
సాక్షి, హైదరాబాద్: అనారోగ్య, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ఓ దివ్యాంగుడిని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదుకున్నారు. నాగర్‌కర్నూలు జిల్లా కు చెందిన నరేశ్ 90 శాతం వికలాంగత్వంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తండ్రి చనిపోవడంతో హైదరాబాద్ పాతబస్తీలోని కుమ్మరిగూడలో తల్లితో పాటు అద్దెకుంటున్నారు. తల్లి రోజువారీ కూలి. నరేశ్ తన గోడును పోచారం శ్రీని వాసరెడ్డికి ఫోన్‌చేసి వెళ్లబోసుకున్నాడు.
దీంతో ఆయన హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతితో మాట్లాడి ప్రభుత్వం నిర్మిస్తోన్న డబుల్ బెడ్రూం ఇళ్లలో ఒక ఇంటిని కేటాయించాలని సూచించారు. వికలాంగుల హక్కుల వేదిక జాతీయ నాయకులు కొల్లి నాగేశ్వరరావుతో మాట్లాడి బ్యాటరీ ట్రై సైకిల్ ను అందించాలని కోరారు. స్పీకర్ సూచనతో మం గళవారం హైదరాబాద్ జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 100 శాతం సబ్సిడీపై సమకూర్చిన బ్యాటరీ ట్రై సైకిల్‌ను నరేశ్‌కు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment