మంజులా (2018), పోటీల సహ నిర్వాహకులు సుమన్ బాబు, విష్ణు బొప్పన తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పేదల గొంతుక వైఎస్సార్ సీపీ
సాక్షి, మొగల్రాజపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేదల గొంతుకగా నిలబడుతుందని పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త యలమంచిలి రవి పేర్కొన్నారు. పార్టీ తొమ్మిదో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 6వ డివిజన్లో మంగళవారం కేక్ కటింగ్, పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా యలమంచిలి రవి మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలనను ముగిసి సంక్షేమ రాజ్యం వైఎస్ జగన్మోహన్రెడ్డి ద్వారా మొదలవుతుందన్నారు. పార్టీ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి సారేపల్లి సుధీర్‌కుమార్, డివిజన్ అధ్యక్షుడు వియ్యపు అమర్నాథ్, బీసీ విభాగం నియోజకవర్గ కన్వీనర్ బొమ్మన శివశ్రీనివాస్, డివిజన్ నాయకులు రేగళ్ల మధు, గౌరి నాయుడు, బి.మహేష్ పాల్గొన్నారు. స్థానిక జమ్మిచెట్టు సెంటర్ సమీపంలోని పార్టీ సీనియర్ నాయకుడు నల్లమోతు మధుబాబు (రమేష్ చౌదరి) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యలమంచిలి రవి పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. మధుబాబుతో పాటుగా బొడా ప్రేమ్, మందా వెంకన్న, లింగారెడ్డి, కోమల్, రణదేవ్, కె.రవి తదితరులు పాల్గొన్నారు. 7వ డివిజన్లో... పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం ఉదయం బందులదొడ్డి సెంటర్లో పార్టీ జెండాను సమన్వయకర్త యలమంచిలి రవి ఆవిష్కరించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నాయకులు పరసా క్లైవ్, జక్రయ్య, జంపాన సాయి కుమార్, ఎం.శ్రీనివాసరావు, ఎన్.ప్రవీణ్, టి.ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం కేక్ కటింగ్ చేశారు. కృష్ణలంకలో... కృష్ణలంక: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కృష్ణలంకలోని 24, 23, 16, 15 డివిజన్లలో ఘనంగా నిర్వహించారు. పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త యలమంచిలి రవి ఆయా ప్రాంతాలలో జరిగిన వేడుకల్లో పాల్గొని పార్టీ జెండాలను ఆవిష్కరించి పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. స్థానిక కృష్ణలంకలోని మలేరియా ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్‌చేశారు. కార్యక్రమంలో 15, 16డివిజన్ల కార్పొరేటర్లు కావటి దామోదర్, మద్దా శివశంకర్, నాయకులు తంగిరాల రామిరెడ్డి, తాటిపర్తి కొండారెడ్డి, నిమ్మల జ్వోతిక, మేడా రమేష్, నాగిరెడ్డి, గోపాల్‌రెడ్డి, రంగారావు, అంజిరెడ్డి, కొమ్మిరి వెంకటేశ్వరరావు, మచ్చా శ్రీనివాసరెడ్డి, రంగారావు తదితరులు పాల్గొన్నారు. -
నిరంతర సాహితీ సంచారి విహారి
విజయవాడ కల్చరల్ : నిరంతర సాహితీ సంచారి విహారి (జేఎస్ మూర్తి) అని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. విజయవాడ సాహితీ సంస్థలు, సాహితీ మిత్రుల సంయుక్త నిర్వహణలో మొగల్రాజపురంలోని మధుమహాలక్ష్మి కాంప్లెక్స్‌లో ఆదివారం ప్రముఖ సాహితీవేత్త, కథా రచయిత, పదచిత్ర రామాయణకర్త విహారి 60 వసంతాల సాహితీ జీవితం పూర్తి చేసుకున్న నేపథ్యంలో సాహిత్య షష్టిపూర్తి సదస్సును నిర్వహించాయి. సదస్సుకు కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు అధ్యక్షత వహించారు. సాహితీవేత్త మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి మాట్లాడుతూ విహారి భావఝరి పదచిత్ర రామాయణం కమనీయంగా సాగుతుందని చెప్పారు. లయోలా కళాశాల వైస్ ప్రిన్సిపాల్, తెలుగు అధ్యాపకుడు గుమ్మా సాంబశివరావు మాట్లాడుతూ విహారి సాహిత్య జీవితం ఎంతోమంది వర్ధమాన రచయితలను సాహిత్యం వైపు మళ్లించిందని తెలిపారు. చినుకు సంపాదకుడు నండూరి రాజగోపాల్ మాట్లాడుతూ విహారి తెలుగు కథా సాహిత్య విహారి అని అభివర్ణించారు. సదస్సులో ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్, కోశాధికారి కలిమిశ్రీ, కవి పండితులు పువ్వాడ తిక్కన సోమయాజి, ప్రజాసాహితీ సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు, విరసం బాధ్యుడు అరసవల్లి కృష్ణ తదితరులు ప్రసంగించారు. నిర్వాహకులు భావఝరి పదచిత్ర రామాయణం పుస్తకాన్ని ఆవిష్కరించి, విహారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విహారి మాట్లాడుతూ 60 ఏళ్ల సాహిత్య జీవితంలో అనేక అంశాలను ప్రస్థావించారు. కార్యక్రమ సమన్వయకర్తలుగా కావూరి సత్యవతి, బొడ్డపాటి చంద్రశేఖర్ వ్యవహరించారు.