భూ ఆక్రమణల్లో బకాసురుడు సీఎం రమేష్ | CM Ramesh land grabbing | Sakshi
Sakshi News home page

భూ ఆక్రమణల్లో బకాసురుడు సీఎం రమేష్

Published Sun, May 12 2024 5:32 AM | Last Updated on Sun, May 12 2024 5:32 AM

CM Ramesh land grabbing

కంచెలేసి భూయజమానులను అడ్డగించారు.. పెన్నా నదిని, కలమల్ల వాగును ఆక్రమించారు

కాంట్రాక్టుల పేరిట రూ.వందల కోట్లను కొల్లగొట్టారు 

సాయం ముసుగులో స్థిరచరాస్తులను దోచేశారు 

టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల బెదిరింపులకు పాల్పడ్డారు 

న్యాయస్థానాల్లో వ్యాజ్యాలున్నా లెక్కచేయరు 

సీఎం రమేశ్, ఆయన సోదరుడు సురేశ్‌ రజాకార్ల కన్నా దుర్మార్గులు 

వైఎస్సార్‌ జిల్లా పోట్లదుర్తి గ్రామస్తుల మండిపాటు

అతడు.. భూఆక్రమణల్లో బకాసురుడు. అరాచకాల్లో రజాకార్లు కూడా ఆయన ముందు దిగదుడుపే. వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో తన గురువు చంద్రబాబుకు తగ్గ శిష్యుడు. చివరకు సొంత గ్రామస్తులు, బంధువులు కూడా ఆయన అంతులేని ధనదాహార్తికి చితికిపోయారు. తన ఆక్రమణలకు అడ్డూ అదుపు లేదు.

నదీ, వాగు అనే అభ్యంతరాలు లేవు. దొరికినదాన్నల్లా కబ్జా చేయడమే. సారా వ్యాపారం నుంచి మొదలై చంద్రబాబు అనుంగు శిష్యుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టి వాటినీ కలుíÙతం చేసిన ఆ చీడపురుగు.. సీఎం రమేశ్‌. సొంత గ్రామస్తులు ఛీ కొడుతున్న ఆయన అక్రమాలు, అరాచకాలు తెలిస్తే కళ్లు తేలేయకమానరు.

పోట్లదుర్తి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : సీఎం రమేశ్, ఆయన సోదరుడు సురేశ్‌ నాయుడు రజాకార్ల కన్నా దుర్మార్గులని వైఎస్సార్‌ జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామస్తులు ధ్వజమెత్తారు. అదే గ్రామానికి చెందిన సీఎం రమేశ్, ఆయన సోదరుడు అరాచకాలకు బలికాని వర్గమంటూ లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. వారి ఆవేదన, ఆక్రందన వింటే ఈ కాలంలోనూ ఇన్ని దురాగతాలు ఎలా చేయగలుగుతున్నారనే ఆశ్చర్యం కలుగుతుంది.

అన్ని వ్యవస్థలను అంతలా ఎలా మేనేజ్‌ చేయగలుగుతున్నారని అవాక్కవ్వక తప్పదు. సొంత గ్రామస్తులకు వారు బతికుండగానే నరకం చూపిన సీఎం రమేశ్‌ ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ తరఫున అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడేం చేయబోతున్నారో ఊహించడానికే కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రమేశ్‌ స్వగ్రామంలో ఆయన ‘వ్యవహారాలు’ తెలుసుకోవడానికి ‘సాక్షి’ పోట్లదుర్తిలో పర్యటించింది.  

సారా వ్యాపారంతో మొదలెట్టి.. 
సీఎం రమేశ్‌ కుటుంబం సారా వ్యాపారంతో మొదలైంది. టీడీపీలో చేరి చంద్రబాబుతో చెలిమి చేశాక ఇక ఆయన వెనుతిరిగి చూడలేదు. బాబు సహకారంతో రెండుసార్లు రాజ్యసభ సభ్యుడు అయ్యారు. అన్నిరకాల అక్రమాలు, అడ్డగోలు వ్యవహారాల్లో ఆరితేరి రూ.వేల కోట్లకు పడగలెత్తారనే ఆరోపణలున్నాయి. బయట కాంట్రా­క్టులు, కంపెనీల వ్యవహారాలను అలా ఉంచినా.. సొంత గ్రామంలో మచ్చుకు కొన్నింటిని పరిశీలిస్తే వామ్మో రమేశ్‌ అనకుండా ఉండలేం.  

వాగులు, నదుల్ని చెరబట్టి.. 
ప్రొద్దుటూరు నుంచి ఎర్రగుంట్లకు వెళ్లే మార్గంలో పెన్నానది ఒడ్డున పోట్లదుర్తి ఉంది. పెన్నాకు– గ్రామానికి మధ్యలో కలమల్ల వాగు పోతోంది. సీఎం రమేశ్‌ అటు నదిని, ఇటు వాగును ఆక్రమించి ఫెన్సింగ్‌ వేశారు. ఆ భూమిని ఆక్రమించుకున్నారు. తన భూములకు చుట్టూ తీగతో ఫెన్సింగ్‌ వేయడం ద్వారా ఇతర రైతుల పొలాలకు రాకపోకలు లేకుండా చేశారు. 

పెన్నా నది, కలమల్ల వాగులకు రక్షణ గోడలు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణ పనులు దక్కించుకున్న సీఎం రమేశ్‌ కుటుంబం వాటిపై ఎవరూ నడవకుండా అడ్డంకులు సృష్టించింది. చివరకు పశువులు, మూగజీవాలు నీరు తాగడానికి కూడా వీల్లేకుండా చేసింది. స్థానికులు నిరసనలు వ్యక్తం చేసినా సీఎం రమేశ్‌ రాక్షసంగానే వ్యవహరించారు.  

రైతుల్నే అమ్ముకునేలా చేసి.. 
తమ భూములున్న చోట పరిసరాల్లో కొందరి భూములు కొనుగోలు చేసి ఫెన్సింగ్‌ తీయించడం, ఆ తరువాత ఇతరులకు అడ్డంకులు కలి్పంచడం, వాటిని సొంతం చేసుకోవడం సీఎం రమేశ్, ఆయన సోదరుడి స్టైల్‌. పోనీ ఆ భూములను అక్కడున్న వాస్తవ ధర ప్రకారం తీసుకుంటారా అంటే అదీలేదు. ఎకరం రూ.పది లక్షల నుంచి రూ. ఇరవై లక్షలకు పైగా విలువచేసే భూమిని రూ.నాలుగు నుంచి ఆరేడు లక్షలకు రైతులే స్వయంగా వచ్చి అమ్ముకుపోయేలా వారిని అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తారు. 

భూములను తక్కువకు ఇచ్చేలా బెదిరింపులకు పాల్పడటం షరామామూలని పలువురు సొంత బంధువులే వివరించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాం పాలన ముగిసే సమయానికి పోట్లదుర్తి పరిసరాల్లో మూడు వందల ఎకరాలకు పైగా భూములను సీఎం రమేశ్‌ తన వశం చేసుకున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. అనేక పట్టా భూములను బినామీ పేర్లతో ఉంచారని తెలుస్తోంది. 

గొడ్డును బాదినట్లు బాదాడయ్యా 
మా అన్నదమ్ముల మధ్య పొలం విషయంలో తేడాలు వచ్చాయి. న్యాయం చెప్పమని సురేశ్‌ నాయుడు వద్దకు వెళ్లాం. ఎంతకూ సమస్య పరిష్కారం కాలేదు. దీంతో మరో పెద్దమనిషి వద్దకు వెళ్లానని తెలుసుకుని ఇంటికి పిలిపించి గొడ్డును బాదినట్లు బాదాడు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో పో అని బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు మళ్లీ బెదిరిస్తున్నారు. మా ప్రభుత్వం రాగానే నీ అంతుచూస్తానని బెదిరిస్తున్నారు. – కలమల్ల బాదుల్లా, పోట్లదుర్తి 

బంధువులమైనా వదిలిపెట్టడం లేదు.. 
సీఎం రమేశ్, మేము అంతా దగ్గర బంధువులమే. మా భూములను తక్కువ ధరకు తీసేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. దీనిపై కోర్టుల్లో వ్యాజ్యాలు నడుస్తున్నాయి. వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. పోలీసులకు చెప్పినా ప్రయోజనం లేదు. అయినా మా పోరాటం ఆపేది లేదు.  – సీఎం రమేశ్‌ బంధువులు 

సీఎం రమేశ్‌ అక్రమాలు, అరాచకాలు
»  పెన్నా నది ఒడ్డున లిక్కర్‌ ఫ్యాక్టరీ నెలకొల్పుతానని, గ్రామంలోని వారికి ఉద్యోగ ఉపాధి అవ­కాశాలు కలి్పస్తానని నమ్మబలికి సుమారు 40 ఎక­రాలను పేదవర్గాల నుంచి సేకరించారు. అం­దు­లో అధునాతన అతిథిగృహాన్ని కట్టారు.  

»   గ్రామంలో మోడల్‌ స్కూలు కట్టిస్తానని నమ్మబలికి ఎకరం రూ. కోటి విలువచేసే భూమిని కేవలం 11 లక్షలకే తీసుకుని గ్రామస్తులను మోసం చేశారు. ఆ భూముల్లో ఆకుకూరలు, కూరగాయలు పండేవని, భూయజమానులకు నిత్యం ఆదాయం ఉండేదని గ్రామస్తులు చెబుతున్నారు. భూమి ఇవ్వడానికి నిరాకరించిన వారిని పోలీసుల పేరిట బెదిరించి మరీ తీసుకున్నారని కన్నీటిపర్యంతమయ్యారు.  

»   చంద్రబాబు పాలన 1999–2004 మధ్య ఎన్టీఆర్‌ కాలనీల పేరిట 294 (ఉమ్మడి ఏపీ అసెంబ్లీ స్థానాల సంఖ్య)గృహాలను ప్రభుత్వం మంజూరు చేసింది. లబ్దిదారులకు ఆ ఇళ్ల హక్కుపట్టాలు రానీయకుండా సీఎం రమేశ్‌ తన కుటుంబీకుల వద్దే ఉంచుకుని రుణాల రూపంలో లబ్ధి పొందారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వాటిని అమ్మడానికి, ఇతరులకు అద్దెకు ఇవ్వడానికి వీల్లేకుండా పోయిందని లబ్దిదారులు వాపోతున్నారు.  

» గత టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కూల్‌ పిల్లలకు యూనిఫాం పేరిట కొనసాగిన పథకాన్ని సీఎం రమేశ్‌ తనకు అనుకూలంగా వినియోగించు­కున్నారు. మహిళా టైలర్లకు తెలియకుండా వారి పేరిట బ్యాంకు అకౌంట్లు, పాన్‌ కార్డులు తీసుకుని టైలరింగ్‌ ఛార్జీలను ఆయా అకౌంట్లలో వే­యించేవారు. అధికారులతో కుమ్మక్కయి బ్యాంకు లావాదేవీలు తనకు అనుకూలంగా కొన­సాగించుకోవడంతో టైలర్లు తమకు తెలియకుండానే ఆదాయపన్ను పరి«ధిలోకి చేరారు. దీంతో వారు సంక్షేమ పథకాలకు దూరమ­య్యారు.  

»  గ్రామస్తులు ఎవరైనా అత్యవసరాల కోసం డబ్బు తీసుకున్నా.. పెద్ద మొత్తం అయ్యేవరకు వేచిఉండి ఆ ప్రాంశరీ నోట్లను తిరిగి రాయించేవారు. ఆ తర్వాత ఆర్థికంగా వారిని పూర్తిగా కుంగదీసేవారు. ఇళ్ల స్థలాలు, ఇల్లు, భూములు ఇలా ఏవో ఒకటి లాగేసుకోవడం అన్నదమ్ములకు రివాజని స్థానికులు వివరించారు. 

సీఎం రమేశ్‌ సోదరుడు సురేశ్‌తో నిత్యం కలిసి ఉండే సోమశేఖరరెడ్డి తన అవసరాల కోసం రూ.40 వేలు తీసుకోగా కొన్నేళ్ల తర్వాత రూ. ఎనిమిది లక్షలకు పైగా తిరిగి చెల్లించాలని, లేదంటే తనకు భూమి రాసిచ్చేయా­­లని ఒత్తిడి చేశారు. దీంతో సోమశేఖరరెడ్డి కుటుంబం దెబ్బతింది. అదేవిధంగా జబ్బుపడిన తన బిడ్డ వైద్యం కోసం ఒక పేద దళిత వ్యక్తి రూ.2 వేలు తీసుకోగా లక్షకు పైగా చెల్లించాలని అతడిని ఒత్తిడి చేశారు. సీఎం రమేశ్‌ సోదరుల దౌర్జన్యాలకు చివరకు వారి సొంత చిన్నాన్న కుటుంబం కూడా ఆర్థికంగా చితికిపోయింది.  

»   ప్రొద్దుటూరులో ద్విచక్రవాహనాల స్కీమ్‌ పేరిట సీఎం రమేశ్‌ మోసం చేశారు. ప్రొద్దుటూరులో వ్యాపారులను, చుట్టుపక్కల గ్రామాల వారిని నిండా ముంచారు.  

»   గ్రామానికి అంతటికి సోలార్‌ ఎనర్జీ వచ్చేలా చేస్తానని చెప్పి మోసగించారు.  

»    పశువులు గ్రాసం కోసం ఇబ్బందిపడకుండా వసతి ఏర్పాటుచేస్తానని చెప్పి ప్రభుత్వ సొమ్ము దిగమింగారు.  

»    నీరు – చెట్టు ప«థకంలోనూ రూ.కోట్ల రూపాయలు దిగమింగారు.  

»    ఆర్‌టీపీపీకి వెళ్లే ఆర్‌ అండ్‌ బీ రోడ్డును కొంతమేర ఆక్రమించుకుని సీఎం రమేశ్‌ అపార్ట్‌­మెంట్‌ నిర్మాణం చేపట్టారు. తన ఇంటి కోసం రోడ్డును ఓ వైపునకు పొడిగించి భూములు కో­ల్పోయిన వారికి నష్టపరిహారం కూడా లేకుండా చేశారు. తమ ఇంటి ముందు ఉన్న పది అడు­గుల రోడ్డును ఆక్రమించడంతో పరిసరా­ల్లోని తమకు దగ్గరి నడక మార్గం లేక చుట్టూ తిరిగి రావాల్సి వస్తోందని స్థానికులు వాపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement