చిత్తూరు: చీటీల పేరిట రూ.50 లక్షల దాకా డబ్బులు వసూలు చేసి మోసం చేసిన సంఘటన శుక్రవారం పలమనేరు పట్టణంలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని గంటావూరు కాలనీలో నారాయణ భార్య అన్నపూర్ణ స్థానిక కాలనీ వాసులతో స్నేహంగా ఉండేది. చీటీలు నడపుతూ కాలనీ వాసుల్లో నమ్మకాన్ని పెంచుకొంది. దీంతో చాలామంది ఆమె వద్ద చీటీలను వేయడంతో పాటు వడ్డీలకు సైతం ఇచ్చేది.
ఈ క్రమంలో కొన్నాళ్లుగా వారి ఇంటికి తాళం వేసి ఉండడంతో బాధితులు ఫోన్ చేయడం, తాము ఊరెళ్లామని వారంలో వస్తామంటూ అన్నపూర్ణ నమ్మించడం రివాజుగా మారింది. గత మూడు రోజులుగా అన్నపూర్ణ ఫోన్ స్విచ్ ఆఫ్‌చేసి ఉండడంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు ఎస్‌ఐ సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా కొంగోళ్లపల్లి బాలాజీకి రూ.27లక్షలు, లక్ష్మికి రూ.5 లక్షలు, కుముదాకు రూ.రెండు లక్షలు, ఇలా పలువురుకి రూ.50 లక్షల దాకా ఇవ్వాలని బాధితులు పోలీసులకు తెలిపారు. దీనిపై ఎస్‌ఐ సుబ్బారెడ్డి విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment