
కోల్‌కతా: దేశానికి నాలుగు రొటేటింగ్ రాజధానులు ఉండాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. కోల్‌కతాను రాజధానిగా చేసేకొని అప్పట్లో ఆంగ్లేయులే పాలించారని, అలాంటప్పుడు దేశవ్యాప్తంగా ఒకే రాజధాని ఎందుకు ఉండాలని ఆమె ప్రశ్నించారు.నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నేతాజీ జయంతిని పురస్కరించుకొని కేంద్రం జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. (ఆపరేషన్ బెంగాల్.. అంత ఈజీ కాదు!)
దేశ్‌నాయక్ దివాస్‌గా జరుపుకునే నేతాజీ పుట్టిరోజు గురించి మనందరికీ తెలిసినా, ఆయన మరణం గురించి మాత్రం ఎవరికీ తెలియదని అన్నారు. మాతృభూమిపై సమానంగా నేతాజీపై ప్రేమ ఉన్నది కొద్ది మందికే అని, కొందరు మాత్రం ఎలక్షన్స్‌ను దృష్టిలో ఉంచుకొని ఆయన సంబరాలు నిర్వహిస్తున్నారని బీజేపీని పరోక్షంగా విమర్శించారు. (మమతకు షాక్.. మరో ఎమ్మెల్యే బీజేపీలోకి జంప్!)
Comments
Please login to add a commentAdd a comment