కొత్త చెరువును పరిశీలిస్తున్న ఆర్‌ఐ యాదయ్య ,పంట పొలాలను జేసీబీతో చదునుజేస్తున్న అధికారులు
ధారూరు(వికారాబాద్) : మండలంలోని గురుదోట్లలో ఉన్న కొత్త చెరువును కొంతమంది ప్రజాప్రతినిధులతో కలిసి కబ్జాచేసి వరి, జొన్న పంటలు సాగుచేసిన సంగతి తెలిసిందే. ‘దర్జాగా కబ్జా’ అనే శీర్షికతో సోమవారం వచ్చిన వార్తకు రెవెన్యూ అధికారులు స్పందించారు. ఈ సంఘటనపై ఆర్‌ఐ యాదయ్య, సర్వేయర్ ప్రభు, వీఆర్‌ఓ శ్రీశైలం చెరువు ప్రాంతానికి వెళ్లి రైతులు సాగు చేసిన పంట పొలాలను సోమవారం పరిశీలించారు. చెరువును కబ్జాచేసి సాగునీటితో గురుదొట్ల ఎంపీటీసీ సభ్యులు నేనావత్ గోరీబాయితో పాటు గుండ్యానాయక్, గమ్మిబాయి, రూప్లనాయక్, కొంకలి వీరమ్మ, కొంకలి బుగ్గయ్య, దామ్లానాయక్, హన్మంతు, సూబ్య, శంకర్ చెరువును కబ్జా చేసి జొన్నను సాగు చేశారు. చెరువును కబ్జాచేయడం నేరమని పంట పొలాలను తొలగించాలని ఆర్‌ఐ యాద య్య ఆదేశించారు. 14.01ఎకరాల చెరువు విస్తీర్ణంలో 9 ఎకరాలను రైతులు కబ్జా చేసినట్లు సర్వేలో బయటపడింది. వెంటనే జేసీబీతో పంటలను తొలగించారు. ఇకముందు ఎవరైనా చెరువు శిఖం భూమిని కబ్జా చేసిన అక్రమంగా దున్ని పంటలను సాగు చేసినా ఆయా రైతులపై చర్యలు తీసుకుంటామని ఆర్‌ఐ హెచ్చరించారు. చెరువుశిఖం భూమిని తమ ఆదీనంలోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment