డీఎస్సీ-14లో మాకూ ఛాన్స్ ఇవ్వాలి | D.Ed candidates demand for to qualify Dsc-14 | Sakshi
Sakshi News home page

డీఎస్సీ-14లో మాకూ ఛాన్స్ ఇవ్వాలి

Published Mon, Jul 21 2014 11:51 PM | Last Updated on Sat, Sep 2 2017 10:39 AM

D.Ed candidates demand for to qualify Dsc-14

 బాలాజీ చెరువు(కాకినాడ) :  త్వరలో వెలువడనున్న డీఎస్సీ-14లో తమకూ అవకాశం కల్పించాలంటూ సోమవారం డీఎడ్(డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) ద్వితీయ సంవత్సర అభ్యర్థులు నినాదాలు చేశారు. ముందుగా వారు మెయిన్‌రోడ్డులోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, కార్యాలయ ఏడీ అన్నపూర్ణకు వినతిపత్రం అందజేశారు.

అనంతరం విద్యార్థులందరూ అక్కడి నుంచి ర్యాలీగా మసీదు సెంటర్ నుంచి బాలాజీ చెరువు మీదుగా జీజీహెచ్ నుంచి కలెక్టరేట్‌కు చేరుకుని అక్కడ నినాదాలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి 2008 డీఎస్సీ పోస్టుల్లో డీఎడ్ ద్వితీయ సంవత్సర అభ్యర్థులకు అవకాశం కల్పించారని, అదే పద్ధతి 2012లోనూ కొనసాగించారన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని అన్నారు.

 అనంతరం యూటీఏఫ్ భవనంలో డీఎడ్ ద్వితీయ సంవత్సర అభ్యర్థుల సంఘ అధ్యక్షుడిగా నక్కా పాండురంగారావు, ఉపాధ్యక్షుడిగా కె.రాజు, ప్రధాన కార్యదర్శిగా ఎం.శివసాయిప్రసాద్, కోశాధికారిగా ముమ్మిడి సతీష్, కార్యదర్శిగా బి.హరీష్, కార్యవర్గ సభ్యులుగా పి.అప్పలసూరి, డి.మురళీకృష్ణ, రవితేజ, సతీష్‌కుమార్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి సుబ్బరాజు, పీఆర్టీయూ అధ్యక్ష, కార్యదర్శులు పి.వి.వి సత్యనారాయణ,చింతాడ ప్రదీప్‌కుమార్‌తో పాటు దాదాపు రెండువేల మంది డీఎడ్ విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement