కృష్ణలంకలో మహిళ దారుణహత్య | woman brutally murdered in vijayawada | Sakshi
Sakshi News home page

కృష్ణలంకలో మహిళ దారుణహత్య

Published Fri, Sep 5 2014 12:22 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

woman brutally murdered in vijayawada

విజయవాడ : విజయవాడ కృష్ణలంకలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. దుండగులు మహిళ గొంతుకోసి హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దుండగులు మృతదేహాన్ని పొట్టిశ్రీరాములు స్కూల్ ఆవరణలో పడవేశారు. శుక్రవారం ఉదయం మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా మృతురాలు స్థానికంగా నివసిస్తున్న మహిళగా పోలీసులు గుర్తించారు.

 

ప్రాథమిక ఆధారాలను బట్టి... .అర్థరాత్రి సమయంలో మహిళను స్కూల్ ఆవరణలోకి తీసుకు వచ్చి ఇద్దరు, ముగ్గురు ఈ హత్యలో పాల్గొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దుండగులతో మహిళ పెనుగులాడినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. క్లూస్ టీమ్ ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తోంది. మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement