కీసర: రంగారెడ్డి జిల్లాలో రూ. 5 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని మంగళవారం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కీసర మండలం అహ్మద్‌గూడ గ్రామానికి చెందిన బండ్ల పోచయ్య, రాములు, నారాయణలకు వ్యవసాయ నిమిత్తం అధికారులు ఎనిమిదెకరాల 17 గుంటల భూమిని కేటాయించారు. అయితే వీరు ఆ భూమిని ఇతరులకు విక్రయించినట్లు సమాచారం అందడంతో రెవెన్యూ అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే నాగారం గ్రామపరిధిలో రూ. కోటి విలువ చేసే మరో స్థలాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.