
సాక్షి, కృష్ణలంక(విజయవాడ తూర్పు) : ఆరుగురు వ్యక్తులు అర్ధరాత్రి ఒక యువతితో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా ఆమె సోదరులపై దాడిచేసి గాయపరిచిన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. కొత్తపేట శ్రీనివాసమహాల్ ప్రాంతానికి చెందిన యువతి(20) ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమె ఇద్దరు సోదరులు కాసుల రాజేష్, ఏసు బుధవారం రాత్రి 12.30 సమయంలో ఆటోలో నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్ళి చికిత్స చేయించారు. అనంతరం టిఫిన్ చేసేందుకు పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ వద్ద హోటల్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ఓ వాహనంలో వచ్చిన ఆరుగురు యువకులు ఒంటరిగా టిఫిన్ చేస్తున్న యువతితో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పక్కనే ఉన్న సోదరులు అడ్డుకోబోయారు. వారిపై దాడిచేసి గాయపరిచి అక్కడ నుంచి వాహనంలో పరారయ్యారు. ఈ ఘటనపై ఆమె కంట్రోల్ రూంకు ఫిర్యాదు చేయడంతో వారు ఇచ్చిన సమాచారం మేరకు కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటనలో పోలీసులు మాత్రం తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment