క్రీడల్లో ‘శ్రీప్రకాష్’కు పతకాల పంట
దివాన్‌చెరువు (రాజానగరం) :
తమిళనాడులోని వృద్ధాచలంలో ఈ నెల 26 నుంచి 28 వరకూ జరిగిన జాతీయ గ్రామీణ క్రీడా పోటీల్లో తమ విద్యార్థులు పలు పతకాలను కైవసం చేసుకున్నట్టు దివాన్‌చెరువు శ్రీప్రకాష్ విద్యానికేతన్ ప్రిన్సిపాల్ ఏఎస్‌ఎన్ మూర్తి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలికల విభాగం హేండ్‌బాల్ పోటీల్లో బంగారు పతకం, 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందెంలో రెండు బంగారు, రెండు రజత పతకాలు సాధించారు. అలాగే బాలుర విభాగం చదరంగం, బాస్కెట్‌బాల్ పోటీల్లో రెండు బంగారు పతకాలు, 1500 మీటర్ల పరుగు పందెంలో రెండు రజత, కాంస్య çపతకాలు, 400 మీటర్ల పరుగు పందెం, హేండ్‌బాల్ పోటీల్లో రెండు కాంస్య పతకాలు గెలుపొందారని వివరించారు. భారత ప్రభుత్వపు యువజన క్రీడా మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన రూరల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయన్నారు. పతకాలు సాధించిన విద్యార్థులను, పీఈటీలు సురేష్, రామకృష్ణలను ప్రిన్సిపాల్‌తోపాటు సీనియర్ ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్ మూర్తి, డైరెక్టర్ విజయ్‌ప్రకాష్ అభినందించారు.