తహసీల్దారును చుట్టుముట్టిన టీడీపీ నేతలు
సాక్షి, కుప్పం: ఎన్నికల ముందు ఓట్ల కోసం పంపిణీ చేసిన ఇంటి పట్టాలు నకిలీవి కావడంతో పునాదులు వేసుకున్న కట్టడాలు తొలగించిన రెవెన్యూ అధికారులపై టీడీపీ బెదిరింపులకు దిగింది. కుప్పం మండల పరిధిలోని పలార్లపల్లి రెవెన్యూలో స్థలాల ఆక్రమణలు తొలగించినందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు జూమ్ వీడియో ద్వారా మంగళవారం రెవెన్యూ అధికారులపై బెదిరింపులకు దిగారు. పలార్లపల్లి రెవెన్యూలో ఉన్న ప్రభుత్వ స్థలంలో టీడీపీ నేతల బంధువులు గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి పట్టాలను చూపించి నిర్మాణ పనులు చేపట్టారు. ఈ స్థలం ప్రజావసరాల కోసం ఉంచిన ప్రభుత్వ స్థలం. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి రికార్డులు లేక ఇచ్చిన పట్టాలను ఆసరాగా చేసుకుని కొందరు టీడీపీ నేతల బంధువర్గం పునాదులు వేసుకున్నారు.
విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఈ పునాదులను తొలగించారు. ఇదిలా ఉండగా జీ ప్లస్ టూ కింద ఇచ్చిన హౌసింగ్ మంజూరు పట్టాలను ప్రభుత్వం రద్దుచేసింది. రికార్డులు లేని పట్టాలు చేతపట్టుకుని ప్రభుత్వ స్థలాల్లో పునాదులు నిర్మించడంతో రెవెన్యూ అధికారులు తొలగించారు. దీనిపై తెలుగుదేశం పార్టీ రెండు రోజులుగా రాద్దాంతం చేస్తోంది. మంగళవారం టీడీపీ నాయకులు రెవెన్యూ కార్యాలయం ఎదుట బైటాయించి నిరసన తెలిపారు. ఈ సమయంలో టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడుకు వీడియో కాల్ చేశారు. జూమ్ వీడియోలో తహసీల్దారు సురేష్‌బాబుకు చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలతో పాటు ఇళ్ల స్థలాలను కొనసాగించాలని హుకుం జారీ చేశారు. ఈ విషయంపై తహసీల్దారు సురేష్‌బాబు ఆయనకు సమాధానమిస్తూ ఎలాంటి నిబంధనలూ లేకుండా ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా పునాదులు వేశారని, ఈ పునాదుల్లో నిజమైన లబి్ధదారులను పరిశీలించి మరోచోట పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఎన్టీఆర్ హౌసింగ్ అక్రమాలపై విచారణ
గత ప్రభుత్వం ఎన్టీఆర్ గృహకల్ప కింద నిర్మించిన 345 కాలనీ గృహాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని అప్పటి ప్రతిపక్షాలు, స్వచ్ఛంద సంస్థలు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. విచారణ చేపట్టాలని అప్పటి కడా ప్రత్యేకాధికారి శ్యామ్‌ప్రసాద్ సైతం కమిటీని ఏర్పాటుచేస్తే ఆయనను ఆకస్మికంగా కడా నుంచి బదిలీ చేశారు. ఎనీ్టఆర్ గృహకల్ప పట్టాలపై బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ నాయకుడు సురే‹Ùబాబు సవాల్ విసిరారు. దీనికి టీడీపీ కాంగ్రెస్ పార్టీ మధ్య తిరుపతి గంగమ్మ దేవాలయం వేదికగా చర్చకు సిద్ధమయ్యారు. ఈ చర్చా వేదికలో టీడీపీ నాయకులు కాంగ్రెస్ నాయకులపై దాడులు చేశారు. ఇప్పటివరకు ఎనీ్టఆర్ గృహకల్ప అక్రమాలపై విచారణ పూర్తిస్థాయిలో జరగలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయి విచారణకు చర్యలు చేపడుతుంటే టీడీపీ అవినీతి అక్రమాలు ఎక్కడ బయటపడుతాయో అనే భయంలో అవనసర రాద్దాంతానికి తెరతీస్తున్నారు. తహసీల్దారును బెదిరించడం, ధర్నాలు, నిరసనలు చేపట్టడం వంటి జిమ్మిక్కులకు దిగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment