handicaped
-
‘దివ్యాంగులకూ సమానావకాశాలు కల్పించాలి’
సాక్షి, హైదరాబాద్: దివ్యాంగులు కూడా మన సమాజంలో అందరితోపాటు సమానావకాశాలు పొందాలని, అందుకోసం వారిని ఆదుకునేందుకు సహృదయులు ముందుకు వస్తే దివ్యాంగులు ఎన్నో అద్భుతాలు సృష్టించగలరని టీసీపీ వేవ్ సంస్థ యాజమాన్య ప్రతినిధి పవన్ గాది తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించి దివ్యాంగుల జీవితాల్లో మార్పు తేవాలన్నది తమ లక్ష్యమని ఆయన అన్నారు. కృత్రిమ అవయవాల ద్వారా ఇక్కడికొచ్చిన దివ్యాంగులు పూర్తిస్థాయి ఆత్మవిశ్వాసాన్ని పొందగలిగారని, ఇక్కడ అమర్చిన ప్రతి ఒక్క అవయవం వాళ్లందరి సామర్థ్యాలను మరింతగా వెలికితీసేలా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమం అందించిన స్ఫూర్తితో మరింతమంది దివ్యాంగుల జీవితాలను మార్చగలమన్న నమ్మకం తమకు కుదిరిందని ఆయన అన్నారు. శ్రీ భగవాన్ మహావీర్ వికలాంగ సహాయతా సమితి ఆధ్వర్యంలో గుర్తించిన 50 మంది దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు, వీల్ఛైర్లు, మూడుచక్రాల సైకిళ్లు, హ్యాండ్ కిట్లు, కాలిపర్స్, వాకర్ల లాంటివాటిని టీసీపీ వేవ్ సంస్థ సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా అందించారు. కింగ్ కోఠిలోని ప్రభుత్వాసుపత్రిలో ఆదివారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ స్వప్న వాయువేగుల మాట్లాడుతూ, పారాలింపిక్స్ లాంటి క్రీడల్లో భారతీయులు ఎంతో ప్రతిభ చూపిస్తున్నారని.. దివ్యాంగులకు కొంత సాయం అందించగలిగితే వాళ్లు సమాజంలో అందరితో సమానంగా ముందుకొచ్చి, గౌరవప్రదమైన జీవితం గడపగలరని అన్నారు. నిరుపేద నేపథ్యం నుంచి వచ్చిన ఈ 50 మంది సొంతంగా పరికరాలు సమకూర్చుకునే స్థితిలో లేనందున వారిని ఆదుకోవాలని శ్రీ భగవాన్ మహావీర్ వికలాంగ సహాయతా సమితి తమను సంప్రదించగానే వెంటనే ముందుకు వచ్చామని ఆమె తెలిపారు. సమితివారే స్వయంగా ఈ కృత్రిమ అవయవాలను తయారుచేసి ఇవ్వడం సంతోషకరమని చెప్పారు. రాబోయే రోజుల్లో 500 మంది దివ్యాంగులకు ఈ తరహా కృత్రిమ అవయవాలు, వీల్ ఛైర్లు, వాకర్లు అందజేస్తామని తెలిపారు. శ్రీ భగవాన్ మహావీర్ వికలాంగ సహాయతా సమితి సహకారంతోనే తాము ఇదంతా చేయగలుగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా ఫిక్కి ఐటీ ఛైర్మన్ మోహన్ రాయుడు, సీనియర్ పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ సూరావఝల రాము, డీసీఎస్ఐ సీఈఓ డాక్టర్ శ్రీరామ్, సలహాదారు బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. -
వికలాంగులకు నాట్స్ చేయూత!
అమెరికాలో తెలుగు వారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముమ్మరంగా సేవా కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగానే తాజాగా నిజామాబాద్‌లో ఓ దివ్యాంగుడు స్వశక్తితో ఎదిగేందుకు చేయూత అందించింది. హోప్ ఫర్ స్పందనతో కలిసి నాట్స్ దివ్యాంగుడు కిరణా దుకాణం పెట్టుకునేందుకు కావాల్సిన ఆర్ధిక సాయం చేసింది. నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు)నూతి ఈ కిరణా దుకాణాన్ని ప్రారంభించి ఆ దివ్యాంగుడికి భరోసా ఇచ్చారు.తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతుందని విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో తన వంతు చేయూత అందించేందుకు నాట్స్ ఎప్పుడూ ముందుంటుందని నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి తెలిపారు. దివ్యాంగులు స్వశక్తితో ఎదిగేందుకు కావాల్సిన చేయూత ఈ సమాజం అందించాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు. హోప్ ఫర్ స్పందన దివ్యాంగుల కోసం చేస్తున్న కృషిని గుర్తించి ఆ సంస్థతో కలిసి తాము కూడా చేతనైన సాయం చేస్తున్నామని బాపు నూతి తెలిపారు.. దివ్యాంగుల సమస్యలను తమ దృష్టికి తెచ్చి వారికి చేయూత అందించడంలో తమను భాగస్వాములు చేసిన హోప్ ఫర్ స్పందనకు నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: యూఎస్ జడ్జిగా తొలి తెలుగు మహిళ! వైరల్‌గా ప్రమాణ స్వీకారం..!) -
దివ్యాంగుల కోసం కోర్టుల్లో సౌకర్యాలు కల్పించాలి: హైకోర్టు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాల్లో దివ్యాంగులైన న్యాయవాదులు, కక్షిదారుల సౌకర్యార్థం లిఫ్టులు, రాకపోకలు సాగించేందుకు వీలుగా ఏర్పాట్లు, ఇతర వసతులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. వసతుల ఏర్పాటు బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఈ విషయంలో ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలుసుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొంది. ఇందుకోసం తమ ముందున్న వ్యాజ్యంలో ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్లను ఆదేశించింది. విచారణను ఏప్రిల్ 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్‌మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లా నరసరావుపేట కోర్టులో దివ్యాంగులైన న్యాయవాదులకు, కక్షిదారులకు తగిన సౌకర్యాలు కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాదులు జీఎల్‌వీ రమణమూర్తి, మరో ఏడుగురు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. -
ఆమె ధైర్యం ముందు విధి సైతం చిన్నబోయింది!
చాలామంది చిన్నచిన్న కష్టాలకి కుంగిపోతారు! మరికొందరూ..ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వగానే నిరాశ నిస్ప్రుహలకి లోనై అక్కడితో ఆగిపోతారు. కొద్దిమంది మాత్రమే విధి విసిరిన సవాలును ఎదిరించి నిలబడి తనని తాను నిరూపించుకోవటానికి శతవిధాల ప్రయత్నిస్తూ ఆదర్శంగా నిలుస్తారు. ఈ కోవకు చెందిన బాలిక బిహార్‌కు చెందిన తనూ కుమారి. ఓ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన తనూ కుమారి.. కాళ్లనే చేతులుగా మార్చుకుని తన భవిష్యత్తును చెక్కుకుంటుంది. ఆ వివరాలు.. బిహార్ పట్నాకు చెందిన తనూ కుమారి ప్రస్తుతం పదో తరగతి చదువుతుంది. ఆమెకు రెండు చేతులు లేవు. 2014లో తనూ టెర్రస్ పై ఆడుకుంటూ అనుకోకుండా ఎలక్ట్రిక్ వైరులను పట్టుకోవడంతో తన రెండూ చేతులను కోల్పోయింది. అయినా కూడా తనూ వెనకడుగు వేయలేదు. కాళ్లనే చేతులుగా మార్చుకుంది. పట్టుదలో శ్రమించి కాలి వేళ్లతో రాయడం నేర్చుకుంది. అది మాత్రమే కాక పేయింటింగ్ కూడా ప్రాక్టీస్ చేసింది తనూ. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న తనూ కుమారి.. బాగా చదువుకుని భవిష్యత్తులో టీచర్ని అవుతానని ధీమా వ్యక్తం చేస్తోంది. (చదవండి: మహిళ చేతిలో కేంద్ర మంత్రికి ఘోర అవమానం) ఆటలు ఆడటం, పేయింటింగ్ వేయడం తనకు ఎంతో ఇష్టమంటుంది తనూ కుమారి. ఇప్పటికే పలు పేయింటింగ్ కాంపిటీషన్స్‌లో పాల్గొని.. ఎన్నో అవార్డులు గెలుచుకుంది. కూతురు ఆత్మస్థైర్యం చూస్తే తనకెంతో గర్వంగా ఉంటుందంటున్నారు ఆమె తల్లి సుహా దేవి. తన కూతురు ఆత్మస్థైర్యంతో వైకల్యాన్ని అధిగమించి దూసుకుపోతున్నందుకు తనకెంతో ఆనందంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆమె తండ్రి అనిల కుమార్ గ్యాస్ డెలివరి మెన్‌గా పనిచేస్తున్నాడు. తాను పేదవాడినని తమను ప్రభుత్వం ఆదుకుంటే బాగుండనని ఆమె తండ్రి అనిల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. (చదవండి: చెల్లితో పాములకు రాఖీ కట్టించబోయాడు.. ప్రాణాలు కోల్పోయాడు) ప్రభుత్వ సాయం చేయాలి.... ఆమెను మొదటిసారి చూసినప్పుడే ఆశ్చర్యపోయానని, ఇలాంటి ధైర్యవంతురాలికి ప్రభుత్వ అండగా నిలిస్తే ఆమె మరిన్ని విజయాలు సాధిస్తోందని తనూ సైన్య్ టీచర్ దివ్య కుమారి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమెకు మేము ఎల్లప్పుడు తోడుగా ఉంటాం, తనూ ఓడిపోదూ... ఆత్మస్థైర్యంతో దూసుకుపోతుందంటూ తనూ కుమారి స్నేహితులు కొనియాడారు. Bihar | Tanu Kumari, a Patna-based girl, who lost both her hands in an accident in 2014, gets promoted to class 10 "After the accident, I slowly learned how to write with my feet. I also like to participate in sports and painting activities. I want to become a teacher," she says pic.twitter.com/UcGYyqTlAm — ANI (@ANI) September 6, 2021 -
టెస్లాకు థ్యాంక్యూ చెప్పిన వికలాంగుడు?
రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ వల్ల ఒకప్పుడు మనం ఇబ్బంది పడిన ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రస్తుతం అభివృద్ధి చెందిన టెక్నాలజీ వల్ల కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా ఆఫీస్ పనిని ఇంటి నుంచి చేయడం జరుగుతుంది. ఇలా ఎన్నో సమస్యలకు టెక్నాలజీ వల్ల పరిష్కారం లభిస్తుంది. ప్రస్తుతం పెద్ద పెద్ద పట్టణాల్లో ప్రతి మనిషికి ఒక కారు ఉంటుంది. దీనివల్ల వారు బయటకి వచ్చినప్పుడు ట్రాఫిక్ జామ్ లతో పాటు, కారు పార్కింగ్ సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. చైనా, జపాన్ లాంటి దేశాల్లో కార్ పార్కింగ్ కోసం వివిధ అంతస్థుల్లో కారు పార్కింగ్ చేసే పద్ధతి కూడా ఉంది. అయితే, ఈ కార్ల పార్కింగ్ వల్ల చాలా మంది ఎప్పుడో ఒకసారి ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు. ఇక కారు పార్కింగ్ విషయంలో వికలాంగులు పడ్డ ఇబ్బందుల గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఒక వికలాంగుడు కూడా కారు పార్కింగ్ విషయంలో ఇటువంటి సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. తాను తన కారు పార్క్ చేసిన ప్రదేశానికి వచ్చి కారు డోర్ తీయడానికి ప్రయతించినప్పుడు చాలా ఇబ్బందికి గురి అయ్యాడు. తన టెస్లా కారుకి ఇరువైపులా వేరే కార్లు పార్క్ చేసి ఉండటం వల్ల కారు డోర్ తీయడానికి సాధ్యం కాలేదు. Thank you @Tesla for this helpful and cool feature :-) pic.twitter.com/FLuY3yFdSL — Thomas Fogdö (@Fogdo) September 8, 2019 కారు యజమాని థామస్ ఫొగ్డో తన కారున్న పరిస్థితిని గమనించి కాస్త వెనక్కి వచ్చి జేబులో నుంచి తన స్మార్డ్ ఫోన్ తీసి టెస్లా యాప్ లో క్లిక్ చేయగానే టెస్లా కారు వచ్చి తన ముందు ఆగుతుంది. అంత మంచి సౌకర్యాన్ని అందించిన టెస్లాకు ఫోగ్డో థాంక్యూ చెప్పాడు. ట్విట్టర్లో ఈ వీడియోను "థ్యాంక్యూ @టెస్లా హెల్ప్‌ఫుల్, కూల్ ఫీచర్ అందించినందుకు" అని పోస్టు చేసాడు. ఈ ఘటన 2019, సెప్టెంబర్ 8న జరిగింది. 44 సెకన్లు వీడియో క్లిప్‌ని 1.3 మిలియన్ల కంటే ఎక్కువ మందే చూశారు. వేల కొద్దీ లైక్‌లు, రీట్వీట్లు, రిప్లైలు వచ్చాయి. అయితే అన్నింటిలో మంచి చెడులు ఎలా ఉంటాయో, ఈ టెక్నాలజీలోనూ అంతే ఎంతో కొంత ఇబ్బంది ఉండకపోదు. అందుకే ఈ వీడియోకి మిక్స్డ్ స్పందన వచ్చింది. కొందరు అద్భుతంగా ఉందంటే, ఇంకొందరు ఇలాగైతే కారును హ్యాక్ చేసేయొచ్చు, యాక్సిడెంట్లు తప్పవు అంటూ కామెంట్ చేశారు. చదవండి: వాహనదారులకు కేంద్రం తీపికబురు! -
దివ్యాంగుడికి స్పీకర్ చేయూత
సాక్షి, హైదరాబాద్: అనారోగ్య, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ఓ దివ్యాంగుడిని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదుకున్నారు. నాగర్‌కర్నూలు జిల్లా కు చెందిన నరేశ్ 90 శాతం వికలాంగత్వంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తండ్రి చనిపోవడంతో హైదరాబాద్ పాతబస్తీలోని కుమ్మరిగూడలో తల్లితో పాటు అద్దెకుంటున్నారు. తల్లి రోజువారీ కూలి. నరేశ్ తన గోడును పోచారం శ్రీని వాసరెడ్డికి ఫోన్‌చేసి వెళ్లబోసుకున్నాడు. దీంతో ఆయన హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతితో మాట్లాడి ప్రభుత్వం నిర్మిస్తోన్న డబుల్ బెడ్రూం ఇళ్లలో ఒక ఇంటిని కేటాయించాలని సూచించారు. వికలాంగుల హక్కుల వేదిక జాతీయ నాయకులు కొల్లి నాగేశ్వరరావుతో మాట్లాడి బ్యాటరీ ట్రై సైకిల్ ను అందించాలని కోరారు. స్పీకర్ సూచనతో మం గళవారం హైదరాబాద్ జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 100 శాతం సబ్సిడీపై సమకూర్చిన బ్యాటరీ ట్రై సైకిల్‌ను నరేశ్‌కు అందించారు. -
నువ్వేం పనికొస్తావు? అని చీదరించేవారు
చదువు లేదు.. నడవడం కూడా సరిగ్గా రాదు ఎలా బతుకుతావు రా నువ్వు’ అంటూ చుట్టుపక్కల వారు హేళన చేస్తుంటే ఆ దివ్యాంగుడి హృదయం తల్లడిల్లిపోయేది. కానీ ఆ మాటలే అతన్ని స్వశక్తిపై నడిపించాయి. దివ్యాంగుని సంకల్పం ముందు వైకల్యం తల వంచింది. శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా ఉండీ.. పరులపై ఆధారపడే ఎందరో ఉన్న నేటి సమాజంలో ఓ దివ్యాంగుడు తన స్వశక్తిపై జీవించడమే కాక మరో రెండు కుటుంబాలకు ఉపాధి కల్పించడం గొప్ప విషయం. ఛీదరింపులు.. ఛీత్కారాలను ఎదుర్కొంటూ గేలి చేసిన నోళ్లు మూతపడేలా ఎదిగిన షాషావలి విజయప్రస్థానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి, అనంతపురం కల్చరల్: జిల్లా కేంద్రం అనంతపురం నగరంలోని మున్నానగర్‌కు చెందిన రసూల్‌బీ, అబ్దుల్ సత్తార్ దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో పెద్దవాడు ఖాదర్‌వలి, రెండోవాడు షాషావలి. అబ్దూల్సత్తార్ బొరుగుల బట్టీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. బాల్యంలోని మధురానుభూతులను మూటగట్టుకున్న తరుణంలో షాషావలి (ఐదేళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు) పోలియో మహమ్మారి బారిన పడ్డాడు. ఓ కాలు అవిటిదైంది. చాలా రోజుల పాటు ఇంటికే పరిమితమయ్యాడు. పేదరికం కారణంగా సరైన చికిత్సలు కూడా అందించలేని దుర్భర స్థితిలో అబ్దుల్‌సత్తార్ దంపతులు విలవిల్లాడారు. చిరుప్రాయంలోనే వివక్ష: తన ఈడు పిల్లలు వీధిలో ఎంతో ఉల్లాసంగా గెంతుతూ.. ఆడుకుంటూ ఉంటే షాషావలి హృదయం మూగగా రోదించేది. అమ్మా నేను కూడా వారిలా ఆడుకుంటా కదూ? నా కాలు బాగవుతుంది కదూ? అంటూ అమాయకంగా అతను ప్రశ్నిస్తుంటే ఆ తల్లి చెంగు చాటున కన్నీళ్లు వరదై ప్రవహించేవి. బిడ్డ ఇలాగే ఉంటే మానసికంగా మరింత బలహీనుడవుతాడని భావించిన తల్లిదండ్రులు నగరంలోని పాతూరు నంబర్ 1 స్కూల్లో చేర్పించారు. అయితే పాఠశాలలో తోటి విద్యార్థులు ఎగతాళి చేస్తూ సూటిపోటి మాటలు అంటుంటే భరించలేకపోయాడు. ‘యా అల్లా... నేనేమి పాపం చేశాను. నాకేందుకు ఈ శిక్ష’ అంటూ బాధపడుతూ అందరూ ఉన్నా.. పాఠశాలలో ఒంటరిగానే మిగిలిపోయాడు. చివరకు ఐదో తరగతితో చదువులను అటకెక్కించి, ఏదో ఒక పనిచేసుకుని జీవించాలనుకున్నాడు. అడుగడుగునా ఛీదరింపులే: షాషావలి పనికి పోయిన చోటల్లా ఛీదరింపులు చవిచూడాల్సి వచ్చింది. ‘నువ్వేం పనికొస్తావు’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతుంటే తాను ఎందులోనూ తక్కువ కాదని నిరూపించాలనే కసితో ఎదగడం మొదలెట్టాడు. ఓ సైకిల్ షాప్‌లో పంచర్లు వేయడంతో మొదలు పెట్టిన జీవిత ప్రస్థానం... తర్వాత టైలరింగ్ వైపు మళ్లింది. అక్కడ కూడా ఛీత్కారాలు ఎదుర్కొన్నాడు. దుకాణానికి వచ్చే కస్టమర్ల ఎదుట షాషావలి తిరుగుతుంటే యజమాని నామోషీగా ఫీలవుతూ చీదరించుకునేవాడు. ఈ మాటలు పడలేక చివరకు అక్కడ కూడా పని మానేశాడు. ఆ తర్వాత రెండేళ్లు శ్రీకంఠం సర్కిల్ సమీపంలోని ఓ వెల్డింగ్ షాప్‌లో పనికి చేరాడు. అక్కడ కూడా అవే అవమానాలు.. ఛీత్కారాలు. రోజుకు రూ.5 కూలి ఇచ్చేవాడు. అక్కడ ఈసడింపులు భరించలేక కొన్నాళ్లు ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకునేందుకు వెళ్లాడు. ఇక్కడ కూడా షరామాములే. చివరకు గుత్తిరోడ్డులోని శివారెడ్డి వెల్డింగ్ షాప్‌లో పనికి చేరాడు. ఏడేళ్లపాటు అక్కడే ఉంటూ వివిధ రకాల గృహోపకరణాలు చేయడం నేర్చుకున్నాడు. పోటీ నుంచి తప్పించాలని సహజంగా ఒకరు ఎదుగుతుంటే ఓర్వలేని ఎంతో మంది అవాంతరాలు సృష్టిస్తూనే ఉంటారు. ఇదే విషయం షాషావలి జీవితంలోనూ ఎదురైంది. ఎలాగైనా అతన్ని పోటీ నుంచి తప్పించాలని పలువురు ముమ్మర ప్రయత్నాలు చేశారు. అక్కడి నుంచి అతన్ని ఖాళీ చేయించేందుకు కుట్రలు పన్నారు. ఇలాంటి తరుణంలోనే కనీస సానుభూతి ఉంటుందనే కారణంతో తన దుకాణానికి ‘అనంత వికలాంగుల ఆధ్వర్యంలో’ అనే బోర్డు ఏర్పాటు చేసుకున్నాడు. అయినా అడ్డంకులు ఆగడం లేదు. ఇప్పటికే ఆ స్థలాన్ని ఖాళీ చేయాలంటూ అధికారులతో నోటీసులిప్పించారంటే వికలాంగుల పట్ల ఎంత వివక్ష కనబరుస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. జీవితమే ఆదర్శం కర్నూలుకు చెందిన రేష్మా అనే పోలియో బాధితురాలిని పెళ్లి చేసుకోవాలని షాషావలి అనుకున్నాడు. ఇద్దరూ వికలాంగుౖలైతే కష్టమని బంధువులు వారించినా అతను రేష్మాను ఇష్టపడి 2010లో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వారికొక కొడుకు ఉన్నాడు. ఒకటో తరగతి చదువుతున్నాడు. స్వశక్తిపైన జీవించాలనే తపన అతన్ని సొంతంగా వెల్డింగ్ షాపు పెట్టుకునేలా చేసింది. కలెక్టర్ ప్రోత్సాహంతో.. అప్పటి కలెక్టర్ వీరపాండియన్ ప్రోత్సాహంతో కలెక్టరేట్ ఎదురుగా చెరువుకట్టపై (ఇస్కాన్ గోశాల ఎదురుగా) సొంతంగా వెల్డింగ్ షాపును షాషావలి పెట్టాడు. గ్రిల్స్, షెడ్సు, సేఫ్టీ డోర్స్, స్టేర్ కేసులు తదితర బరువైన పనులను అవలీలగా చేస్తున్నాడు. దాదాపు 500 కిలోల బరువైన గృహోపకరణాలను ఒంటరిగా చేస్తూ అందరిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. తన షాప్‌లో మరో రెండు కుటుంబాలకు ఉపాధి కల్పించాడు. వీలైతే సాయం చేయండి ఎన్నో ప్రతికూల పరిస్థితులను నెగ్గుకొని సొంతంగా జీవించేందుకు ప్రయత్ని స్తున్నా. నేను నా భార్య ఇద్దరమూ దివ్యాంగులమే. అయినా కరుణ లేకుండా కొందరు మా పొట్ట కొట్టాలని చూస్తున్నారు. నా పనితనం చూసి చాలాసార్లు అధికారులే ఆశ్చర్యపోయారు. కానీ ఏం లాభం? నేను డబ్బు కోసమో, నాకే పనులివ్వాలనో ఎవరినీ యాచించలేదు. నా కష్టంపై నేను జీవిస్తున్నా. నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. – షాషావలి, వెల్డర్, అనంతపురం -
దివ్యాంగులకు స్మార్ట్‌కార్డులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులకు (దివ్యాంగులు) యూనిక్ డిజబిలిటీ గుర్తింపు కార్డులను(యూడీఐడీ) జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగులు బస్సులు, రైళ్లలో ప్రయాణాలకు రాయితీ పొందడానికి ఈ స్మార్ట్ కార్డును చూపిస్తే సరిపోతుంది. అర్హుల వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సేకరించి, ఆన్లైన్ పోర్టల్‌లో అప్లోడ్ చేసేందుకు ప్రభుత్వం చర్యలను చేపడుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సాఫ్ట్వేర్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ డిజేబుల్డ్ ఫర్ యాక్సెస్ రిహాబిలిటేషన్, ఎంపవర్మెంట్(సదరమ్) సర్టిఫికెట్లు కలిగిన వారు మళ్లీ ఇందుకోసం వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా ‘సెర్ప్’ వద్ద ఉన్న డేటాను వినియోగించుకోనున్నారు. దివ్యాంగులకు స్వావలంబన కార్డు పేరిట స్టాండర్డ్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు సైజులో జారీ చేయనున్న యూడీఐడీతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. దివ్యాంగులు తమ వైకల్యాన్ని రుజవు చేసేందుకు సర్టిఫికెట్లను వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు. అన్ని రాష్ట్రాల్లో వీటిని ఆమోదించేలా చర్యలు తీసుకుంటారు. అంగవైకల్యం వివరాలను కార్డు రీడర్ డివైస్ ద్వారా తెలుసుకోవచ్చు. -
‘శిఖర’ సమానం
రాంగోపాల్‌పేట్: కొండ అద్దమందు కొంచమై ఉండదా.. అన్నాడు వేమన. కానీ, వీరి ఆత్మబలమందు శిఖరమే కొంచమైంది! మంచు కొండలు కరిగిపోతున్నా.. ఇంచు కూడా వెనుకడుగు వేయలేదు. ఎత్తువెళ్లే కొద్దీ ఆక్సిజన్ దొరక్క ఊపిరి ఎక్కడ ఆగిపోతుందోనని టెన్షన్ ఉన్నా ఆత్మవిశ్వాసమే శ్వాసగా.. హిమశిఖరం అధిరోహించారు. భాగీరథ–2 పర్వతాన్ని 18,000 అడుగుల మేర ఎక్కి ‘దివ్య’ మైన చరిత్ర సృష్టించారు. దివ్యాంగులు ఎవరికీ తీసిపోరని నిరూ పించారు. సాహసంలోనూ వారిది సహవాసమే. పర్వతారోహణను పూర్తిచేసుకుని మంగళవారం తెల్లవారుజామున నగరానికి చేరుకు న్నారు. వారికి గోపాలపురం పోలీసులు ఘనస్వాగతం పలికారు. తెలుగువారి ఘనతను ప్రపంచానికి చాటిన తెలుగుతేజాలైన షేక్ అర్షద్(26), ఆర్యవర్ధన్(17)లపై ప్రత్యేక కథనం... కాలు లేదని కుంగి పోలేదు.. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఇస్మాయిల్, మోసిమ్ల కుమారుడు షేక్ అర్షద్(26). 2004 సంవ త్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎడమ కాలు మోకాలి పైవరకు పోయింది. అయినా కుంగిపోకుండా డిగ్రీ చేశాడు. ఇటీవల ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన అంతర్జాతీయ ప్యారా హ్యాండ్ సైక్లింగ్ పోటీల్లో 4వ స్థానంలో నిలిచాడు. సరూర్‌నగర్‌కు చెందిన 17ఏళ్ల ఆర్య వర్ధన్ డిగ్రీ చదువుకున్నాడు. నాలుగేళ్ల వయసులో ప్రమాదానికి గురయ్యాడు. ఆటోలో వస్తుండగా కింద పడ్డాడు. కుడికాలు నుజ్జు్జకావడంతో మోకాలి పైవరకు తీసేశారు. తండ్రి లేడు. తల్లి గొంతు క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఆ ఆరుగురిలో ఇద్దరు మనవాళ్లే.. ఆదిత్య మెహతా ఫౌండేషన్ సహకారంతో బీఎస్ఎఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వెంచర్స్ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లో అర్షద్, ఆర్యవర్ధన్ నాలుగేళ్లు కలిసే శిక్షణ తీసుకున్నారు. వీరి కోసం ఖరీదైన కృత్రిమ కాలును తయారు చేయించారు. బీఎస్ఎఫ్ శిక్షణ పొందారు. దేశవ్యాప్తంగా మొత్తం ఆరుగురు ప్యారాఅథ్లెట్స్ను పర్వతారోహణకు ఎంపిక చేయగా వారిలో వీరిద్దరు ఉన్నారు. ఈ ఆరుగురు ఆగస్టు 10న ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి నుంచి పర్వతారోహణ ప్రారంభించారు. వీరిలో నలుగురు అథ్లెట్స్ 21,365 అడుగుల ఎత్తుండే భాగీరథ శిఖరాన్ని అదిరోహించారు. కానీ ఆర్యన్, అర్షద్‌లకు తీవ్రమైన ప్రతికూల వాతారణ పరిస్థితులు ఎదురుకావడంతో ఆగస్టు 27వ తేదీనాటికి భాగీరథ పర్వతాన్ని 18,000 అడుగుల ఎత్తు మేర అధిరోహించారు. పర్వతాన్ని 18,000 అడుగుల ఎత్తు మేరకు ఎక్కిన తెలుగు దివ్యాంగులుగా చరిత్ర సృష్టించారు. 16కి.మీ. ఒకేరోజు నడిచాం: అర్షద్ గతంలో నేను ఎప్పుడూ 3 కి.మీ.ల కంటే ఎక్కు వగా నడవలేదు. పర్వతారోహణలో ఒకేరోజు 16 కి.మీ. ఏకధాటిగా నడిచా. ప్రొస్తటిక్ లింబ్‌తో దీన్ని పూర్తి చేయగలిగాను. ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురొచ్చాయి. ఒక మృతదేహం కనిపించినా భయపడలేదు. పైకి వెళ్తుంటే ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించేది. 13కేజీల బరువుతో: ఆర్యవర్ధన్ జీవితంలో ఇలాంటి ప్రదేశాలు చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. హిమపాతాలు, బండరాళ్లు, నదులు, మంచుపగుళ్లు, వడగళ్లు, భారీ వర్షాలు ఎన్నెన్నో అనుభవాలు ఎదుర య్యాయి. 12 నుంచి 13 కిలోల బరువున్న బ్యాగులు భుజానికి తగిలించుకుని ముందుకు సాగాం. ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరాన్ని అది రోహించడానికి మానసికంగా సిద్ధమయ్యాను. 2020లో ఎవరెస్ట్‌ను అధిరోహిస్తాం 2020 సంవత్సరంలో 12 మంది ప్యారా అథ్లెట్స్‌కు శిక్షణ ఇచ్చి వచ్చే ఏడాది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేదికు సిద్ధం చేస్తాం. దివ్యాంగులు దేనిలోనూ తీసిపోరని, వారికి తగిన ప్రోత్సాహం అందిస్తే ఏదైనా సాధిస్తారనేది నిరూపిస్తాం. – ఆదిత్య మెహతా, ఫౌండేషన్ వ్యవస్థాపకుడు -
దేవుడిలా దిగివచ్చారు..
సాక్షి, తూర్పుగోదావరి : కనరాని దేవుడే కనిపించినాడె అన్నట్టుగా అయింది దివ్యాంగుడు దుర్గారావుకు. జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ దేవుడిలా దిగివచ్చి అతని కోర్కె తీర్చారు. వివరాల్లోకి వెళితే.. కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురానికి చెందిన దుర్గారావుకు చిన్నతనంలోనే పోలియో సోకింది. దాంతో అంVýæ వైకల్యానికి గురయ్యాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు దూరంగా కాగా భిక్షమెత్తుకొని జీవిస్తున్నాడు. గత ప్రభుత్వ హయాంలో పింఛన్‌కోసం కార్యాలయాల చుట్టూ, సదరన్ సర్టిఫికెట్ కోసం కొత్తపేట, కాకినాడ, రాజమహేంద్రవరం ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. అందరి ఆశా జ్యోతిగా నిలుస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన ‘స్పందన’లోనైనా తనకు పింఛన్ లభిస్తుందేమో అనే ఆశతో శుక్రవారం కలెక్టరేట్‌కు వచ్చాడు. కలెక్టర్ సమీక్షా సమావేశాల్లో ఉండడంతో ఆయనకోసం నిరీక్షిస్తున్న దుర్గారావు వద్దకు జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ వచ్చి వివరాలు తెలుసుకున్నారు. ‘మీరైనా పింఛన్ ఇప్పించి ఆదుకోండి’ అని జేసీ లక్ష్మీశను దుర్గారావు వేడుకున్నాడు. దుర్గారావు ఫోన్ నెంబర్‌ను జేసీ తీసుకున్నారు. ‘నీవు మళ్లీ కలెక్టరేట్‌కు వచ్చే పనిలేకుండా ఆస్పత్రికి తెలియజేసి సదరన్‌సర్టిఫికెట్ ఇప్పించి పింఛన్ వచ్చేలా చూస్తా’నని హామీ ఇచ్చారు. అంతేకాదు.. ఆయన సిబ్బందిని పిలిచి ఆటోలో బస్టాండ్‌కు తీసుకువెళ్లి అక్కడ నుంచి బస్సు ఎక్కించి అతనిని స్వగ్రామం పంపించాలని సూచించారు. -
మంగళగిరిలో వికలాంగుడి వినూత్న ప్రచారం
-
దివ్యాంగుడిగా నారా రోహిత్
కెరీర్ స్టార్టింగ్ నుంచి వరుసగా ప్రయోగాత్మక పాత్రలు చేస్తూ వస్తున్న యంగ్ హీరో నారా రోహిత్. డిఫరెంట్ జానర్ లో తెరకెక్కే సినిమాలతో పాటు మల్టీ స్టారర్ సినిమాలతోనూ అలరించిన ఈ యంగ్ హీరో తాజాగా మరో సాహసానికి రెడీ అవుతున్నాడు. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న రోహిత్ తన నెక్ట్స్ సినిమాలో దివ్యాంగుడిగా కనిపించనున్నాడట. నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్ బాబు, శ్రియ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ‘వీర భోగ వసంత రాయలు’. ఇంద్రసేన.ఆర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నారా రోహిత్ ఓ చాలెంజింగ్ రోల్ లో కనిపించనున్నాడట. ఇప్పటికే రిలీజ్ అయిన శ్రియ లుక్కు మంచి రెస్సాన్స్రాగా త్వరలో నారా రోహిత్ లుక్‌ను రివీల్ చేయనున్నారట. ఈ సినిమాలో రోహిత్ పాత్రకు కుడిచేయి ఉండదని తెలుస్తోంది. అయితే ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే లుక్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. -
సమాధానం వెనుక విషాదం
లండన్ : నష్టపోయిన చోటే అదృష్టాన్ని వెతుక్కోమన్నారు పెద్దలు. అలాంటిది నష్టపోయిన చోటు వల్ల కోట్లు కలిసొస్తే.. ఇక ఆనందానికి అవధులుండవు. అలాంటి సంఘటనే లండన్‌లో చోటు చేసుకుంది. తన కాలును పోగొట్టుకున్న ప్రదేశాన్ని జవాబుగా చెప్పి అక్షరాలా 7,500,000 లక్షల రూపాయలు గెలుచుకున్నాడో వ్యక్తి. వివరాల్లోకి వెళితే.. కెనడాలోని హలీఫాక్స్ కు చెందిన గారెత్ కెండాల్ హు వాంట్స్ టు బీ ఏ మిలయనీర్?(మీలో ఎవరు కోటీశ్వరుడు?కు మాతృక) అనే టి.వి షోలో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా.. ఉర్క్హార్ట్ కోట ఎక్కడ ఉందన్న ప్రశ్నకు గారెత్ చెప్పిన సమాధానం షో హోస్ట్‌ను నివ్వరపోయేలా చేసింది. ఉర్క్హార్ట్ కోట తనకు బాగా తెలుసునని, అక్కడే తన కాలును పోగొట్టుకున్నానని చెప్పడంతో కొద్ది సేపు హాలు మొత్తం నిశ్శబ్ధం అలుముకుంది. హోస్ట్ జెర్మీ క్లార్క్ సన్‌కు జరిగిన విషాదం గురించి వివరించాడు గారెత్. కోట దగ్గరి ప్రాంతంలో జరిగిన కారు ప్రమాదంలో తన ఎడమ కాలును పోగొట్టు కున్నానని, ఆ ప్రమాదం తర్వాత బతికుండటం మరో జన్మని అన్నాడు. హాస్పిటల్ ఐసీయూలో ఉన్న తాను బతకటం చాలా కష్టమని వైద్యులు చెప్పారని తెలిపాడు. చాలా రోజులు ఆస్పత్రి బెడ్ మీదే గడిచి పోయాయని వివరించాడు. కోట ఉన్న ప్రాంతాన్ని చెప్పడంతో లక్షల రూపాయలు గారెత్ సొంతమయ్యాయి. తర్వాత రౌండ్‌కు వెళ్లే అవకాశం ఉన్నా అంతటితో ఆటకు ముగింపు పలికి షోలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు గెల్చుకున్న వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. -
సతీ మమత
హుస్నాబాద్‌రూరల్ : కుటుంబాన్ని పోషించే భర్త ప్రమాదానికి గురై మంచాన పడ్డ భర్తకు తన నగలు చివరకు తాళి బొట్టుకూడా అమ్మి వైద్యం చేయిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది ఈ సతీ మమత. కలకాలం ఏ కష్టం వచ్చిన తోడుగా ఉంటానని బాస చేసి తాళి కట్టిన భర్తకు అనుక్షణం అండగా ఉంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. భర్త ఆస్పత్రి ఖర్చులకు, కుటుంబ పోషణకు ఆమె ఒంటి మీద ఉన్న బంగా రం, ఉన్న ఆస్తి అయిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక మమత సతమతమవుతోంది. కులి పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నా, భర్తకు ఎలా వైద్యం చేయించాలో తెలియక సాయం కోసం ఎదురు చూస్తోంది. ప్రభుత్వం సీఎం సహాయ నిధి కింద సాయం మంజూరు చేయాలని వేడుకుంటోంది. కుటుంబాన్ని కల్లోలం చేసిన ప్రమాదం.. హుస్నాబాద్ మండలంలోని మీర్జాపూర్‌కు చెందిన కుంటమల్ల రమణచారి మమత దంపతులు వివాహాం తర్వాత ఫోటో స్టూడియో నిర్వహిస్తూ జీవనం సాగించారు. వీరికి ఒక కూతురు ఉంది. రమణా చారి గత సంవత్సరం మార్చిలో ఓ పెళ్లికి ఫొటోలు తీయడానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రంగా గాయమైంది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. రమాణా చారి ప్రాణాలతో బయటపడ్డా ఎడమ చేయి, కాలు మాత్రం పనిచేయడం లేదు. నాటి నుంచి నేటి వరకు అతని వైద్యం కోసం రూ. 8 లక్షల వరకు ఖర్చైంది. అతని భార్య మమత తాన తాళితో సహా, నగలను సైతం అమ్మేసి వైద్యం చేయించింది. బంధువుల వద్ద రూ. 2 లక్షల అప్పు చేసి భర్త వైద్యం కోసం ఖర్చు పెట్టింది. కుటుంబ పోషనకు కూలి పనికి సైతం వెళ్తోంది. మరో నాలుగేళ్లు వైద్యం మరో నాలుగు సంవత్సరాలు వైద్యం అందిస్తే రమణాచారి ఎప్పటిలాగే నడుస్తాడని వైద్యులు మమతకు సూచించారు. భర్తను ఎలాగైనా నడిచేలా చేయాలన్న సంకల్పంతో మమత ప్రతీ నెల హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్లో భర్తకు వైద్యం చేయిస్తోంది. ప్రతీ నెల వైద్య ఖర్చులకు రూ. 10 వేలు, ప్రయాణానికి మరో రూ. 2 వేలు ఖర్చు అవుతోంది. ప్రతీ నెల ఆ డబ్బులు సమకూర్చలేక మమత అవస్థలు పడుతోంది. అచేతన స్థితిలో ఉన్న తన భర్తకు ప్రభుత్వం స్పందించి చిన్న పని చూపించాలని వేడుకుంటోంది. తద్వారా మందుల ఖర్చులు అయినా తీరుతాయ ని ప్రాధేయపడుతోంది. సాయం చేయని సదరం క్యాంపు అధికారులు.. ఏడాది నుంచి రమణచారి సదరం క్యాంపు చుట్టూ తిరుగుతున్నా అధికారులు కనికరించడం లేదు. 2017 సెప్టెంబర్‌లో సిద్దిపేట సదరం క్యాంపుకు పోయిన రమణచారికిని వైద్యులు పరీక్షించి ఎలాంటి ధ్రువీకరణ పత్రం ఇవ్వకుండా ఇంటికి పంపించారు. ంతో అధికారులు పింఛన్ ఇవ్వడం లేదు. అందని సీఎం సహాయ నిధి... భర్త ఆరోగ్యం కోసం మరో మూడేళ్లు వైద్యం అందించడానికి వైద్యం కోసం చేతిలో పైసలు లేక అవస్థలు పడుతోంది. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తన భర్తకు వైద్యం చేయించడానికి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తోంది. స్థానిక ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు స్పందించి సీఎం సహాయ నిధి నుంచి సహాయం అందేలా చూడాలని కోరుతోంది. జిల్లా కలెక్టర్ స్పందించి కంప్యూటర్ పరిజ్ఞనం ఉన్న రమణాచారికి ఏదైన ఉపాధి చూపించి వీధిన పడ్డ తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మమత వేడుకుంటోంది. -
ఆర్ట్ ఫెస్టివల్ అదుర్స్
కణేకల్లు: వారంతా దివ్యాంగులు...కానీ తమ అద్భుత కళా నైపుణ్యంతో అందరి చేత ఔరా అనిపించారు. కణేకల్లు క్రాస్‌లోని ఆర్డీటీ ఫీల్డ్ కార్యాలయంలో మంగళవారం సెంటర్‌స్థాయి దివ్యాంగుల ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహించారు. కణేకల్లు, కదిరి, బత్తలపల్లి, బుక్కరాయసముద్రం, ఉరవకొండ, రాప్తాడు ప్రాంతాల దివ్యాంగులు రంగోళి, పిక్చర్ పెయింటింగ్, పేపర్ కటింగ్, మట్టిబొమ్మల తయారీ, న్యాచురల్ కొల్లేజ్ (ప్రకృతిలో దొరికే వస్తువులతో బొమ్మల తయారీ) పోటీల్లో పాల్గొని తమ కళానైపుణ్యం ప్రదర్శించారు. ఆర్డీటీ సీబీఆర్ డైరెక్టర్ దశరథరాముడు మాట్లాడుతూ, దివ్యాంగుల కళానైపుణ్యం అమోఘమని ప్రశంసించారు. సెంటర్‌స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన 18 మంది జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో ఆర్ట్‌ఫెస్టివల్ ప్రోగ్రామ్ మేనేజర్ నవ్య, ఎస్టీఎల్ నారాయణ, పద్మావతి ఉరవకొండ రీజనల్ డైరెక్టర్ మహబూబ్‌బీ, ఆర్డీటీ సిబ్బంది పాల్గొన్నారు. -
సీఎం నివాసం వద్ద ఆత్మహత్యాయత్నం
చంద్రబాబును కలిసేందుకు సిబ్బంది నిరాకరించడంతో మనస్తాపం తాడేపల్లి రూరల్ (గుంటూరు) : ఇచ్చిన హామీ అమలుకాలేదనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చెప్పాలని వచ్చిన ఓ దివ్యాంగుడిని శుక్రవారం సెక్యూరిటీ సిబ్బంది అనుమతించకపోవడంతో ఆయన ఇంటి ముందే ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంగోలుకు చెందిన నారాయణ తనకు జీవనోపాధికి రుణం ఇప్పించాలంటూ ఇటీవల వెలగపూడి సచివాలయంలో సీఎంను కలసి తన బాధను వివరించాడు. రెండ్రోజుల్లో అధికారులు మీ ఇంటికి వచ్చి న్యాయం చేస్తారని సీఎం హామీ ఇచ్చారు. ఇది జరిగి పది రోజులు గడుస్తున్నా ఎవరూ రాకపోవడంతో సీఎంను కలిసేందుకు నారాయణ మళ్లీ ఉండవల్లి వచ్చాడు. సెక్యూరిటీ సిబ్బంది సీఎం నిద్ర లేవలేదు, తర్వాత పంపిస్తామని చెప్పినట్లు సమాచారం. మరో రెండు గంటల తర్వాత కూడా సిబ్బంది అదే సమాధానం చెప్పడంతో మనస్తాపం చెందిన దివ్యాంగుడు దగ్గర్లో ఉన్న ఖాళీ మద్యం బాటిల్‌తో తలపై బాదుకున్నాడు. గమనించిన సిబ్బంది నారాయణను హడావుడిగా మంగళగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం ‘ఒంగోలు జిల్లా అధికారులతో సీఎం పేషీ నుంచి మాట్లాడాం. నీకు న్యాయం చేస్తారు. ఇక వెళ్లు’ అంటూ అధికారులు బాధితుడిని ఒంగోలు పంపించివేశారు. -
ఆత్మ విశ్వాసంతో అడుగు ముందుకు..
* అతని మనోధైర్యం ముందు అంగవైకల్యం దిగదిడుపు * ప్రదర్శనలతో రాణిస్తూ జీవనం సాగిస్తున్న నూర్ గుంటూరు (ఆనందపేట): ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం తలవంచింది. నమ్ముకున్న కళలో రాణిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు నూర్ అలీఖాన్. ఆనందపేట, ఐదవ లైనుకు చెందిన మహమ్మద్ నూర్ అలీఖాన్ ఐదు నెలల వయసులో ఉండగా పోలియో సోకి అంగవైకల్యం బారిన పడ్డాడు. కాళ్లు రెండూ చచ్చుబడ్డాయి. అయినా నూర్ ఆలీఖాన్ కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేశాడు. నూర్‌కు చిన్నప్పటి నుంచి సినిమాలు, నటన, డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం. అందుకే వాటిలో రాణించేదుకు కృషి చేశాడు. టీవీల ముందు కూర్చుని తనకు ఇష్టమైన పాటలను చూస్తూ సాధన చేశాడు. ఆరేళ్లుగా వందల సంఖ్యలో స్టేజీలపై ప్రదర్శనలు ఇస్తూ ప్రతిభ కనబరుస్తున్నాడు. అత్యుత్తమ ప్రదర్శనలతో పలువురి ప్రశంసలు, సన్మానాలు పొందుతూ ముందుకు సాగుతున్నాడు. రెండేళ్ల క్రితం మదర్ ధెరిస్సా వికలాంగుల ఆర్కెస్ట్రా పేరుతో సొంత ఆర్కెస్ట్రా ప్రారంభించి ప్రదర్శనలు ఇస్తున్నాడు. డ్యాన్స్‌లతో పాటు పాటలు పాడడం, మిమిక్రీ కళతో అలరిస్తున్నాడు. ఇప్పటివరకు గుంటూరు, విశాఖపట్నం, ఒంగోలు, నరసరావుపేట, చిలకలూరిపేటలలో ప్రదర్శనలు ఇచ్చి పలువురి మన్ననలు పొందాడు. కుటుంబ నేపథ్యం.... ఆర్ఎంపీ వైద్యుడైన ఇనాయత్, నిలోఫర్ దంపతులకు ముగ్గురు మగ సంతానం. వారిలో నూర్ అలీఖాన్ పెద్దవాడు. పదేళ్లక్రితం షహిన్తో వివాహం జరిగింది. ఇటీవలే వారికి బాబు జన్మించాడు. ప్రదర్శన ద్వారా వచ్చే ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంచి పేరు తెచ్చుకోవాలి... – మహమ్మద్ నూర్ అలీఖాన్ మంచి పేరు తెచ్చుకోవాలి...నలుగురికీ సహయ పడాలి. ఆదాయం కొంత ఎక్కువగా వచ్చినపుడు రోడ్లపై పడుకునే అనాథలకు ఆహారం పొట్లాలు అందిస్తాను. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టడమే నా లక్ష్యం. -
ఎవరి ఉద్యోగాలు వారే చేయాలి
ఏలూరు (మెట్రో) : జిల్లాలో వివిధ శాఖల్లో వికలాంగుల కోటాలో ఉద్యోగాలు పొందిన వికలాంగులు వారి విధుల్లో వారు మాత్రమే పనిచేయాలని, వేరే వ్యక్తులు పనిచేయడానికి వీలులేదని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్లో సోమవారం ‘మీ కోసం’ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వికలాంగుల కోటాలో ఉద్యోగాలు పొందిన కొంతమంది వారు పనిచేయకుండా వారి తరఫున వేరే వారితో పనిచేయిస్తున్నారని, ఎవరు ఉద్యోగం పొందారో వారే పనిచేయాలన్నారు. వేరే వారు పనిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు తమ సమస్యలను కలెక్టర్ భాస్కర్‌కు చెప్పుకున్నారు. వాటిని పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెరుగుతోంది కొన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతికి పాల్పడుతున్న వ్యక్తులు రాజ్యమేలుతున్నారని అటువంటి వారిని గుర్తించి ఆయా శాఖాధికారులు వారిని పక్కనపెట్టాలని లేకపోతే భారీ కుంభకోణాల్లో అధికారులు ఇరుక్కుపోయే ప్రమాదమున్నదని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లా అధికారుల కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ డీపీవో, పశుసంవర్థక శాఖ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడుతున్న ఇద్దరు గుమాస్తాలను బయటకు పంపిస్తే మళ్లీ అవే కార్యాలయాల్లో తిష్టవేశారన్నారు. అటువంటి వారిపై ఉపేక్షించేది లేదని చెప్పారు. జిల్లాలో ఏలూరు కార్పొరేషన్‌తో సహా 8 పురపాలక సంఘాల్లో పారిశుధ్య పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయన్నారు. పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులను ఆదేశించారు. నా ఫైల్స్ నేనే మోస్తున్నా కలెక్టర్‌గా నాకు కనీసం అటెండర్ కూడా లేడని, నా ఫైల్స్ నేనే మోసుకుంటున్నానని.. ఇలా చేయడంలో తప్పేమీ లేదని కలెక్టర్ భాస్కర్ వ్యాఖ్యానించారు. తన కంప్యూటర్ ఆపరేటర్ కూడా లేడని అయినా రోజుకు 450 ఫైల్స్ పరిష్కరిస్తున్నానని, 67 శాఖల అధికారులతో చర్చిస్తున్నానని చెప్పారు. ప్రతి అధికారి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో సమస్యలు పరిష్కరించవచ్చని, ఐదు వారాలుగా అధికారులు మీకోసం, ఈ–ఫైలింగ్‌లో అనేక శాఖలు సమస్యలను పరిష్కరించడం లేదని, ప్రజలకు సేవలు అందడం లేదన్నారు. సమావేశంలో జేసీ పి.కోటేశ్వరరావు, ఏజేసీ ఎంహెచ్ షరీఫ్, జెడ్పీ సీఈవో డి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు -
పుణ్యం కోసం.. ఒంటికాలితో...
నాగాయలంక: నాగాయలంక శ్రీరామపాదక్షేత్రం పుష్కరఘాట్‌లో ఉవరి సహాయం లేకుండానే ఒంటికాలితో వికలాంగుడు కృష్ణానదిలో మంగళవారం పుణ్యస్నానం చేసి వెళ్లడం ఇలా కనిపించింది, సమీపంలోని మర్రిపాలెం గ్రామానికి చెందిన తాపీమేస్త్రి వెంకటేశ్వర్రావు నిత్యం ఇలాగే స్నానమాచరించి కృష్ణవేణీమాతను ప్రసన్నం చేసుకుంటున్నట్లు చుప్పాడు.