Nikhil Siddhartha Comments on Amit Shah Meeting - Sakshi
Sakshi News home page

Nikhil Siddhartha : 'అమిత్ షా నుంచి నాకూ ఆహ్వానం వచ్చింది.. కానీ వెళ్లలేదు'

Published Tue, May 16 2023 8:11 PM | Last Updated on Tue, May 16 2023 8:41 PM

Nikhil Siddhartha Comments On Amit Shah Meeting - Sakshi

కార్తికేయ-2, 18 పేజెస్‌ చిత్రాలతో బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్స్‌తో దూసుకుపోతున్నాడు హీరో నిఖిల్‌. ఆయన తాజాగా మరో పాన్ ఇండియా సినిమా ‘స్పై’ తో రానున్నారు. సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న మిస్టరీ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. జూన్‌ 28న ఈ ప్రపంచ ‍వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మీడియా ప్రతినిథులు అడిగిన పలు ప్రశ్నలకు నిఖిల్‌ సమాధానమిస్తూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మొన్న కార్తికేయ 2, ఇప్పుడు స్పై.. మీరు ఓ పార్టీకి అనుకూలంగా ఈ సినిమాలు తీస్తున్నారా? అమిత్ షా మిమ్మల్ని కలవాలని పిలిచారంట కదా ఓ మీడియా ప్రతినిథి అడగ్గా.. నిఖల్‌ మాట్లాడుతూ.. 'అమిత్‌ షా నుంచి నాకు ఆహ్వానం అందింది.

కానీ ఇలాంటి సినిమాలు చేస్తున్న సమయంలో రాజకీయాలకు దూరంగా ఉంటే మంచిదని ఉద్దేశంతో నేను వెళ్లలేదు. నన్ను ఆహ్వానించినందుకు అమిత్ షాకు థ్యాంక్స్. నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు.ఏ పార్టీకి అనుకూలంగా సినిమాలు చేయడం లేదు. ఒక భారతీయుడిగా సినిమాలు చేస్తున్నాను' అంటూ నిఖిల్‌ వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement