వెంకటాపురం చెరువును ఆక్రమించుకుని తాత్కాలిక నిర్మాణాలు చేపడుతున్న దృశ్యం
ప్రభుత్వ భూముల ఆక్రమణలకుకళ్లెం పడటం లేదు. ఖరీదైన ప్రాంతాలలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కబ్జా చేస్తున్నారు. తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి పరిధిలోనే ఈ అక్రమాలు ఎక్కువ. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులు మిన్నకుండిపోతున్నారు. కొందరు అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నారన్న సమాచారం ఇస్తే తమపై ఎదురు కేసులు పెడతామని అధికారులే బెదిరింపులకు దిగుతున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. తాజాగా ఆక్రమణలకు గురైన భూముల వివరాలివిగో..
సాక్షి, తిరుపతి: తిరుపతి రూరల్ పరిధిలోని వేదాంతపురం పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 251/1లో 118.83 ఎకరాల నది పోరంబోకు భూమి ఉంది. దీనిలో కొంత విలువైన భూమిని టీడీపీ నేతలు ఆక్రమించుకున్నారు. ఇష్టానుసారం విక్రయించి సొమ్ముచేసుకున్నారు. టీడీపీ నేత అ నుచరుడు ఒకరు ప్లాట్లు వేసి విక్రయించారు. నదీ పోరంబోకు భూమి అని తెలియని కొందరు లక్షలు వెచ్చించి ప్లాట్లు కొనుగోలు చేశారు. అమ్మిన వ్యక్తి పరారయ్యాడు. ప్రస్తుతం బాధితులు రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. ఎవరి అనుభవంలో ఉన్న భూమిని వారి సొంతం చేస్తామని హామీ ఇచ్చారు.
♦ హథీరాంజీ మఠం భూముల్లోని అవిలాల పరిధిలో తొమ్మిది ఎకరాల్లో అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆక్రమించుకున్న భూమిలో వేసిన ప్లాట్లకు నంబర్లు ఇచ్చి రాళ్లు పాతుతున్నారు. ఇంత జరుగుతున్నా మఠం అధికారులు నోరెత్తడం లేదు. అక్రమాలను అడ్డుకునే ప్రయత్నం కూడా చెయ్యడం లేదు.
♦ రూరల్ మండలం మల్లంగుంట పరిధిలోని సర్వే నంబర్ 176/2లో 2.50 ఎకరాల గ్రామకంఠం భూమి ఉంది. ఎకరం విలువ రూ.5 కోట్లు ఉంటుంది. దీనిని తిరుపతిలోని టీడీపీ నాయకుడొకరు ఆక్రమించుకున్నాడు. తాను వేసిన లేఅవుట్లో కలుపుకున్నాడు. వెంచర్‌కు దారి సౌకర్యం లేకపోయినా స్థానికులను భయపెట్టి కొంత స్థలాన్నిఆక్రమించుకున్నారని ఆరోపణలున్నాయి. మరి కొంతభూమిని తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
♦ రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 153/1లో 125.65 ఎకరాల అటవీ భూమి ఉంది. ఇందులో 44.95 ఎకరాలు వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం ఈ భూమిపై టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధి కన్నుపడింది. తిరుపతి–కరకంబాడి రహదారి మార్గంలో ఎకరం రూ.3 కోట్లు విలువచేస్తుంది. ప్రస్తుతం 1.43 ఎకరాల్లో ఉన్న అటవీ భూమిలో హడావుడిగా తాత్కాలిక నిర్మాణాలు జరుపుతున్నారు. ఈ భూమి తమదేనని కొందరు దౌర్జన్యంగా నిర్మాణాలు చేపడుతున్నారని సిద్దల రవి అనే వ్యక్తి రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేత అనుచరులిద్దరు ఆ 1.43 ఎకరాలు తమదేనని వా దిస్తున్నారు. సర్వేనంబర్ 153/1లో కాదని చెబుతున్నారు. ప్రస్తుతం నిర్మాణాలు జరుగుతున్న భూమి సర్వే నంబర్ 708/1, 2, 3, 4లో అని చెప్పారు. నిర్మాణాలు జరుగుతున్న భూమి రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగానే చూపిస్తోంది. 153/1లోని విస్తీర్ణాన్ని సబ్ డివిజన్ చేసి చూపుతున్నారని రవి పేర్కొం టున్నారు. 44.95 ఎకరాలు మొత్తం 1943 నుంచి తమ ఆధీనంలో ఉందని చెబుతున్నారు. 1964లో సెటిల్‌మెంట్ పట్టా ఇచ్చారని రవి వివరించారు. ఇరు వర్గాలు చెబుతున్న భూమి రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా చూపుతోం దని, అందులో నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని స్థానికులు చెబుతున్నారు.
♦ రేణిగుంట మండలం వెంకటాపురం పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 359లో సుమారు 15 ఎకరాల చెరువు పోరంబోకు భూమిని టీడీపీ నాయకులు కొందరు కలిసి ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకున్న భూమిని ప్లాట్లు వేసి అం కణం రూ.35వేల చొప్పున విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ప్ర స్తుతం అందులో తాత్కాలిక షెడ్లు నిర్మిస్తుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment