స్టేజీపైనే ముద్దులతో రెచ్చిపోయిన నరేశ్- పవిత్ర లోకేశ్..! | Naresh and Pavitra Lokesh participated In Tv Show Goes Viral | Sakshi
Sakshi News home page

స్టేజీపైనే నరేశ్- పవిత్ర ముద్దుల వర్షం.. వీడియో వైరల్!

Published Tue, May 16 2023 1:37 PM | Last Updated on Tue, May 16 2023 1:49 PM

Naresh and Pavitra Lokesh participated In Tv Show Goes Viral - Sakshi

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు వీకే నరేశ్‌, పవిత్ర లోకేశ్‌ ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు. అయితే అదంతా అందరూ అది నిజమే అనుకున్నారు. కానీ ఆ తర్వాత ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్‌ ఇచ్చారు నరేశ్- పవిత్ర.

ఓ సినిమా కోసం ఆ వీడియో చేసినట్లు వెల్లడించారు. మళ్లీ పెళ్లి అనే చిత్రంలో పవిత్ర లోకేశ్, నరేశ్ జంటగా నటిస్తున్నారు. ఎంఎస్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రస్తుతం మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది చిత్రబృందం. 

(ఇది చదవండి: Malli Pelli Teaser: నరేశ్- పవిత్రల 'మళ్లీ పెళ్లి'.. ముహూర్తం ఫిక్స్!)

ఈ సందర్భంగా ఓ టీవీ షోలో నరేశ్, పవిత్ర పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. వేదికపైనే ఈ ప్రేమజంట ముద్దులతో రెచ్చిపోయారు. వీరిద్దరిని చూసిన యాంకర్‌ ఓ చిలిపి ప్రశ్న వేశారు. మీ ఇద్దరి రిలేషన్‌షిప్ ఏంటని అడగగా.. దీనికి క్రేజీ ఆన్సరిచ్చారు నరేశ్. 'ఆకాశం విరిగిపడినా.. భూమి బద్దలైనా మేమిద్దరం కలిసే ఉంటాం' నవ్వుతూ చెప్పారు. దీంతో ఈ ప్రేమజంటను చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

(ఇది చదవండి: చిన్న రూమ్‌ రెంట్‌కు..ఒక్క పూట మాత్రమే తినేవాడిని : శివ బాలాజీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement