అన్నపూర్ణే సదాపూర్ణే..
- తెల్లవారుజాము నుంచి కిక్కిరిసిన క్యూలైన్లు
- లక్షమందికిపైగా దర్శించుకున్నారని అంచనా
- ఉదయం నుంచి అంతరాలయ దర్శనం రద్దు
- అన్నపూర్ణమ్మను దర్శించుకుని తరించిన భక్తకోటి
సాక్షి, విజయవాడ : అమ్మలగన్నమ్మ.. ముగురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ ఆదివారం శ్రీఅన్నపూరాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం సెలవు కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. సుమారు లక్షకుపైగా భక్తులు అమ్మను దర్శించుకున్నారని అధికారుల అంచనా.అనధికార వీఐపీలు పెద్ద ఎత్తున రావడంతో ఉభయదాతలు, టికెట్లు కొనుగోలుచేసిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 8 గంటల దాటే సమయూనికి రద్దీ పెరగడంతో అంతరాలయ దర్శనం రద్దుచేసి లఘుదర్శనానికి అనుమతించారు.
రంగంలో దిగిన డీసీపీ అశోక్‌కుమార్
అనధికార వీఐపీల రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రధాన ద్వారం వద్ద రద్దీ విపరీతంగా పెరిగింది. అక్కడ ఉన్న సీఐతో భక్తులు ఘర్షణ పడ్డారు. దీంతో డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అశోక్‌కుమార్ రంగంలోకి దిగి భక్తుల్ని క్రమబద్ధీకరించారు. అనధికార వీఐపీలను దర్శనానికి పంపడం తగ్గించి మిగిలిన వారిని అనుమతించారు.
గంటలకొద్దీ క్యూలైన్‌లోనే..
ఆదివారం ఉదయం నుంచి క్యూలైన్లు భక్తులతో నిండిపోయూరుు. ఒకదశలో దర్శనానికి ఐదు గంటల సమయం పట్టింది. తాము తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళ్లి వస్తున్నామని, అక్కడ రెండు గంటల్లో సర్వదర్శనం క్యూలో దర్శనమైందని, ఇక్కడ నాలుగు గంటలైనా లైన్‌లోనే ఉన్నామని ఏలూరుకు చెందిన భక్తురాలు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది ఎక్కువసేపు నిలబడలేక క్యూలైన్ మధ్య నుంచే తిరుగుముఖం పట్టారు.
అన్నదానం వద్ద క్యూ కట్టిన భక్తులు
ఆదివారం సెలవు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అన్నపూర్ణాదేవి అలంకారం కావడంతో దర్శనానంతరం అన్న ప్రసాదం స్వీకరించేందుకు పోటీ పడ్డారు. దీంతో ఆదివారం సుమారు పదివేలమందికి అన్నదానం చేశారు.
మండుటెండతో ఇబ్బందులు
మండుటెండకు భక్తులు ఇబ్బందులు పడ్డారు. రథం సెంటర్‌లోని స్టాండ్ వద్దే చెప్పులు భద్రపరుచుకోవడంతో కొండపైకి ఎండలో నడిచి నానా అవస్థలకు గురయ్యూరు. రానున్న రోజులను దృష్టిలో పెట్టుకుని అధికారులు కార్పెట్లు ఏర్పాటుచేస్తే బాగుంటుందని భక్తులు కోరుతున్నారు.
హంస వాహనానికి తుది మెరుగులు
దశమి రోజున శ్రీదుర్గామల్లేశ్వరస్వామి నదీ విహారానికి హంస వాహనం ముస్తాబవుతోంది. దురాఘాట్‌లో హంస వాహనాన్ని సిద్ధం చేయడమే కాకుండా మంగళవారం ట్రయిల్ రన్ నిర్వహించే అవకాశాలున్నాయని ఆలయ అధికారులు తెలిపారు.