రైతుబంధు రాలేదని ఓ రైతు నాగు పామును చంపి కాల్చుకుతిన్నాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. బాధితుడి కథనం.. పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంట గ్రామానికి చెందిన కీర్తి శ్రీనివాస్‌కు ఇదే మండలంలోని చందపల్లి గ్రామ శివారులో మూడు సర్వే నంబర్లలో ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయినా రెవెన్యూ అధికారులు పాసుపుస్తకాలు ఇవ్వలేదు.