ప్రశ్నలు సంధించాలి
-
విద్యార్థులతో అంతరిక్ష పరిశోధకుడు సుందరమూర్తి
భానుగుడి (కాకినాడ):
పాఠశాల స్థాయి నుంచే ప్రతి విషయాన్ని పరిశోధించే దిశగా చిన్నారుల ప్రయత్నం ఉండాలని, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని, తరగతి గదిని ప్రయోగశాలగా భావించి ఉపాధ్యాయునిపై ప్రశ్నలను సంధించాలని ఇస్రో మెషీ¯ŒS డైరెక్టర్, కమ్యూనికేష¯ŒS మెట్రాలాజికల్ సైంటిస్ట్ టీకే సుందర మూర్తి అన్నారు. బుధవారం కాకినాడ వెంకట¯ŒSనగర్ శ్రీప్రకాష్ సినర్జీ కిడ్స్ తృతీయ వార్షికోత్సవం బ్లిడ్జ్ పేరుతో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సుందరమూర్తి ప్రసంగిస్తూ ప్రశ్నించడం ద్వారా పరిశోధనా శక్తి పెరుగుతుందని తద్వారా గొప్ప ఆవిష్కరణలు చేసి దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తలుగా ఎదగవచ్చన్నారు. వార్షికోత్సవంలో విద్యార్థులు ఆలపించిన ప్రార్థనా గీతం ఆకట్టుకుంది. అనంతరం సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఎల్‌కేజీ విద్యార్థులకు నిర్వహించిన కాన్వొకేష¯ŒS డే, ఏరోబిక్ డ్యా¯Œ్స, జానపద నృత్యాలు ఆహూతులను కట్టిపడేశాయి. కార్యక్రమంలో వెల్లిస్ మెరిగేరీష్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ (నాగపూర్) నుంచి డాక్టర్ జయకుమార్ వెంకటేశన్, ఇండియ¯ŒS స్పేస్ అంబాసిడర్ మిషెల్ నాసా దీపికా దవులూరి, స్పేస్ సైంటిస్ట్ సౌరవ్‌కౌశల్, డీఆర్‌డీవో సైంటిస్ట్ డాక్టర్ మురళీ వరప్రసాద్, ఇస్రో మాజీ ప్రాజెక్టు డైరెక్టర్ ఎ.శివరామకృష్ణ¯ŒS ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. పాఠశాల చీఫ్ మెంటార్ కనకదుర్గ, విద్యాసంస్థల సీనియర్ ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్ మూర్తి, డీ¯ŒS బి.రాజేశ్వరి పాల్గొన్నారు.