
ఎస్వీ పాఠశాలలో జయంతి వేడుకలు
రెబ్బెన : నేటి తరం యువత సుభాష్‌చంద్రబోస్‌ను ఆదర్శంగా తీసుకుని దేశ సేవ చేయాలని సింగరేణి పాఠశాల హెచ్‌ఎం వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం గోలేటిలోని సింగరేణి ఉన్నత పాఠశాలో సుభాష్ చంద్రబోస్ 121వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో ఉపాధ్యాయలు శ్రీనివాసరావు, అరుణ్‌కుమార్, పీఈటీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్వీ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం సంజీవ్, కరస్పాండెంట్ విజయకుమారి పాల్గొన్నారు. అలాగే టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో గోలేటి టౌన్‌షిప్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ మస్క రమేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment