sri prakash
-
చదువుకుంటూ పనిచేస్తే తప్పేముంది : శ్రీప్రకాష్
-
హిందూ కాంగ్రెస్ చైర్మన్‌గా శ్రీప్రకాశ్
వాషింగ్టన్: అమెరికాలోని షికాగోలో సెప్టెంబర్ 7 నుంచి మూడ్రోజుల పాటు ప్రపంచ హిందూ కాంగ్రెస్(డబ్ల్యూహెచ్‌సీ) సదస్సును నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)కి చెందిన ప్రొఫెసర్ డా.శ్రీప్రకాశ్ కొఠారి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నట్లు సదస్సు నిర్వాహకులు తెలిపారు. ప్రతి నాలుగేళ్లకు ఓసారి జరిగే ఈ కార్యక్రమంలో టిబెటిన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ సహా 80 దేశాల నుంచి 2,000 మంది ప్రతినిధులు పాల్గొననున్నట్లు వెల్లడించారు. స్వామి వివేకానంద షికాగోలో 1893, సెప్టెంబర్ 11న చారిత్రక ప్రసంగం చేసి 125 ఏళ్లు పూర్తికానున్న సందర్భంగా ఈ సదస్సును అక్కడే నిర్వహించనున్నారు -
ప్రశ్నలు సంధించాలి
విద్యార్థులతో అంతరిక్ష పరిశోధకుడు సుందరమూర్తి భానుగుడి (కాకినాడ): పాఠశాల స్థాయి నుంచే ప్రతి విషయాన్ని పరిశోధించే దిశగా చిన్నారుల ప్రయత్నం ఉండాలని, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని, తరగతి గదిని ప్రయోగశాలగా భావించి ఉపాధ్యాయునిపై ప్రశ్నలను సంధించాలని ఇస్రో మెషీ¯ŒS డైరెక్టర్, కమ్యూనికేష¯ŒS మెట్రాలాజికల్ సైంటిస్ట్ టీకే సుందర మూర్తి అన్నారు. బుధవారం కాకినాడ వెంకట¯ŒSనగర్ శ్రీప్రకాష్ సినర్జీ కిడ్స్ తృతీయ వార్షికోత్సవం బ్లిడ్జ్ పేరుతో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సుందరమూర్తి ప్రసంగిస్తూ ప్రశ్నించడం ద్వారా పరిశోధనా శక్తి పెరుగుతుందని తద్వారా గొప్ప ఆవిష్కరణలు చేసి దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తలుగా ఎదగవచ్చన్నారు. వార్షికోత్సవంలో విద్యార్థులు ఆలపించిన ప్రార్థనా గీతం ఆకట్టుకుంది. అనంతరం సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఎల్కేజీ విద్యార్థులకు నిర్వహించిన కాన్వొకేష¯ŒS డే, ఏరోబిక్ డ్యా¯Œ్స, జానపద నృత్యాలు ఆహూతులను కట్టిపడేశాయి. కార్యక్రమంలో వెల్లిస్ మెరిగేరీష్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ (నాగపూర్) నుంచి డాక్టర్ జయకుమార్ వెంకటేశన్, ఇండియ¯ŒS స్పేస్ అంబాసిడర్ మిషెల్ నాసా దీపికా దవులూరి, స్పేస్ సైంటిస్ట్ సౌరవ్కౌశల్, డీఆర్డీవో సైంటిస్ట్ డాక్టర్ మురళీ వరప్రసాద్, ఇస్రో మాజీ ప్రాజెక్టు డైరెక్టర్ ఎ.శివరామకృష్ణ¯ŒS ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. పాఠశాల చీఫ్ మెంటార్ కనకదుర్గ, విద్యాసంస్థల సీనియర్ ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్ మూర్తి, డీ¯ŒS బి.రాజేశ్వరి పాల్గొన్నారు. -
క్రీడల్లో ‘శ్రీప్రకాష్’కు పతకాల పంట
దివాన్‌చెరువు (రాజానగరం) : తమిళనాడులోని వృద్ధాచలంలో ఈ నెల 26 నుంచి 28 వరకూ జరిగిన జాతీయ గ్రామీణ క్రీడా పోటీల్లో తమ విద్యార్థులు పలు పతకాలను కైవసం చేసుకున్నట్టు దివాన్‌చెరువు శ్రీప్రకాష్ విద్యానికేతన్ ప్రిన్సిపాల్ ఏఎస్ఎన్ మూర్తి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలికల విభాగం హేండ్‌బాల్ పోటీల్లో బంగారు పతకం, 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందెంలో రెండు బంగారు, రెండు రజత పతకాలు సాధించారు. అలాగే బాలుర విభాగం చదరంగం, బాస్కెట్‌బాల్ పోటీల్లో రెండు బంగారు పతకాలు, 1500 మీటర్ల పరుగు పందెంలో రెండు రజత, కాంస్య çపతకాలు, 400 మీటర్ల పరుగు పందెం, హేండ్‌బాల్ పోటీల్లో రెండు కాంస్య పతకాలు గెలుపొందారని వివరించారు. భారత ప్రభుత్వపు యువజన క్రీడా మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన రూరల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయన్నారు. పతకాలు సాధించిన విద్యార్థులను, పీఈటీలు సురేష్, రామకృష్ణలను ప్రిన్సిపాల్‌తోపాటు సీనియర్ ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్ మూర్తి, డైరెక్టర్ విజయ్‌ప్రకాష్ అభినందించారు. -
‘శ్రీప్రకాష్’లో 40వ ఆవిర్భావ దినోత్సవం
ఉత్సాహభరితంగా ‘గాతా రహే మేరా దిల్’ తుని : స్ధానిక శ్రీప్రకాష్ విద్యా సంస్థల్లో 40వ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవా రం సాయంత్రం నిర్వహించారు. వి ద్యా సంస్థల అధినేత సీహెచ్‌వీకే నరసింహారావు అధ్యక్షతన జరిగిన వేడుకల్లో విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులు సాధించిన విజయాల్ని వివరించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రూపొం దించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. వేడుకల్లో పాల్గొన్న సినీ గాయకుడు మల్లికార్జున్ మాట్లాడుతూ శ్రీ ప్రకాష్ యాజమాన్యం విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్న విధానం అభినందనీయమన్నారు. విద్యార్థిదÔ¶ లో లభించే అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్‌లో మంచి గాయకులవుతారన్నా రు. అనంతరం ఉత్సాహభరితంగా జరిగిన ‘గాతా రహే మేరాదిల్’ పోటీల్లో రాజమహేంద్రవరం, పెద్దాపురం, పాయకరావు పేట, తుని శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల విద్యార్థులు పాల్గొన్నారు. సీనియర్, జూనియర్ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను మల్లికార్జున్, విజయ్‌ప్రకాష్ అందజేశారు.