subash chandra bose
-
బోస్ పోరాటం నేటి యువతకు ఆదర్శనీయం: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నివాళులర్పించారు.భారతదేశ స్వాతంత్ర్యం కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన పోరాటం నేటి యువతకు ఆదర్శనీయం. ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి భారతీయుల్లో పోరాట స్ఫూర్తిని నింపిన యోధుడు ఆయన నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నివాళులు అని ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ పోస్ట్ చేశారు.భారతదేశ స్వాతంత్ర్యం కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన పోరాటం నేటి యువతకు ఆదర్శనీయం. ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి భారతీయుల్లో పోరాట స్ఫూర్తిని నింపిన యోధుడు ఆయన. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నివాళులు.— YS Jagan Mohan Reddy (@ysjagan) January 23, 2025 -
కోల్‌కతా విమానాశ్రయానికి వందేళ్లు
కోల్‌కతా: సిటీ ఆఫ్ జాయ్.. భారతదేశపు ఒకనాటి రాజధాని.. బ్రిటిష్ ఇండియా పాలనలో దేశంలోని ఇన్నో కీలక ఘట్టాలకు వేదికగా నిలిచినా మహానగరం కలకత్తా.. ఇప్పుడు ఒకనాడు డమ్ - డమ్ విమానాశ్రయంగా పేరుగాంచి తరువాత 1995 లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చుకున్న కలకత్తా విమానాశ్రయం ఈ ఏడాది వందేళ్ల పండగను జరుపుకోనుంది. వాస్తవానికి కోల్‌కతా 1772 - 1912 మధ్య భారత రాజధానిగా ఉండేది. ఆ తరువాత 1924లో కోల్‌కతాలో విమానాశ్రయం ఏర్పాటైంది. ఈశాన్య రాష్ట్రాలతోబాటు అటువైపునున్న దేశాలన్నిటికీ ముఖద్వారం వంటి కోల్‌కతా నుంచి విమాన కార్యకలాపాలు మొదలయ్యాయి. ఇప్పుడు దేశంలోని ప్రముఖ విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచినా సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ఏడాదితో వందేళ్లు పూర్తి చేసుకుంటోంది.వందేళ్ల క్రితం క్రితం .. ఇంకా చెప్పాలంటే అంతకు ముందే... 1900ల కాలంలో చిన్న ఎయిరోడ్రోముగా మొదలైన కలకత్తా ప్రస్థానం.. 1924 నాటికి పూర్తి స్థాయి విమానాశ్రయంగా మారింది. అప్పట్లో నెదర్లాండ్స్ కు చెందిన కెఎల్ఎం ఎయిర్ లైన్స్ (KLM airlines ) ఆమ్స్టర్డామ్ నుంచి ఇండోనేషియాలోని జకార్తాకు నడిపే విమానానికి కోల్ కతాలో స్టాప్ ఇచ్చేది. అలా అందర్జాతీయ విమానసర్వీసులు మొదలైన ఈ విమానాశ్రయం ఆ తరువాత ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగింది.. ఆకాశాన్ని ఎందుకులే లోహ విహంగాలకు ఆశ్రయం ఇస్తూ.. అంతర్జాతీయ స్థాయికి చేరింది.1924లో బ్రిటన్ కు చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్ విమానం ఇక్కడ ల్యాండ్ అయింది.ఆ తరువాత మే 2న ఫ్రెంచ్ పైలట్ మిస్టర్ డోయ్సీ రాక కూడా జరిగింది. అదే సంవత్సరం, డమ్ డమ్ విమానాశ్రయంలో తొలిసారిగా రాత్రిపూట విమానం ల్యాండ్ అవడం, ఓ గొప్ప ముందడుగుకు నాంది అని చెప్పవచ్చు. మొదట్లో టార్చిలైటు వెలుగులో విమానాలను రాత్రిపూట ల్యాండ్ చేసేవాళ్ళు. వాస్తవానికి ఈ విమానాశ్రయం అటు యూరోప్.. ఉత్తర అమెరికాలనుంచి ఇటు ఆసియావైపు వెళ్లే విమానాలకు మార్గమధ్యంలో ఒక టెక్నీకల్ హాల్ట్‌గా గణనీయంగా ఉపయోగపడడం మొదలయ్యాక దాని స్థాయి అమాంతం పెరిగిపోయిడ్ని. ఆ రెండు మార్గాల నడుమ నడిచే విమానాలన్నీ కలకత్తాలో కాసేపు ఆగి.. ఇంధనం నింపుకు వెళ్లడం.. విమానాల సాంకేతికత తనిఖీ వంటి పనులన్నీ ఇక్కడే చేసుకునేవాళ్ళు. దీంతో అనివార్యంగా ఇక్కడ రద్దీ పెరుగుతూ వచ్చింది.ఇదిలా ఉండగానే 1929లో అప్పటి అప్పటి బెంగాల్ గవర్నర్ సర్ స్టాన్లీ జాక్సన్ డమ్ డమ్ ఏరోడ్రోమ్‌లో బెంగాల్ ఫ్లయింగ్ క్లబ్‌ను ప్రారంభించి విమానాశ్రయ హోదాను మరింతగా పెంచారు.నేతాజీ సుభాష్ చంద్రబోస్ అప్పట్లో బ్రిటిష్ వారితో చేసిన యుద్ధానికి సైతం కోల్ కతా విమానాశ్రయం వేదిక ఐంది. 1938లో బోస్ ఇక్కణ్నుంచే బ్రిటిష్ వారిపై సమరశంఖాన్ని పూరించారు. రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలంలో, కోల్‌కతా వాణిజ్య విమానాలకు కీలక గమ్యస్థానంగా మారింది. 1940-1960ల మధ్య, విమానాశ్రయం ఏరోఫ్లాట్, ఎయిర్ ఫ్రాన్స్ మరియు పాన్ ఆమ్ వంటి అంతర్జాతీయ విమానయాన సంస్థలకు ప్రముఖ స్టాప్ ఓవర్ హబ్‌గా మారింది. 1990 తరువాత దశమారింది. 1990ల నాటికి, కోల్‌కతా విమానాశ్రయం ప్రయాణీకు లు,కార్గో కార్యకలాపాలకు ప్రధాన అంతర్జాతీయ, దేశీయ కేంద్రంగా ఎదిగింది1990లలో, విమానాశ్రయం ఆధునీకరణ చేయగా 1995లో నిర్మించిన కొత్త దేశీయ టెర్మినల్ భారత విమానయాన రంగం వృద్ధిని ప్రతిబింబిస్తుంది.అదే ఏడాది దీనిపేరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చారు.2000లలో భారత వైమానిక రంగం గొప్ప పురోగతి సాధించింది. తక్కువ ధరలకే విమాన ప్రయాణం అంటూ సరికొత్త ప్రయివేటు విమాన సంస్థలు రావడంతో దేశంలోని అన్ని విమానాశ్రయాల మాదిరే ఇక్కడా రద్దీ పెరిగింది. తద్వారా విమానాశ్రయం గణనీయమైన అభివృద్ధిని నమోదు చేసింది.2013లో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణం, రన్‌వే పొడిగింపు వంటి అభివృద్ధి పనులతో ఈ విమానాశ్రయం ప్రాధాన్యం అమాంతం ఆకాశాన్ని అంటింది. ప్రస్తుతంప్రస్తుతం పాతికదేశాలకు పైగా విమానయాన సంస్థలు వాణిజ్యకార్యకలాపాలను ఇక్కణ్ణుంచి కొనసాగిస్తున్నాయి. వందలాది విమానాలు.. కార్గో సంస్థలకు కోల్ కతా ఇప్పుడు ప్రధాన వాణిజ్యకేంద్రంగా మారింది. 2023- 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇక్కణ్ణుంచి 1,97,84,417 మంది దేశీయ, అంతర్జాతీయ ప్రయాణీకులు వివిధ దేశాలకు, ప్రాంతాలకు పయనమయ్యారు. దాదాపు రోజూ 430 విమానాలు ఇక్కడికి వచ్చిపోతుంటాయి. ఈశాన్య భారతదేశపు ఆర్థిక, వాణిజ్య, రవాణా రంగాన్ని మరింత ముందుకు నడిపించడంలో కీలకముగా ఉన్న సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ఏడాది వందో పుట్టినరోజును జరుపుకుంటోంది. సిటీ ఆఫ్ జాయ్ గా పేరొందిన కోల్ కతా తో బాటు ఈశాన్య భారతానికే కాకుండా పలు ఆసియా దేశాలకు ఈ విమానాశ్రయం ఒక ముఖద్వారం.. ఈ వందేళ్ల పండుగకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.:::సిమ్మాదిరప్పన్న -
సుభాష్ చంద్రబోస్ ఏం చదువుకున్నారు? ఐసీఎస్ ఎందుకు వద్దన్నారు?
నేడు (జనవరి 23) స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి. బోస్ పుట్టిన రోజును శౌర్య దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 2021లో బోస్ జయంతిని శౌర్య దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ విద్యార్హతలు ఏమిటి? ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినా, బోస్ ఎందుకు ఆ ఉద్యోగంలో చేరలేదో తెలుసుకుందాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1897, జనవరి 23న ఒడిశాలోని బెంగాల్ డివిజన్లోని కటక్‌లో జన్మించారు. బోస్ తన తల్లిదండ్రులకు తొమ్మిదవ సంతానం. బోస్ నాటి కలకత్తాలో ఫిలాసఫీలో గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత తదుపరి చదువుల కోసం ఇంగ్లండ్‌కు వెళ్లారు. బోస్ కేవలం తన 24 ఏళ్ల వయసులో ఐసీఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఉన్నత ఉద్యోగాల అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహించే ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ, బ్రిటీష్ వారికి బానిసగా ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఈ ఉద్యోగంలో చేరలేదు. బోస్ స్వాతంత్ర్య పోరాటంలో కాలుమోపేందుకు ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చి, నాటి ప్రముఖ నేత చిత్తరంజన్ దాస్‌తో జతకట్టారు. 1921లో చిత్తరంజన్ దాస్‌కు చెందిన స్వరాజ్ పార్టీ ప్రచురించే ‘ఫార్వర్డ్’ అనే వార్తాపత్రికకు సంపాదకత్వ బాధ్యతలను బోస్ స్వీకరించారు. 1920 నుంచి 1942 వరకు భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఆవిష్కరింపజేసే ‘ది ఇండియన్ స్ట్రగుల్’ అనే పుస్తకాన్ని బోస్ రచించారు. బోస్ 1939లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అయితే కొంతకాలానికే బోస్ ఆ పదవికి రాజీనామా చేశారు. నేతాజీ తన జీవితకాలంలో 11 సార్లు జైలు శిక్ష అనుభవించారు. ఇది కూడా చదవండి: స్వాతంత్య్రాన్ని ఊహించిన ‘బోస్’ ఏం చేశారు? -
స్వాతంత్య్రాన్ని ఊహించిన ‘బోస్’ ఏం చేశారు?
భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పలువురు నేతలు కీలకపాత్ర పోషించారు. అయితే అటువంటి వారిలో ఒకరైన సుభాష్ చంద్రబోస్ పోషించిన పాత్ర ఎనలేనిది. ఈరోజు(జనవరి 23) నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి. 2021 సంవత్సరంలో బోస్ జయంతిని శౌర్య దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందే సుభాష్ చంద్రబోస్ భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారనే సంగతి మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశానికి 1947లో బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం లభించింది. అయితే దీనికి నాలుగేళ్ల క్రితమే సుభాష్ చంద్రబోస్ భారతదేశంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1943 అక్టోబరు 21న భారత్‌కు స్వాతంత్ర్యం రాకముందే బోస్ సింగపూర్‌లో ‘ఆజాద్ హింద్’ ప్రభుత్వాన్ని స్థాపించారు. తాను చేపట్టిన ఈ చర్యతో భారతదేశంలో బ్రిటిష్ పాలన ఎక్కువ కాలం సాగదని బ్రిటీష్ వారికి బోస్ సందేశం ఇచ్చారు. 1943, జూలై 4న సింగపూర్‌లోని క్యాథే భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో స్వాతంత్ర్య పోరాట యోధుడు రాస్ బిహారీ బోస్ ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ బాధ్యతలను సుభాష్ చంద్రబోస్‌కు అప్పగించారు. ఈ నేపధ్యంలో ఆజాద్ హింద్ ప్రభుత్వం 1943, అక్టోబర్ 21న స్థాపితమయ్యింది. జపాన్, ఫిలిప్పీన్స్, జర్మనీ తదితర తొమ్మిది దేశాల నుంచి కూడా ఈ ప్రభుత్వానికి గుర్తింపు వచ్చింది. ఈ ప్రభుత్వంలో సుభాష్ చంద్రబోస్ ప్రధానమంత్రిగా, విదేశాంగ మంత్రిగా, రక్షణ మంత్రిగా పనిచేసినట్లు సమాచారం. ఆర్థిక శాఖను ఎస్సి ఛటర్జీకి, ప్రచార విభాగాన్ని ఎస్ఎకి అప్పగించారు. ఈ తాత్కాలిక ప్రభుత్వం అనేక దేశాలలో రాయబార కార్యాలయాలను కూడా ప్రారంభించింది. ఆజాద్ హింద్ ఫౌజ్ తాత్కాలిక ప్రభుత్వం తపాలా స్టాంపులను కూడా విడుదల చేసింది. నేషనల్ ఆజాద్ బ్యాంక్, ఆజాద్ హింద్ రేడియో, రాణి ఝాన్సీ రెజిమెంట్లను కూడా ఏర్పాటు చేసింది. ఆ సమయంలో బోస్ ఆజాద్ హింద్ ఫౌజ్‌లో మహిళల విభాగాన్ని ఏర్పాటు చేశారు. నాటి మహిళా విభాగానికి చెందిన సైనికులు వైద్యం, గూఢచర్యంలో నిపుణులుగా పేరొందారు. ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ను 1915, అక్టోబరు 29న రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్, రాస్ బిహారీ బోస్, నిరంజన్ సింగ్ గిల్ స్థాపించారు. తర్వాత వారు దానిని సుభాష్ చంద్రబోస్‌కు అప్పగించారు. వివిధ నివేదికల ప్రకారం ఆ సమయంలో బోస్ సారధ్యంలో 85 వేల మంది సాయుధ సైనికులు ఉండేవారు. 1943 డిసెంబర్ 30న బ్రిటిష్ వారిని ఓడించిన తర్వాత అండమాన్ నికోబార్‌లో తొలిసారిగా ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. దీనికి సుభాష్ చంద్రబోస్ సారధ్యం వహించారు. -
అందుకే అమిత్ షా పిలిచినా వెళ్లలేదు : హీరో నిఖిల్
కార్తికేయ-2, 18 పేజెస్ చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో దూసుకుపోతున్నాడు హీరో నిఖిల్. ఆయన తాజాగా మరో పాన్ ఇండియా సినిమా ‘స్పై’ తో రానున్నారు. సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న మిస్టరీ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. జూన్ 28న ఈ ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో మీడియా ప్రతినిథులు అడిగిన పలు ప్రశ్నలకు నిఖిల్ సమాధానమిస్తూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మొన్న కార్తికేయ 2, ఇప్పుడు స్పై.. మీరు ఓ పార్టీకి అనుకూలంగా ఈ సినిమాలు తీస్తున్నారా? అమిత్ షా మిమ్మల్ని కలవాలని పిలిచారంట కదా ఓ మీడియా ప్రతినిథి అడగ్గా.. నిఖల్ మాట్లాడుతూ.. 'అమిత్ షా నుంచి నాకు ఆహ్వానం అందింది. కానీ ఇలాంటి సినిమాలు చేస్తున్న సమయంలో రాజకీయాలకు దూరంగా ఉంటే మంచిదని ఉద్దేశంతో నేను వెళ్లలేదు. నన్ను ఆహ్వానించినందుకు అమిత్ షాకు థ్యాంక్స్. నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు.ఏ పార్టీకి అనుకూలంగా సినిమాలు చేయడం లేదు. ఒక భారతీయుడిగా సినిమాలు చేస్తున్నాను' అంటూ నిఖిల్ వివరించారు. -
నేతాజీ జీవిత రహస్యాలతో...
‘‘నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కి సంబంధించి మీరు ఎప్పుడూ వినని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. అందుకే మొదటి టీజర్‌ని నేతాజీ విగ్రహం వద్ద విడుదల చేయాలనుకున్నాం. ఇక్కడ టీజర్‌ను విడుదల చేసే అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నాం. నేతాజీ జీవితంపై సాగే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ చిత్రం ఇది’’ అన్నారు నిఖిల్. స్వాతంత్య్ర సమర యోధుడు సుభాష్ చంద్రబోస్ జీవితంలోని రహస్యాల ఆధారంగా రూపొందిన చిత్రం ‘స్పై’. నిఖిల్ హీరోగా గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో కె. రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను సోమవారం న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో సుభాష్ చంద్రబోస్ విగ్రహం దగ్గర రిలీజ్ చేశారు. నేతాజీ మరణం తాలూకు మిస్టరీని ఛేదించే స్పై పాత్రలో నిఖిల్ కనిపిస్తారు. ఐశ్వర్యా మీనన్, సన్యా ఠాకూర్ కథానాయికలుగా, ప్రత్యేక పాత్రలో ఆర్యన్ రాజేష్ కనిపించనున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో జూన్ 29న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్, కెమెరా: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్. -
నేను నమ్ముతున్నాను
నేను నమ్ముతున్నాను.. మహిళా భాగస్వామ్యం కూడా ఉంటే త్వరగా స్వాతంత్య్రం సిద్ధిస్తుందని. నేను నమ్ముతున్నాను.. మహిళలూ కదనరంగంలోకి దుమికితే.. భారతదేశంలో అణువణువునా స్వాతంత్య్ర కాంక్ష రగులుతోందన్న సంకేతం బ్రిటన్ కు అందుతుందని.. ఎనభై ఏళ్ల క్రితమే ఏ బలాలు, దళాలు లేని కాలంలో స్వాతంత్య్ర సంగ్రామానికి మహిళల్ని ఏ ధైర్యంతో ఆహ్వానించారు సుభాస్‌చంద్రబోస్?! ధైర్యంతో కాదు. మహిళా శక్తిపై ఉన్న నమ్మకంతో! ఆ నమ్మకంతోనే బోస్ ‘రాణీ ఝాన్సీ’ మహిళా రెజిమెంట్‌ను స్థాపించి, వారి తుపాకులను బ్రిటిష్‌వారి పైకి ఎక్కుపెట్టించారు! 1943 జూలై 9, సింగపూర్.. బోస్ మాట్లాడుతున్నాడు.. సుభాస్ చంద్రబోస్! ఎదురుగా భారతీయులు.. అరవై వేల మంది! ఇల్లొదిలి, దేశం వదలి తనెందుకు వచ్చిందీ చెప్పాడు. అయితే అది కాదు అతడు చెప్పబోతున్నదని అక్కడి వారికి అర్థమైపోయింది. ఇంకేదో చెప్పబోతున్నాడు. ఏంటది? ‘‘మహిళలు కూడా తుపాకులు అందుకోవాలి’’ అన్నాడు బోస్. ఒక్కసారిగా నిశ్శబ్దం! ‘‘వాళ్లొచ్చి ఏం చేస్తారు బోస్.. భారం అవుతారు ఆజాద్ హింద్ ఫౌజ్‌కి’’.. ఎవరో అన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్ (ఇండియన్ నేషనల్ ఆర్మీ – ఐఎన్ఎ) .. బోస్ నిర్మించిన సైనిక దళం. గొరిల్లా, ఇన్ఫాంట్రీ, స్పెషల్ ఆపరేషన్స్.. వెరీ డేంజరస్! ఐఎన్ఎ అలికిడి అయితే చాలు.. బ్రిటిష్ ప్రభుత్వం ఉలిక్కిపడుతోంది. అప్పటికి ఏడాదైంది బోస్ ఐఎన్ఎ ని తయారుచేసి. అందులోకే ఇప్పుడు మహిళల్ని రమ్మంటున్నాడు. ‘‘ఒంట్లో సత్తువ ఉన్న ప్రతి ఒక్కరూ.. ఇంట్లో దూరిన శత్రువుని తరిమికొట్టడానికి సైన్యంలోకి రావాలి’’ అన్నాడు బోస్. ‘‘ఏం చేస్తారు బోస్.. మహిళలు సైన్యంలోకి వచ్చి?’’ మళ్లీ అదే ప్రశ్న. ఆ ప్రశ్నకు బోస్ గర్జించాడు. ఎవరూ చేతుల్లేపలేదు! ‘‘ఝాన్సీ లక్ష్మీబాయి ఏం చేసిందో అదే చేస్తారు. ఝాన్సీ లక్ష్మీబాయి ఎలా ఖడ్గాన్ని తిప్పిందో అలాగే ఖడ్గాన్ని తిప్పుతారు. తిరుగు బాటుకు, స్వాతంత్య్ర సంగ్రామానికి అప్పుడున్నది ఒక్క లక్ష్మీబాయే. ఇప్పుడు ప్రతి మహిళా ఒక లక్ష్మీబాయి. నేను నమ్ముతున్నాను.. మహిళా భాగస్వామ్యం కూడా ఉంటే త్వరగా స్వాతంత్య్రం సిద్ధిస్తుంది. నేను నమ్ముతున్నాను.. మహిళలూ కదనరంగంలోకి దుమికితే.. భారతదేశంలో అణువణువునా స్వాతంత్య్ర కాంక్ష రగులుతోందన్న సంకేతం బ్రిటన్ కు అందుతుంది..’’. బోస్ ప్రసంగం ముగించాడు. ముగిస్తూ, చెయ్యి ముందుకు చాపి.. ప్రమాణం చేస్తున్నట్లుగా అన్నాడు. ‘‘మన మహిళా దళం పేరు.. ‘రాణీ ఝాన్సీ రెజిమెంట్’ అన్నాడు. ఎవరూ చేతుల్లేప లేదు!‘‘ఇక స్వాతంత్య్రం వచ్చినట్లే’’.. ఎవరో అన్నారు. ‘అవునవును’.. ఇంకో గొంతు. మరికొన్ని వంత గొంతుకలు. మూడ్రోజులు గడిచాయి. చప్పుడు లేదు. నాలుగో రోజు సింగపూర్‌లోనే.. ‘ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్’ (ఐఐఎల్) మీటింగ్ జరుగుతోంది. ఐఐఎల్ మహిళా విభాగం మీటింగ్ అది. అక్కడికి వెళ్లాడు బోస్. ‘నా పేరు బోస్.. !’ ఇండియా బయట ఉండి, ఇండియన్ ఇండిపెండెట్స్ కోసం పోరాడుతున్న భారతీయులంతా కలిసి పెట్టుకున్న రాజకీయపార్టీ ఐఐఎల్.‘‘నా పేరు బోస్. మీలాగే భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న ఒక సైనికుడిని’’ అన్నాడు బోస్. మీటింగ్‌లోని మహిళలు కొందరు సంభ్రమంగా చూశారు. ‘మీలాగే’ అన్న మాట.. వారిలో ఉత్తేజాన్ని నింపింది. ‘‘మీతో కలిసి బ్రిటిష్ వాళ్లపై పోరాటం చేయాలనుకుంటున్నాను’’ అన్నాడు బోస్. బోస్‌తో కలిసి పోరాడాలని అనుకుంటారు ఎవరైనా. కానీ బోసే అంటున్నాడు ‘నేను మీతో కలిసి పోరాడతాను’ అని! ఆశ్చర్యంగా కళ్లింత చేసి చూశారు మహిళలు. సమావేశంలో డాక్టర్ లక్ష్మీ స్వామినాథన్ ఉన్నారు. సింగపూర్‌లో ఐఐఎల్ మహిళా విభాగంలో ఆమెది ముఖ్య పాత్ర. ఆ సమావేశంలోనే.. బోస్కి మహిళలతో ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ ఇప్పించాలన్న నిర్ణయం జరిగింది. అంటే సైనిక వందనం! ఎక్కడ దొరుకుతారు?! సైనిక వందనం ఇప్పించేందుకు మహిళలైతే ఉన్నారు. మహిళా సైనికులు ఎక్కడ దొరుకుతారు.. ‘గార్డ్ ఆఫ్ ఆనర్’కి?! కష్టపడి ఓ ఇరవై మంది సాధారణ మహిళల్ని ఒప్పించగలిగారు. బోస్ ఐఎ¯Œ ఎ దళం నుంచి లీ–ఎన్ఫీల్డ్ 303 రైఫిల్స్ తెప్పించారు. వాటిని ఎలా పట్టుకోవాలో, ఎలా వందన సమర్పణ చేయాలో ఆ ఇరవై మందికి అప్పటికప్పుడు నేర్పించారు. యూనిఫారాల్లేవు. చీరల వస్త్రధారణలోనే గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. వందన సమర్పణ ముగిసింది. బోస్ ప్రసంగం మొదలైంది. ‘‘స్వాతంత్య్రం కోసం దశాబ్దాలుగా మగాళ్లకు దీటుగా మీరూ ముందుకు నడుస్తున్నారు. నాకనిపిస్తున్నది ఏమిటంటే.. ముందుకు నడవడమే కాదు, ముందుకు నడిపించగలరు కూడా మీరు’’. ఆ ఒక్కమాట చాలదా మహిళలు తుపాకీని భుజానికెత్తుకోడానికి. ఎత్తుకున్నారు. ఖిన్నుడైన జనరల్ కానీ, అదంత తేలిగ్గా ఏమీ జరగలేదు. ఆడవాళ్లెందుకు ఆజాద్ హింద్ ఫౌజ్‌లోకి అనే ప్రశ్న మళ్లీ వచ్చింది. బోస్కి సైనిక వందనం చేసిన మహిళల్లో డాక్టర్ నసీరా కయానీ అనే డాక్టర్ కూడా ఉన్నారు. రైఫిల్‌ని ఎత్తిపట్టుకున్న ఆ గ్రూపులో ఉన్న నసీరాను చూసి ఆజాద్ హింద్ ఫౌజ్ కు జనరల్‌గా ఉన్న మొహమ్మద్ జమాన్ కయానీ ఖిన్నుడయ్యాడు. తన భార్యేమిటీ, అకస్మాత్తుగా ఇక్కడ ప్రత్యక్షం అయిందేమిటీ? అని ఆశ్చర్యపోయాడు. ఇంటికి వెళ్లాక నసీరాను కోప్పడ్డాడు. ‘‘డాక్టర్ లక్ష్మీ స్వామినాథన్ కాలేజ్‌లో నా క్లాస్మేట్. తను రమ్మంటే వెళ్లాను’ అని భర్తకు చెప్పారు నసీరా. ఆర్‌జెఆర్ (రాణి ఝాన్సీ రెజిమెంట్) లో చేరదామని వెళ్లి కూడా, భర్త వద్దనడంతో ఆమె ఆగిపోయారు. పైస్థాయిలోనే ఇలా ఉంటే, కింది స్థాయిలో ఇంట్లో మగాళ్లు మహిళల్ని సైన్యంలోకి వెళ్లనిస్తారా? అయినా ఆర్‌జెఆర్ నిలబడింది. నిలదొక్కుకుంది. కలబడింది. బలపడింది. కదిలివచ్చిన కొద్దిపాటి మహిళలతోనే నేతాజీ మహిళా సైన్యం 1943 అక్టోబర్ నుంచి 1945 మే వరకు ఉరుములా, మెరుపులా వెయ్యి మంది సైనికులతో ఉనికిలో ఉంది. కెప్టెన్ లక్ష్మీ సెహెగల్ (లక్ష్మీ స్వామినాథనే లక్ష్మీ సెహెగల్) ఈ దళాన్ని నడిపించారు. 1945 అక్టోబర్‌లో ప్రపంచ యుద్ధం పూర్తయింది. అంతకు రెండు నెలల ముందే ఆగస్టులో సుభాస్ చంద్రబోస్ అదృశ్యమయ్యారు. ఆ అదృశ్యశక్తి మహిళల్లో పోరాట పటిమకు శక్తినిస్తూ ఎప్పుడూ నడిపిస్తూనే ఉంటుంది. – సుభాస్ చంద్రబోస్ -
సుభాష్ చంద్రబోస్: దేశభక్త యువరాజు
న్యూఢిల్లీ: ఉత్తర జర్మనీలోని కీల్లో 1943 ఫిబ్రవరి 8 న బోస్ యు–బోట్ ఎక్కారు. ప్రయాణం మధ్యలో ఆయన ఒక జర్మనీ నౌక నుంచి ఒక జపనీస్ జలాంతర్గామిలోకి మారడానికి సముద్ర మధ్యంలో ఒక రబ్బరు తెప్ప మీద నుంచి నడిచి వెళ్లాల్సి వచ్చింది. 90 రోజులు ప్రయాణించి సుమత్రా దీవిలోని సబాంగ్‌కి చేరుకున్నారు. అక్కడి నుంచి సింగపూర్‌కి విమానంలో వెళ్లారు. అక్కడే ఆయన 1943 జూలై 4–5 తేదీల మధ్య ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐ.ఎన్.ఎ) నాయకత్వాన్ని చేపట్టారు. అంతకు క్రితం 1941 జనవరి 16–17 తేదీల మధ్య, కలకత్తాలోని తన ఇంటి నుంచి బోస్ రహస్యంగా నిష్క్రమించారు. ముహమ్మద్ జియావుద్దీన్ పేరుతో ఉత్తర భారత ముస్లిం బీమా ఏజెంటుగా ఆయన అవతారం ఎత్తారు. జర్మనీ తయారీ అయిన వాండరర్ కారులో బంధువు శిశిర ఆయనను గోమో రైల్వే జంక్షన్‌కి తీసుకెళ్లారు. ఢిల్లీ–కల్కా మెయిల్ ఎక్కిన బోస్, మధ్యలోనే ఫ్రాంటియర్ మెయిల్‌కి మారి పెషావర్‌కి తన ప్రయాణాన్ని మళ్లించారు. మూగ, చెవిటి పఠాన్‌గా నటిస్తూ, వాయవ్య సరిహద్దులో గిరిజన ప్రాంతాలను కాలి నడకన దాటారు. భారతీయ సరిహద్దులను జనవరి 26న దాటి, 1941 జనవరి 31న కాబూల్ చేరుకున్నారు. ఇదంతా హిట్లర్‌ను కలవడం కోసం. ఎందుకంటే స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా, బ్రిటిష్ సైన్యంలోని సామాన్య భారతీయ సైనికుల విధేయతను బ్రిటిష్ చక్రవర్తి నుంచి మళ్లించడానికి బోస్కి మరొక రాజ్యాధినేత అవసరం అయ్యారు. అయితే హిట్లర్ సహకారం అందక పోవడంతో ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు 1943, 1945ల మధ్య ఎర్రకోటలో కొందరు ఐ.ఎన్.ఎ. అధికారుల మీద జరిగిన విచారణ బోస్ పేరును, ఐ.ఎన్.ఎ. పేరునూ ఇంటింటికీ తీసుకెళ్లింది. ‘‘దేశమే జాగృతమయింది. సైన్యంలో సైతం కొత్త రాజకీయ స్పృహ కలిగించింది’’ అని మహాత్మా గాంధీ వ్యాఖ్యానించారు. ‘‘దేశ భక్తుల్లో యువరాజు’’ అని నేతాజీని గాంధీజీ కీర్తించారు. తానే ప్రారంభించిన ఆజాద్ హింద్ ప్రభుత్వానికి చెందిన సేనగా బోస్ ఐ.ఎన్.ఎ.ని తీర్చిదిద్దారు. ఐ.ఎన్.ఎ. మహిళా విభాగానికి ఝాన్నీ రాణి రెజిమెంట్ అని ఆయన పేరు పెట్టారు. – సుగతా బోస్, హార్వర్డ్ యూనివర్సిటీలో చరిత్ర ఆచార్యులు -
దేశానికి నాలుగు రాజధానులు : మమత
కోల్‌కతా: దేశానికి నాలుగు రొటేటింగ్ రాజధానులు ఉండాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. కోల్‌కతాను రాజధానిగా చేసేకొని అప్పట్లో ఆంగ్లేయులే పాలించారని, అలాంటప్పుడు దేశవ్యాప్తంగా ఒకే రాజధాని ఎందుకు ఉండాలని ఆమె ప్రశ్నించారు.నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నేతాజీ జయంతిని పురస్కరించుకొని కేంద్రం జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. (ఆపరేషన్ బెంగాల్.. అంత ఈజీ కాదు!) దేశ్‌నాయక్ దివాస్‌గా జరుపుకునే నేతాజీ పుట్టిరోజు గురించి మనందరికీ తెలిసినా, ఆయన మరణం గురించి మాత్రం ఎవరికీ తెలియదని అన్నారు. మాతృభూమిపై సమానంగా నేతాజీపై ప్రేమ ఉన్నది కొద్ది మందికే అని, కొందరు మాత్రం ఎలక్షన్స్‌ను దృష్టిలో ఉంచుకొని ఆయన సంబరాలు నిర్వహిస్తున్నారని బీజేపీని పరోక్షంగా విమర్శించారు. (మమతకు షాక్.. మరో ఎమ్మెల్యే బీజేపీలోకి జంప్!) -
కాకినాడ కలెక్టరేట్లో సాగునీటి సలహామండలి సమావేశం
-
త్రిమూర్తులు పార్టిలో చేరడాన్ని స్వాగతిస్తున్నాం
-
గత ప్రభుత్వం కౌలు రైతుల సంక్షేమాన్ని మరిచింది
-
కాంగ్రెస్‌లో సారథ్య సంక్షోభాలు
సాక్షి, న్యూఢిల్లీ : సమర్థుడైన సారథి విషయంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి సంక్షోభంలో చిక్కుకుంది. అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ తన మనసును మార్చుకునేందుకు సిద్ధంగా లేకపోవడం, అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు గాంధీ కుటుంబం నుంచి మరొకరిని ప్రతిపాదించేందుకు కూడా రాహుల్ సుముఖంగా లేక పోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 2017లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన రాహుల్ గాంధీ పార్టీకి 16వ అధ్యక్షుడు, నెహ్రూ కుటుంబం నుంచి వచ్చిన ఆరవ అధ్యక్షుడు. రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో బీజేపీ ప్రభుత్వాలను కూల్చేసి తాను అధికారపగ్గాలను స్వీకరించగలిగింది. అదే ఒరవడితో కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని పార్టీ ఆశించింది. అది జరగ్గపోగా నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీ గతంలోకన్నా 21 సీట్లను అదనంగా గెలుచుకోవడంతో అందుకు నైతిన బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఇలా సారథ్య సంక్షోభం ఏర్పడడం ఇదే మొదటిసారి కాదు. నాడు సుభాస్ చంద్రబోస్ ఎన్నిక, రాజీనామా 1938లో గుజరాత్‌లోని హరిపురలో జరిగిన కాంగ్రెస్ పార్టీ వార్షిక సమావేశంలో సుభాస్ చంద్రబోస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జాతిపిత మహాత్మాగాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ లాంటి పార్టీ సీనియర్ నాయకులు కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని సమర్థించారు. ఏడాది తిరక్కముందే మహాత్మా గాంధీ, బోస్ మధ్య విభేదాలు తలెత్తాయి. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా బ్రిటిష్ పాలకులకు సహకరించి తద్వారా దేశ పాలనలో సానుకూల సంస్కరణలు తీసుకరావాలని గాంధీ భావిస్తే, అదే ప్రపంచ యుద్ధ పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని బ్రిటీష్ పాలకులపై తిరుగుబాటుచేసి దేశ స్వాతంత్య్రానికి మార్గం సుగుమం చేసుకోవాలన్నది బోస్ ఎత్తుగడ. 1939లో త్రిపురలో జరిగిన కాంగ్రెస్ సమేశంలో మహాత్మా గాంధీ వారించినా వినకుండా బోస్ మరోసారి అధ్యక్ష పదవిని నామినేషన్ వేశారు. ఆయనకు పోటీగా పట్టాభి సీతారామయ్య పేరును గాంధీ ప్రతిపాదించారు. 205 ఓట్ల మెజారిటీతో మళ్లీ బోసే గెలిచారు. ‘ఇందులో పట్టాభి ఓటమికన్నా నా ఓటమే ఎక్కువ’ అని తర్వాత ఆయనకు రాసిన లేఖలో గాంధీ పేర్కొన్నారు. బోస్ కాదన్న వినకుండా గాంధీ, కొత్త తరహా ప్రభుత్వ పాలనకోసం బ్రిటీష్ పాలకులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ బహిరంగ ప్రకటన చేశారు. అందుకు విరుద్ధంగా బ్రిటీష్ పాలకులతో సహాయ నిరాకరణ ఉద్యమానికి బోస్ పిలుపునిచ్చారు. ఈ విషయంలో ఎవరి పక్షం వహిస్తారంటూ గాంధీ, పార్టీ నాయకులను నిలదీయడంతో బోస్, ఆయన సోదరుడు శరత్ చంద్ర బోస్ మినహా అందరు పార్టీకి రాజీనామా చేశారు. ఇక చేసేదేమీలేక బోస్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో రాజేంద్ర ప్రసాద్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. 1949లో మరోసారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సీ. రాజగోపాలచారి (అప్పటికి గవర్నర్ జనరల్ అంటే భారత తొలి రాష్ట్రపతి) పేరును పండిట్ నెహ్రూ ప్రతిపాదించగా, ఆయన డిప్యూటి సర్దార్ వల్లభాయ్ పటేల్ వ్యతిరేకించారు. పటేల్, రాజేంద్ర ప్రసాద్ పేరును ప్రతిపాదించారు. ఈనేపథ్యంలో అప్పటికీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పట్టాభి సీతారామయ్యనే పార్టీ సభ్యులు తిరిగి ఎన్నికయ్యారు. ఆ తర్వాత కొన్ని నెలలకు పురుషోత్తమ దాస్ టాండన్ పేరును పటేల్ ప్రతిపాదించారు. పాకిస్థాన్‌తో యుద్ధం కోరుకుంటున్న ఛాందస హిందువంటూ ఆయన అభ్యర్థిత్వాన్ని నెహ్రూ వ్యతిరేకించారు. అయినప్పటికీ నాసిక్‌లో జరిగిన పార్టీ సమావేశంలో టాండన్ ఎన్నికయ్యారు. దాంతో తాను ప్రధాని పదవికి రాజీనామా చేస్తానంటూ రాజగోపాలచారికి రాసిన లేఖలో నెహ్రూ హెచ్చరించారు. నెహ్రూతో విభేదాల కారణంగా తొమ్మిది నెలల అనంతరం టాండన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈలోగా గుండెపోటుతో పటేల్ మరణించారు. నెహ్రూను పార్టీ అధ్యక్షుడిగా ప్రకటిస్తూ 1951, సెప్టెంబర్ 8వ తేదీన పార్టీ ఏకగ్రీవగా తీర్మానించింది. అప్పటి నుంచి నాలుగు పర్యాయాలు (నాలుగేళ్లు) నెహ్రూయే అధ్యక్షుడిగా ఉన్నారు. 1969లో తీవ్ర సంక్షోభం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి నీలం సంజీవరెడ్డిని పార్టీ సీనియర్ నాయకులు ప్రతిపాదించగా, స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన వీవీ గిరీకి అప్పుడు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ మద్దతిచ్చారు. దాంతో ఇందిరాగాంధీని అప్పటి పార్టీ అధ్యక్షుడు ఎస్. నిజలింగప్ప పార్టీ నుంచి బహిష్కరించారు. దాంతో పార్టీలోనూ ప్రభుత్వంలోనూ చీలిక వచ్చింది. పర్యవసానంగా మైనారిటీలో పడిన తన ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ, సీపీఐ మద్దతుతో గట్టెక్కించారు. ఆ తర్వాత 1971లో జరిగిన ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో ఇందిర మళ్లీ అధికారంలోకి వచ్చారు. ఎమర్జెన్సీ కారణంగా ఇందిర ప్రభుత్వం పడిపోవడం, మళ్లీ అధికారంలోకి రావడం తెల్సిందే. అప్పటి నుంచి ప్రధానిగా ఉన్న వ్యక్తికే పార్టీ బాధ్యతలు అప్పగించాలనే ఆనవాయితీ మళ్లీ వచ్చింది. ఆమె తర్వాత ప్రధాని అయిన రాజీవ్ గాంధీయే పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పీవీ నరసింహారాలు అలాగే ఎన్నికయ్యారు. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో తప్పించారు. ఆయన తర్వాత సీతారామ్ కేసరి కొద్దికాలం ఉన్నారు. సోనియా గాంధీకి పార్టీ బాధ్యతలు అప్పగించడం కోసం ఆయన్ని తప్పించి ఆమెను ఎన్నుకున్నారు. అందరికన్నా ఎక్కువగా 19 ఏళ్లపాటు సోనియానే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు వారసులుగా రాహుల్ వచ్చారు. ఒకప్పుడు సైద్ధాంతిక విభేదాల కారణంగా పార్టీలో సారథ్య సంక్షోభం ఏర్పడితే ఆ తర్వాత పదవుల కోసం సంక్షోభాలు వచ్చాయి. సంక్షోభాలను నివారించడం కోసం వారసత్వ రాజకీయాలు వచ్చాయి. ఇప్పుడు ఈ వారసత్వాన్ని రాహుల్ వద్దంటున్నారు. -
అండమాన్ దీవుల పేర్లు మార్పు
పోర్టుబ్లేయర్: అండమాన్ నికోబార్ దీవుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నికోబార్ దీవుల్లోని మూడు దీవులకు కొత్త పేర్లను పెట్లారు. ద రోస్ ఐలాండ్ దీవికి ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు నేతాజీ సుభాశ్ చంద్రబోస్ ద్వీప్గా, ద నెయిల్ ఐలాండ్‌కి షాహీద్ ద్వీప్, హావ్లాక్ ఐలాండ్‌కి స్వరాజ్ ద్వీప్గా పేర్లను ప్రకటించారు. అండమాన్ దీవులకు నేతాజీ శుభాష్ చంద్రబోస్ పేరు పెట్టాలని ఎప్పటినుంచో ప్రతిపాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా చంద్రబోస్ తొలిసారి జాతీయ జెండాను ఎగరువేసి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయా పేర్లను పెడుతున్నట్లు మోదీ వెల్లడించారు. ఈ సందర్భంగా 75 రూపాయల నాణేన్ని, నేతాజీ స్మారక స్టాంపులను ప్రధాని విడుదల చేశారు. త్వరలోనే నేతాజీ పేరుతో విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటుచేస్తామని ప్రకటిస్తూ.. చంద్రబోస్ దేశానికి చేసిన సేవలను గుర్తుచేశారు. అనంతరం జాతీయ జెండాను ఎగరవేసి, నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. -
ఘనంగా నేతాజీ జయంతి
రెబ్బెన : నేటి తరం యువత సుభాష్‌చంద్రబోస్‌ను ఆదర్శంగా తీసుకుని దేశ సేవ చేయాలని సింగరేణి పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం గోలేటిలోని సింగరేణి ఉన్నత పాఠశాలో సుభాష్ చంద్రబోస్ 121వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో ఉపాధ్యాయలు శ్రీనివాసరావు, అరుణ్‌కుమార్, పీఈటీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్వీ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సంజీవ్, కరస్పాండెంట్ విజయకుమారి పాల్గొన్నారు. అలాగే టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో గోలేటి టౌన్షిప్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ మస్క రమేష్ పాల్గొన్నారు. -
వివేకానందుడి స్ఫూర్తితో ముందుకు సాగాలి
కాసిపేట : విద్యార్థులు, యువత వివేకానందుడి స్ఫూర్తితో ముందుకు సాగాలని ఏసీపీ బాలుజాదవ్ సూచించారు. వివేకానందుడి జయంతోత్సవాల్లో భాగంగా స్థానిక జెడ్పీహెచ్ఎస్లో మంగళవారం ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ మాట్లాడుతూ వివేకానందుడి భావాలు ప్రతి ఒక్కరికీ ఆలోచనలు కలిగేలా ఉంటాయన్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు నిత్యం పర్యవేక్షించాలన్నారు. అంతకు ముందు వివేకానందుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వంశీధర్‌రావు, జెడ్పీటీసీ సభ్యుడు రౌతు సత్తయ్య, ఎంపీడీవో అబ్ధుల్ హై, డీటీడీవో గంగారాం, ఎంఈవో దామోదర్, సూపరింటెండెంట్ విజయ్‌కుమార్, పీడీ రవి, ప్రెస్‌క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
నేతాజీని చంపించింది స్టాలినే: స్వామి
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం గురించి ఇప్పటికీ పలు రకాల వాద ప్రతివాదాలు జరుగుతూనే ఉంటాయి. అయితే.. ఆయన 1945లో ఓ విమాన ప్రమాదంలో మరణించలేదని, సోవియట్ అధినేత జోసెఫ్ స్టాలిన్ ఆయనను చంపించారని బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి ఆరోపించారు. ఈ విషయమై ఉన్న రహస్య ఫైళ్లను బయటపెట్టాలని ఆయన డిమాండు చేశారు. సైబీరియా ఎడారిలో రహస్య ప్రాంతంలో నేతాజీని స్టాలిన్ చంపించారని స్వామి ఆరోపించడం సంచలనం రేపింది. అయితే.. దీనికి సంబంధించిన రహస్య ఫైళ్లను బయటపెడితే మాత్రం భారతదేశానికి బ్రిటన్ తోను, రష్యాతోను ఉన్న సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని మాత్రం స్వామి అన్నారు. ఈ వివాదం విషయాన్నితాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చిస్తానని తెలిపారు. ఇన్నాళ్లూ నేతాజీ మరణశిక్ష నుంచి తప్పించుకుని చైనాలోని మంచూరియా ప్రాంతంలో దాక్కున్నట్లు వాదనలున్నాయని, కానీ వాస్తవానికి ఆయనను స్టాలిన్ సైబీరియాలోని ఓ జైల్లో పెట్టారని తెలిపారు. 1953 ప్రాంతంలో ఆయనను ఉరితీయడమో.. లేదా ఊపిరాడకుండా చేసి చంపడమో చేశారని స్వామి చెప్పి పెద్ద బాంబే పేల్చారు.