బుల్లితెరపై హృతిక్... షో! | Hrithik Roshan will be hosting a TV show on Real-Life Heroes | Sakshi
Sakshi News home page

బుల్లితెరపై హృతిక్... షో!

Published Sat, Jul 11 2015 11:53 PM | Last Updated on Sun, Sep 3 2017 5:19 AM

బుల్లితెరపై హృతిక్... షో!

బుల్లితెరపై హృతిక్... షో!

 హృతిక్ రోషన్ ఇప్పుడో బుల్లితెర షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. దీనిలో ప్రత్యేకత  ఏముందనుకుంటున్నారా..? ఇంతకీ ఆ కాన్సెప్ట్ ఏంటంటే... జీవితంలో అత్యంత దీనమైన పరిస్థితులను దాటుకుంటూ, ఒక్కొక్క మెట్టు ఎక్కి, విజయం సాధించిన కొంతమంది వ్యక్తులను ప్రపంచానికి పరిచయం చేయడమే. 2011లో ‘జస్ట్ డ్యాన్స్’ అనే రియాల్టీ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు హృతిక్. ఆ తర్వాత చాలా ఆఫర్లు వచ్చినా రొటీన్‌గా ఉండడంతో ఒప్పుకోలేదు. కానీ డిస్కవరీ చానల్ ప్రతినిధులు చెప్పిన ‘రియల్ హీరోస్’ కాన్సెప్ట్ హృతిక్ గత జీవితాన్ని గుర్తు చేసుకునేలా చేసిందట. తన చిన్నతనంలో మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడేవారట హృతిక్. నటుడు కావాలనే పట్టుదలతో క ష్టపడి స్పీచ్ థెరపీ క్లాస్‌కు వెళ్లి తనకున్న లోపాన్ని సరిదిద్దుకున్నారట. ‘రియల్ హీరోస్’ కాన్సెప్ట్ ఇంచుమించు తన నిజజీవితానికి దగ్గరగా ఉండడంతో వెంటనే పచ్చజెండా ఊపారట హృతిక్. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఈ కార్యక్రమం ప్రసారం కానుందట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement