సమాధానం వెనుక విషాదం | Who Wants To Be A Millionaire? Amputee Answer About Leg | Sakshi
Sakshi News home page

సమాధానం వెనుక విషాదం

Published Fri, May 11 2018 8:33 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

Who Wants To Be A Millionaire? Amputee Answer About Leg - Sakshi

హోస్ట్‌ జెర్మీ క్లార్క్‌ సన్‌తో గారెత్‌

లండన్‌ : నష్టపోయిన చోటే అదృష్టాన్ని వెతుక్కోమన్నారు పెద్దలు. అలాంటిది నష్టపోయిన చోటు వల్ల కోట్లు కలిసొస్తే.. ఇక ఆనందానికి అవధులుండవు. అలాంటి సంఘటనే లండన్‌లో చోటు చేసుకుంది. తన కాలును పోగొట్టుకున్న ప్రదేశాన్ని జవాబుగా చెప్పి అక్షరాలా 7,500,000 లక్షల రూపాయలు గెలుచుకున్నాడో వ్యక్తి. వివరాల్లోకి వెళితే.. కెనడాలోని హలీఫాక్స్‌ కు చెందిన గారెత్‌ కెండాల్‌ హు వాంట్స్‌ టు బీ ఏ మిలయనీర్‌?(మీలో ఎవరు కోటీశ్వరుడు?కు మాతృక) అనే టి.వి షోలో పాల్గొన్నాడు.

ఇందులో భాగంగా.. ఉర్క్హార్ట్ కోట ఎక్కడ ఉందన్న ప్రశ్నకు గారెత్‌ చెప్పిన సమాధానం షో హోస్ట్‌ను నివ్వరపోయేలా చేసింది. ఉర్క్హార్ట్ కోట తనకు బాగా తెలుసునని, అక్కడే తన కాలును పోగొట్టుకున్నానని చెప్పడంతో కొద్ది సేపు హాలు మొత్తం నిశ్శబ‍్ధం అలుముకుంది. హోస్ట్‌ జెర్మీ క్లార్క్‌ సన్‌కు జరిగిన విషాదం గురించి వివరించాడు గారెత్‌. కోట దగ్గరి ప్రాంతంలో జరిగిన కారు ప్రమాదంలో తన ఎడమ కాలును పోగొట్టు కున్నానని, ఆ ప్రమాదం తర్వాత బతికుండటం మరో జన్మని అన్నాడు.

హాస్పిటల్‌ ఐసీయూలో ఉన్న తాను బతకటం చాలా కష్టమని వైద్యులు చెప్పారని తెలిపాడు. చాలా రోజులు ఆస్పత్రి బెడ్‌ మీదే గడిచి పోయాయని వివరించాడు. కోట ఉన్న ప్రాంతాన్ని చెప్పడంతో లక్షల రూపాయలు గారెత్‌ సొంతమయ్యాయి. తర్వాత రౌండ్‌కు వెళ్లే అవకాశం ఉన్నా అంతటితో ఆటకు ముగింపు పలికి షోలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు గెల్చుకున్న వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement