పోర్టుబ్లేయర్: అండమాన్ నికోబార్ దీవుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నికోబార్ దీవుల్లోని మూడు దీవులకు కొత్త పేర్లను పెట్లారు. ద రోస్ ఐలాండ్ దీవికి ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు నేతాజీ సుభాశ్ చంద్రబోస్ ద్వీప్‌గా, ద నెయిల్ ఐలాండ్‌కి షాహీద్ ద్వీప్, హావ్‌లాక్ ఐలాండ్‌కి స్వరాజ్ ద్వీప్‌గా పేర్లను ప్రకటించారు. అండమాన్ దీవులకు నేతాజీ శుభాష్ చంద్రబోస్ పేరు పెట్టాలని ఎప్పటినుంచో ప్రతిపాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా చంద్రబోస్ తొలిసారి జాతీయ జెండాను ఎగరువేసి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయా పేర్లను పెడుతున్నట్లు మోదీ వెల్లడించారు. ఈ సందర్భంగా 75 రూపాయల నాణేన్ని, నేతాజీ స్మారక స్టాంపులను ప్రధాని విడుదల చేశారు. త్వరలోనే నేతాజీ పేరుతో విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటుచేస్తామని ప్రకటిస్తూ.. చంద్రబోస్ దేశానికి చేసిన సేవలను గుర్తుచేశారు. అనంతరం జాతీయ జెండాను ఎగరవేసి, నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment