ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యంలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన మొదటి వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు (జనవరి 11) ప్రారంభమైన ఉత్సవాలు ఈనెల 13 వరకు జరగనున్నాయి.
హిందూ క్యాలెండర్ ప్రకారం గత ఏడాది అంటే 2024 లో పుష్యమాస శుక్లపక్ష ద్వాదశి జనవరి 22న వచ్చింది. అది ఈ ఏడాది(2025) జనవరి 11న వచ్చింది. ఈ కారణంగా హిందూ క్యాలెండర్(Hindu calendar)ను అనుసరించి అయోధ్యలో నేడు నూతన రామాలయ మొదటి వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి. రామమందిర ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే ఈ మూడు రోజుల ఉత్సవాలకు 110 మందికి పైగా వీఐపీలు హాజరుకానున్నారు. ఈరోజు(శనివారం) ఉదయం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రామ్ లల్లాకు అభిషేకం చేయనున్నారు. అనంతరం ఆయన భక్తులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
వార్షికోత్సవాల సందర్భంగా ఆలయ ట్రస్ట్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అంగద్ తిలా స్థలంలో ఒక భారీ టెంట్ ఏర్పాటు చేశారు. దీనిలో ఐదు వేలమందికి పైగా భక్తులు కూర్చొనే అవకాశం ఉంది. అలాగే పెవిలియన్‌తో పాటు యాగశాలలో శాస్త్రీయ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. దీనితో పాటు రామ కథా(Rama Katha) గానం కూడా నిర్వహించనున్నారు. గత సంవత్సరం ఇక్కడికి రాలేకపోయినవారికి ఈసారి ట్రస్ట్ ప్రత్యేక ఆహ్వానాలు పంపిందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. 110 మంది వీఐపీలతో సహా పలువురు అతిథులకు ఆహ్వానాలు పంపినట్లు ట్రస్ట్ పేర్కొంది. ఆలయ ట్రస్ట్(Temple Trust) తెలిపిన వివరాల ప్రకారం మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలకు మండలం, యాగశాల ప్రధాన వేదికలుగా నిలిచాయి.
ఇది కూడా చదవండి: Delhi Election: ఆ 29 స్థానాలు అన్ని పార్టీలకు సవాల్.. ఈసారి ఏమవునో?
Comments
Please login to add a commentAdd a comment