‘శ్రీప్రకాష్‌’లో 40వ ఆవిర్భావ దినోత్సవం | sri prakash school anniversary | Sakshi
Sakshi News home page

‘శ్రీప్రకాష్‌’లో 40వ ఆవిర్భావ దినోత్సవం

Published Fri, Aug 19 2016 11:23 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

‘శ్రీప్రకాష్‌’లో 40వ ఆవిర్భావ దినోత్సవం - Sakshi

‘శ్రీప్రకాష్‌’లో 40వ ఆవిర్భావ దినోత్సవం

  • ఉత్సాహభరితంగా ‘గాతా రహే మేరా దిల్‌’
  • తుని : 
    స్ధానిక శ్రీప్రకాష్‌ విద్యా సంస్థల్లో 40వ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవా రం సాయంత్రం నిర్వహించారు. వి ద్యా సంస్థల అధినేత సీహెచ్‌వీకే నరసింహారావు అధ్యక్షతన జరిగిన వేడుకల్లో విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులు సాధించిన విజయాల్ని వివరించారు.  ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రూపొం దించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. వేడుకల్లో పాల్గొన్న సినీ గాయకుడు మల్లికార్జున్‌ మాట్లాడుతూ శ్రీ ప్రకాష్‌ యాజమాన్యం విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్న విధానం అభినందనీయమన్నారు. విద్యార్థిదÔ¶ లో లభించే అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్‌లో మంచి గాయకులవుతారన్నా రు. అనంతరం ఉత్సాహభరితంగా జరిగిన ‘గాతా రహే మేరాదిల్‌’ పోటీల్లో రాజమహేంద్రవరం, పెద్దాపురం, పాయకరావు పేట, తుని శ్రీ ప్రకాష్‌ విద్యా సంస్థల విద్యార్థులు పాల్గొన్నారు. సీనియర్, జూనియర్‌ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను మల్లికార్జున్, విజయ్‌ప్రకాష్‌ అందజేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement