krishnalanka
-
మీవల్లే మేం క్షేమం..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టకపోయి ఉంటే తమ జీవితాలు పూర్తిగా అతలాకుతలమయ్యేవని విజయవాడ కృష్ణలంక ప్రాంత ప్రజలు మాజీ సీఎం వైఎస్‌కు చెప్పుకున్నారు. పులివెందుల పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న ఆయన రిటైనింగ్ వాల్ దగ్గర కృష్ణా నది ప్రవాహాన్ని పరిశీలించేందుకు అక్కడ ఆగారు. దీంతో కృష్ణలంక, రాణిగారితోట, వారధి ప్రాంతాల ప్రజలు అక్కడికి చేరుకుని వైఎస్ జగన్‌తో తమ సంతోషాన్ని పంచుకున్నారు. మీరు చేసిన మంచి పనుల కారణంగా మీం ఈరోజు క్షేమంగా ఉన్నామని, మాకు వరద ప్రమాదం తప్పిందని.. లేదంటే సింగ్‌నగర్ ప్రజల్లా తమ జీవితాలు అతలాకుతలం అయ్యేవని చెప్పారు. ఈ సందర్భంగా వారంతా జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహాయక చర్యల్లో అండగా ఉంటాయని జగన్ వారికి భరోసా ఇచ్చారు. -
వణుకుతున్న బెజవాడ..
సాక్షి, అమరావతి : జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 210కు పెరిగింది. జిల్లాలో మొత్తం 177 కేసులు ఉండగా ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం ఉదయం 11 గంటల మధ్య మరో 33 కొత్త కేసులు జిల్లాలో నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 210కి పెరిగాయి. అలాగే 173 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 29మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాలో ఇప్పటివరకూ 8మంది చనిపోయారు. కాగా రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 80 కేసులు పాజిటివ్‌గా నమోదు అయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1177 పాజిటివ్ కేసులకు గానూ 235మంది డిశ్చార్జ్ అయ్యారు. 31మంది మృతి చెందారు. అయితే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఎటువంటి కరోనా మరణాలు సంభవించలేదు. ప్రస్తుతం 911మంది చికిత్స పొందుతున్నారు. వణుకుతున్న బెజవాడ.. జిల్లాలో ఆదివారం నమోదైన 52 కేసుల్లో 45 విజయవాడ నగరంలోనే ఉన్నాయి. గత నాలుగైదు రోజులుగా కొత్తగా బయటపడుతున్న కేసులన్నీ ఒకటీ ఆరా తప్ప మిగతా అన్నీ విజయవాడకు చెందినవే ఉంటున్నాయి. తాజాగా విజయవాడలో బయటపడిన కేసుల్లో కార్మికనగర్‌కు చెందిన 19 మందికి వైరస్ సోకింది. ఒక యువకుడు దుబాయి నుంచి వచ్చి.. హోం క్వారంటైన్ సక్రమంగా పాటించకపోవడంతో ఈ వ్యాప్తి జరిగింది. అతని తండ్రి, చుట్టుపక్కల ఉండే మరో 8 మందికి పాజిటివ్ వచ్చింది. తాజాగా వీరి నుంచి మరో 19 మంది వైరస్ బారిన పడ్డారు. కృష్ణలంకలో 9 మందికి వైరస్ సోకగా.. అందులో భ్రమరాంబపురంలో ఉండే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. వీరిలో 4 నెలల చిన్నారి ఉండటం ఆందోళన రేపుతోంది. (మా ఫ్యామిలీలో ఆరుగురికి కరోనా: కర్నూలు ఎంపీ) రామవరప్పాడులో కానిస్టేబుల్‌కు.. విజయవాడ గాంధీనగర్‌లో ఆరుగురికి వైరస్ సోకగా అందులో నాలుగేళ్ల బాలిక కూడా ఉంది. అలాగే మధురానగర్‌లో 5, కేదారేశ్వరపేటలో 3, పెనమలూరు 5, విద్యాధరపురం, యారంవారి వీధి, ఉంగుటూరు మండలం తరిగొప్పుల, అజిత్‌సింగ్ నగర్‌లోని గీతామందిర్ కాలనీ, సీతారామపురంలలో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. అలాగే రామవరప్పాడులో నివసిస్తున్న ఒక కానిస్టేబుల్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మిగిలిన సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు. (ఒక్కో వ్యక్తి ద్వారా 20 మందికి వైరస్: కృష్ణా కలెక్టర్) లారీ డ్రైవర్‌పై కేసు వైరస్ వ్యాప్తికి కారణమైన లారీ డ్రైవర్‌పై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణలంక గుర్రాల వీరరాఘవయ్య వీధికి చెందిన వ్యక్తి లారీ డ్రైవరుగా పనిచేస్తుంటాడు. అతను ఇటీవలే పశ్చిమ బెంగాల్ నుంచి నగరానికి వచ్చాడు. లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించి ఇంటి చుట్టుపక్కల వారితో పేకాట, హౌసి వంటి జూదాలు ఆడాడు. అతనికి కొద్దిరోజుల క్రితం కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. అతనితో కలసి ఆటలాడి, సన్నిహితంగా మెలిగిన వారిలో సుమారు 20 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కాగా.. వీరిలో ఒకరు మరణించారు. దీంతో అతనిపై కేసు నమోదు చేశారు. (పేకాట సరదా.. 25 మందికి కరోనా..) -
సోదరుడిపై దాడి చేసి...యువతిని..
సాక్షి, కృష్ణలంక(విజయవాడ తూర్పు) : ఆరుగురు వ్యక్తులు అర్ధరాత్రి ఒక యువతితో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా ఆమె సోదరులపై దాడిచేసి గాయపరిచిన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. కొత్తపేట శ్రీనివాసమహాల్ ప్రాంతానికి చెందిన యువతి(20) ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమె ఇద్దరు సోదరులు కాసుల రాజేష్, ఏసు బుధవారం రాత్రి 12.30 సమయంలో ఆటోలో నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్ళి చికిత్స చేయించారు. అనంతరం టిఫిన్ చేసేందుకు పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ వద్ద హోటల్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ఓ వాహనంలో వచ్చిన ఆరుగురు యువకులు ఒంటరిగా టిఫిన్ చేస్తున్న యువతితో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పక్కనే ఉన్న సోదరులు అడ్డుకోబోయారు. వారిపై దాడిచేసి గాయపరిచి అక్కడ నుంచి వాహనంలో పరారయ్యారు. ఈ ఘటనపై ఆమె కంట్రోల్ రూంకు ఫిర్యాదు చేయడంతో వారు ఇచ్చిన సమాచారం మేరకు కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటనలో పోలీసులు మాత్రం తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని చెబుతున్నారు. -
పేదల గొంతుక వైఎస్సార్ సీపీ
సాక్షి, మొగల్రాజపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేదల గొంతుకగా నిలబడుతుందని పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త యలమంచిలి రవి పేర్కొన్నారు. పార్టీ తొమ్మిదో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 6వ డివిజన్లో మంగళవారం కేక్ కటింగ్, పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా యలమంచిలి రవి మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలనను ముగిసి సంక్షేమ రాజ్యం వైఎస్ జగన్మోహన్రెడ్డి ద్వారా మొదలవుతుందన్నారు. పార్టీ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి సారేపల్లి సుధీర్‌కుమార్, డివిజన్ అధ్యక్షుడు వియ్యపు అమర్నాథ్, బీసీ విభాగం నియోజకవర్గ కన్వీనర్ బొమ్మన శివశ్రీనివాస్, డివిజన్ నాయకులు రేగళ్ల మధు, గౌరి నాయుడు, బి.మహేష్ పాల్గొన్నారు. స్థానిక జమ్మిచెట్టు సెంటర్ సమీపంలోని పార్టీ సీనియర్ నాయకుడు నల్లమోతు మధుబాబు (రమేష్ చౌదరి) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యలమంచిలి రవి పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. మధుబాబుతో పాటుగా బొడా ప్రేమ్, మందా వెంకన్న, లింగారెడ్డి, కోమల్, రణదేవ్, కె.రవి తదితరులు పాల్గొన్నారు. 7వ డివిజన్లో... పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం ఉదయం బందులదొడ్డి సెంటర్లో పార్టీ జెండాను సమన్వయకర్త యలమంచిలి రవి ఆవిష్కరించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నాయకులు పరసా క్లైవ్, జక్రయ్య, జంపాన సాయి కుమార్, ఎం.శ్రీనివాసరావు, ఎన్.ప్రవీణ్, టి.ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం కేక్ కటింగ్ చేశారు. కృష్ణలంకలో... కృష్ణలంక: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కృష్ణలంకలోని 24, 23, 16, 15 డివిజన్లలో ఘనంగా నిర్వహించారు. పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త యలమంచిలి రవి ఆయా ప్రాంతాలలో జరిగిన వేడుకల్లో పాల్గొని పార్టీ జెండాలను ఆవిష్కరించి పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. స్థానిక కృష్ణలంకలోని మలేరియా ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్‌చేశారు. కార్యక్రమంలో 15, 16డివిజన్ల కార్పొరేటర్లు కావటి దామోదర్, మద్దా శివశంకర్, నాయకులు తంగిరాల రామిరెడ్డి, తాటిపర్తి కొండారెడ్డి, నిమ్మల జ్వోతిక, మేడా రమేష్, నాగిరెడ్డి, గోపాల్‌రెడ్డి, రంగారావు, అంజిరెడ్డి, కొమ్మిరి వెంకటేశ్వరరావు, మచ్చా శ్రీనివాసరెడ్డి, రంగారావు తదితరులు పాల్గొన్నారు. -
హైవేపై కారు బీభత్సం, ఒకరు మృతి
-
కృష్ణలంక హైవేపై కారు బీభత్సం
సాక్షి, విజయవాడ: విజయవాడ కృష్ణలంక హైవేపై ఓ కారు బీభత్సం సృష్టించింది. గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు సినీఫక్కిలో ఎదురుగా వస్తున్న లారీ మీద ఎగిరి పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. లారీ డ్రైవర్‌కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. అధిక వేగంతో వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. మృతి చెందిన వ్యక్తిని గుంటూరు జిల్లాకు చెందిన నాగార్జునగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి నుంచి సమాచారం సేకరిస్తున్నారు. -
పసివాడి బతుకు చిదిమాడు
విజయవాడ/కృష్ణలంక(విజయవాడ తూర్పు): నిండా ఎనిమిదేళ్లు కూడా లేని ఓ పాలబుగ్గల పసివాడి ప్రాణాన్ని ఓ ఉన్మాది చిదిమేశాడు. అత్యంత కర్కశంగా కాలువలో ముంచి.. కాళ్లతో తొక్కి మరీ పసివాడి ఉసురు తీశాడు. అనంతరం ఆ కిరాతకుడు ఓ ఇంటర్ విద్యార్థి సహకారంతో కిడ్నాప్ డ్రామాకు తెరతీశాడు. పోలీసులు రంగంలోకి దిగి నిందితుల్ని అరెస్ట్ చేశారు. విజయవాడ డీసీపీ గజరావు భూపాల్ అందించిన వివరాల ప్రకారం.. షికారుకు వెళ్దామని..: విజయవాడ కృష్ణలంక రాణిగారితోట సంగుల పేరయ్యవీధికి చెందిన నడింపల్లి కనకారావు, శ్రీలత దంపతుల రెండో కుమారుడు శివచరణ్ (8) మూడో తరగతి చదువుతున్నాడు. శివచరణ్ శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో స్నేహితులతో ఆడుకునేందుకు బయటకెళ్లాడు. రాజస్తాన్‌కు నుంచి వలస వచ్చిన మస్తాన్ (బిల్లా) అదే ప్రాం తంలో ఐస్‌క్రీం అమ్ముకుం టూ ఉంటాడు. వ్యసనాల కు బానిసైన అతనికి కనకారావు కుటుంబంతో పరిచయముంది. ఈ నేపథ్యంలోనే స్నేహితులతో ఆడుకుంటున్న శివచరణ్‌ను షికారుకని చెప్పి తన బైక్ మీద బందరు కాలువ వద్దకు తీసుకెళ్లాడు. అనంతరం పూటుగా మద్యం తాగి ఉన్న మస్తాన్ ఉన్మాదంతో ఒక్కసారిగా బాలుడి గొంతు పట్టుకుని కాలువలో ముంచి.. కాళ్లతో తొక్కి దారుణంగా హత్యచేశాడు. అనంతరం మస్తాన్ తనకు బాగా తెలిసిన ఓ ఇంటర్ విద్యార్థికి ఫోన్ చేసి పిలిపించి ఆ విద్యార్థి సెల్‌ఫోన్ సిమ్‌కార్డు తీసుకుని తన ఫోన్లో వేసి బాలుడి తండ్రి కనకారావుకు ఫోన్ చేశాడు.రూ. లక్ష ఇవ్వకుంటే శివచరణ్‌ను చంపేస్తానని బెదిరించాడు. అప్పటికే బిడ్డ కోసం వెదుకుతున్న కనకారావు దంపతులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. నగదును ఆ సందులో.. సైకిల్ మీద పెట్టండి! అనంతరం కాసేపటికే మళ్లీ మస్తాన్ ఫోన్‌చేసి విజయవాడ బందరు రోడ్డులోని ఓ మాల్ సమీపంలోని సందులో ఉన్న సైకిల్ మీద నగదు పెట్టి వెళ్లాలని చెప్పాడు. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో మాటువేశారు. కనకారావు నగదును ఆ సందులో ఉన్న సైకిల్ మీద పెట్టి వెళ్లిపోయారు. అనంతరం డబ్బు తీసుకునేందుకు వచ్చిన మస్తాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించేసరికి బాలుడి హత్య విషయం చెప్పాడు. శనివారం ఉదయం ఇంటర్ విద్యార్థిని తను చదువుతున్న కాలేజీకి వెళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కాలువ నుంచి బాలుడి మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. విగతజీవుడిగా మారిన తమ బిడ్డను చూసిన కనకారావు దంపతుల్లో దుఃఖం కట్టలు తెంచుకుంది. హృదయవిదారకంగా విలపిస్తున్న వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. -
టీడీపీపై బీజేపీ యుద్ధం
-
కృష్ణలంకలో మహిళ దారుణహత్య
విజయవాడ : విజయవాడ కృష్ణలంకలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. దుండగులు మహిళ గొంతుకోసి హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దుండగులు మృతదేహాన్ని పొట్టిశ్రీరాములు స్కూల్ ఆవరణలో పడవేశారు. శుక్రవారం ఉదయం మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా మృతురాలు స్థానికంగా నివసిస్తున్న మహిళగా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి... .అర్థరాత్రి సమయంలో మహిళను స్కూల్ ఆవరణలోకి తీసుకు వచ్చి ఇద్దరు, ముగ్గురు ఈ హత్యలో పాల్గొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దుండగులతో మహిళ పెనుగులాడినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. క్లూస్ టీమ్ ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తోంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.