చాలామంది చిన్నచిన్న కష్టాలకి కుంగిపోతారు! మరికొందరూ..ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వగానే నిరాశ నిస్ప్రుహలకి లోనై అక్కడితో ఆగిపోతారు. కొద్దిమంది మాత్రమే విధి విసిరిన సవాలును ఎదిరించి నిలబడి తనని తాను నిరూపించుకోవటానికి శతవిధాల ప్రయత్నిస్తూ ఆదర్శంగా నిలుస్తారు. ఈ కోవకు చెందిన బాలిక బిహార్‌కు చెందిన తనూ కుమారి. ఓ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన తనూ కుమారి.. కాళ్లనే చేతులుగా మార్చుకుని తన భవిష్యత్తును చెక్కుకుంటుంది. ఆ వివరాలు..
బిహార్ పట్నాకు చెందిన తనూ కుమారి ప్రస్తుతం పదో తరగతి చదువుతుంది. ఆమెకు రెండు చేతులు లేవు. 2014లో తనూ టెర్రస్ పై ఆడుకుంటూ అనుకోకుండా ఎలక్ట్రిక్ వైరులను పట్టుకోవడంతో తన రెండూ చేతులను కోల్పోయింది. అయినా కూడా తనూ వెనకడుగు వేయలేదు. కాళ్లనే చేతులుగా మార్చుకుంది. పట్టుదలో శ్రమించి కాలి వేళ్లతో రాయడం నేర్చుకుంది. అది మాత్రమే కాక పేయింటింగ్ కూడా ప్రాక్టీస్ చేసింది తనూ. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న తనూ కుమారి.. బాగా చదువుకుని భవిష్యత్తులో టీచర్‌ని అవుతానని ధీమా వ్యక్తం చేస్తోంది. (చదవండి: మహిళ చేతిలో కేంద్ర మంత్రికి ఘోర అవమానం)
ఆటలు ఆడటం, పేయింటింగ్ వేయడం తనకు ఎంతో ఇష్టమంటుంది తనూ కుమారి. ఇప్పటికే పలు పేయింటింగ్ కాంపిటీషన్స్‌లో పాల్గొని.. ఎన్నో అవార్డులు గెలుచుకుంది. కూతురు ఆత్మస్థైర్యం చూస్తే తనకెంతో గర్వంగా ఉంటుందంటున్నారు ఆమె తల్లి సుహా దేవి. తన కూతురు ఆత్మస్థైర్యంతో వైకల్యాన్ని అధిగమించి దూసుకుపోతున్నందుకు తనకెంతో ఆనందంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆమె తండ్రి అనిల కుమార్ గ్యాస్ డెలివరి మెన్‌గా పనిచేస్తున్నాడు. తాను పేదవాడినని తమను ప్రభుత్వం ఆదుకుంటే బాగుండనని ఆమె తండ్రి అనిల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. (చదవండి: చెల్లితో పాములకు రాఖీ కట్టించబోయాడు.. ప్రాణాలు కోల్పోయాడు)
ప్రభుత్వ సాయం చేయాలి....
ఆమెను మొదటిసారి చూసినప్పుడే ఆశ్చర్యపోయానని, ఇలాంటి ధైర్యవంతురాలికి ప్రభుత్వ అండగా నిలిస్తే ఆమె మరిన్ని విజయాలు సాధిస్తోందని తనూ సైన్య్ టీచర్ దివ్య కుమారి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమెకు మేము ఎల్లప్పుడు తోడుగా ఉంటాం, తనూ ఓడిపోదూ... ఆత్మస్థైర్యంతో దూసుకుపోతుందంటూ తనూ కుమారి స్నేహితులు కొనియాడారు.
Bihar | Tanu Kumari, a Patna-based girl, who lost both her hands in an accident in 2014, gets promoted to class 10
— ANI (@ANI) September 6, 2021
"After the accident, I slowly learned how to write with my feet. I also like to participate in sports and painting activities. I want to become a teacher," she says pic.twitter.com/UcGYyqTlAm
Comments
Please login to add a commentAdd a comment