
అమరావతి : గుంటూరు జిల్లా తాడేపల్లిలో మరోసారి ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. సీడ్ యాక్సెస్ రోడ్డు పేరుతో పొలాల్ని కొలతలు వేయడానికి రెవన్యూ అధికారులు భారీ స్థాయిలో పోలీస్ ఫోర్స్‌తో వచ్చారు. అయితే విషయం తెలుసుకున్న రైతులు పొలాలకు చేరుకొని కొలతలు వేయకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. భూసేకరణ చట్టం ప్రకారం పొలాలను కొలతలు వేసే అధికారం అధికారులకు లేదన్నారు. చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వకుండా ఎలా కొలతలు చేపడతారని రైతులు అధికారులను నిలదీశారు.