న్యూఢిల్లీ: భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీలో అండమాన్ నికోబార్ దీవులు మరింత కీలకంగా మారాయని ప్రధాని మోదీ అన్నారు. చెన్నై నుంచి పోర్ట్‌బ్లెయిర్ వరకు సముద్ర గర్భంలో ఏర్పాటు చేసిన ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌ను సోమవారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. రూ.1,224 కోట్లతో చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ , అక్కడ్నుంచి ఇతర ద్వీపసమూహాలకు 2,312 కి.మీ. పొడవున వేసిన ఈ కేబుల్‌తో అండమాన్ నికోబర్ దీవుల్లో ప్రజలకు 4జీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
సెకండ్‌కి 2200 జీబీపీఎస్ సామర్థ్యం గల ఈ కేబుల్ వ్యవస్థ ద్వారా అండమాన్ ద్వీప సమూహానికి స్వాతంత్య్ర దినోత్సవ కానుక ముందే లభించినట్ట యిందని ప్రధాని వ్యాఖ్యానించారు. సరకు రవాణా ద్వారా వాణిజ్య కార్యకలాపాలను పెంచడానికి 10 వేల కోట్లతో గ్రేట్ నికోబార్ ద్వీపసమూహంలో ట్రాన్స్‌షిప్‌మెంట్ ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధమయ్యా యన్నారు. కాగా, ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే పసిగట్టే శాశ్వత వ్యవస్థకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల మధ్య మరింత సమన్వయం అవసరమని ప్రధాని అన్నారు. భారీ వర్షాలు, వరదల పరిస్థితిని ఎదుర్కొంటున్న అస్సాం, బిహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులనుద్దేశించి ప్రధాని మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment