కృష్ణలంక హైవేపై కారు బీభత్సం | Car Rams Into Lorry At Vijayawada Krishna Lanka Highway | Sakshi
Sakshi News home page

కృష్ణలంక హైవేపై కారు బీభత్సం

Published Thu, Feb 21 2019 7:34 AM | Last Updated on Thu, Feb 21 2019 4:21 PM

Car Rams Into Lorry At Vijayawada Krishna Lanka Highway - Sakshi

సాక్షి, విజయవాడ: విజయవాడ కృష్ణలంక హైవేపై ఓ కారు బీభత్సం సృష్టించింది. గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు సినీఫక్కిలో ఎదురుగా వస్తున్న లారీ మీద ఎగిరి పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. లారీ డ్రైవర్‌కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. అధిక వేగంతో వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. మృతి చెందిన వ‍్యక్తిని గుంటూరు జిల్లాకు చెందిన నాగార్జునగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి నుంచి సమాచారం సేకరిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement