specially abled girl
-
పేదరికంతో పోరాడి.. వైకల్యంతో ఎదురీది.. విజేతగా నిలిచిన భాగ్య
ఆమె పేరులో భాగ్యం ఉంది. ఆ భాగ్యం జీవితంలో కొరవడింది. ఆమె పేదరికంతో పోరాడింది. శారీరక వైకల్యంతో ఎదురీదింది. సమాజంలో విజేతగా నిలిచింది. అభినందనలు అందుకుంటోంది. తమిళనటి, నర్తకి సుధాచంద్రన్ ఒక అద్భుతం. నాట్య మయూరిగా పేరు తెచ్చుకుంది. నెమలిలా నాట్యం చేసే ఆమెతో విధి వింత నాటకం ఆడింది. ఒక కాలిని తీసుకెళ్లింది. ఆమె నిర్ఘాంతపోయింది. నడవడమే కష్టం అనుకున్న స్థితి నుంచి కోలుకుని కృత్రిమ కాలితో నాట్యం చేసింది. మన తెలుగు నాట్య మయూరితో విధి మరింత ఘోరంగా ఆటలాడుకుంది. ఆమెను ఒక్క కాలితోనే భూమ్మీదకు పంపించింది. డాన్స్ చేయాలంటే రెండు కాళ్లు ఉంటే మంచిదే... కానీ లేదని ఊరుకోవడమెందుకు? ఒక కాలు లేకపోతేనేం... మరో కాలుందిగా... అంటూ డాన్స్ చేస్తోంది. ఆమె పట్టుదల, ఆత్మవిశ్వాసం గెలిచాయి. తెలంగాణ జానపద కళలంటే ప్రాణం పెట్టే భాగ్య అందులోనే ఎం.ఏ చేస్తోంది. తన విజయగాధను సాక్షితో పంచుకుంది. బస్సులు మారలేక... ‘‘మాది మహబూబాబాద్ జిల్లా, గూడూరు గ్రామం. అమ్మ కూలిపనులకు వెళ్తుంది. నాన్న మేకలు కాస్తాడు. అన్న, నేను ఇద్దరం పిల్లలం. నేను పుట్టడమే ఒక విచిత్రం. బిడ్డ ఒక కాలు లేకుండా పుట్టిందని ఊరంతా వచ్చి చూశారట. ఆ తర్వాత నేను పెరగడం, చదువు, డాన్స్ నేర్చుకోవడం... అన్నీ విచిత్రంగానే గడిచాయి. సెవెన్త్ క్లాస్ వరకు వరంగల్ జిల్లా, నెక్కొండ మండలం, పెద్ద కొర్పోల్‌లో చదువుకున్నాను. ఆ తర్వాత హన్మకొండలో సాగింది. ఇంటర్ ప్రైవేట్ కాలేజ్‌లో చదివించడం డబ్బుండి కాదు. ప్రభుత్వ కాలేజ్‌కి రెండు బస్సులు మారి వెళ్లాల్సి ఉండింది. నేనలా వెళ్లలేనని ప్రైవేట్ కాలేజ్‌లో చేర్చారు. వరంగల్ ఆర్ట్స్ కాలేజ్‌లో డిగ్రీ చేసి, ఇప్పుడు హైదరాబాద్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జానపద కళల్లో ఎం.ఏ. చేస్తున్నాను. ఇంతకీ నేను డాన్సర్‌గా మారిన వైనం మరీ విచిత్రం. బాలెన్స్కి నెల పట్టింది నేను నైన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు జరిగిందా విచిత్రం. ప్రముఖ డాన్సర్ లారెన్స్ మాస్టారి ఆలోచన నన్ను డాన్సర్‌ని చేసింది. ఆయన దగ్గర పని చేసిన ప్రశాంత్ మాస్టారు స్పెషల్లీ ఏబుల్డ్ పిల్లలకు డాన్స్ నేర్పించడానికి మేమున్న హాస్టల్‌కి కూడా వచ్చారు. అలా అప్పుడు వాళ్లు పదిమందికి పైగా స్టూడెంట్స్‌ని సేకరించి డాన్స్ క్లాసులు మొదలు పెట్టారు. వారిలో స్టేజ్ మీద ప్రదర్శనలిచ్చే స్థాయికి చేరింది ముగ్గురమే. అప్పటివరకు కర్ర లేకుండా నిలబడగలమనే ఊహ కూడా లేని వాళ్లమే అందరం. మొదట ఒక కాలి మీద దేహాన్ని బాలెన్స్ చేయడం సాధన చేశాం. బాలెన్స్ సాధించడానికి నెల పట్టింది. సినిమా పాటలు, జానపద నృత్యం, బతుకమ్మ పాటలు ప్రాక్టీస్ చేశాను. ఆ కోర్సు తర్వాత కూడా సొంతంగా కొన్ని పాటలకు సాధన చేశాను. టీవీ ప్రోగ్రామ్‌లలో కూడా డాన్స్ చేశాను. దసరా ఉత్సవాలు, వినాయక చవితి, ఇతర సమావేశాల్లో అవకాశాలను వెతుక్కుంటూ నాట్యం చేస్తున్నాను. శివరాత్రికి వేములవాడ రాజరాజేశ్వరస్వామి గుడిలో కూడా నాట్యం చేశాను. ఇక్కడ మరో విచిత్రం... ఏమిటంటే, సిట్టింగ్ వాలీబాల్ ఆడే అవకాశం వచ్చింది. ఈ ఆటకు మన దగ్గర పెద్దగా ఆదరణ లేదు. రాజస్థాన్, హర్యానా, తమిళనాడు, కర్నాటకల్లో జరిగిన పోటీలకు హాజరయ్యాను. థాయ్‌లాండ్‌లో జరిగే పోటీలకు ఎంపిక ప్రక్రియలో నెగ్గాను. మనదేశం తరఫున ఆడే అవకాశం వచ్చింది. కానీ కరోనా కారణంగా వెళ్లలేకపోయాను. తెలంగాణ ఆట పాట ఫోక్ ఆర్ట్స్ కోర్సులో భాగంగా డప్పు, జానపదగేయాలు, కర్రసాము, చెక్క భజన వంటి తెలంగాణ సంప్రదాయ కళలను నేర్చుకున్నాను. బతుకమ్మ పాటలను సేకరించి పాడాను. ఇతర పాటలు పాడే అవకాశాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. డాన్స్‌లో కూడా నిరూపించుకుంటాను. నాకు సీటు ఇచ్చేటప్పుడు సీటు వృథా అవుతుందేమోనని సందేహించిన యూనివర్సిటీనే ఇప్పుడు నాకు అండగా నిలిచింది. నేను ఎవరికీ భారం కాకూడదు, నా కాళ్ల మీద నేను నిలబడాలనే పట్టుదలే నన్ను ఇంతవరకు నడిపించింది’’ అని చెప్పింది భాగ్య. సవాళ్లను ఎదుర్కొనే మనోధైర్యం ఆమె సొంతం. ఆడపిల్లలకు ధైర్యం ఒకింత ఎక్కువగా ఉండాలని చెప్తోంది. బాలికలకు కర్రసాము నేర్పించి ధీరలుగా మలవాలనే ఆమె ఆశయం, జానపదానికి సేవ చేయాలనే ఆమె ఆకాంక్ష నెరవేరాలి. కొత్త అడుగులు ఎల్బీ స్టేడియంలో ఇచ్చిన ప్రదర్శన నా జీవితాన్ని కొత్తగా రాసింది. డిసెంబర్ మూడవ తేదీ ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్’. ఆ సందర్భంగా లాల్ బహదూర్ స్టేడియంలో నాలుగు రోజుల ముందు నుంచి ఆటలు, డాన్స్ ప్రోగ్రామ్‌లు జరిగాయి. నా డాన్స్ ఫొటోలు పేపర్లో వచ్చాయి. ఆ పేపర్ చూసి మా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ కిషన్‌రావు సర్ నన్ను పిలిచి మాట్లాడారు. మా ఆర్థిక పరిస్థితి, గవర్నమెంట్ పెన్షన్‌తో హాస్టల్ ఫీజు కట్టుకుంటూ చదువుకుంటున్నానని తెలుసుకుని ఆయన చలించిపోయారు. ఆయన ఎవరెవరితో మాట్లాడారో తెలియదు, వీసీ సర్, రిజిస్ట్రార్ సర్ కలిసి మూడు లక్షల నిధులు సేకరించి, జర్మనీ నుంచి డాన్స్ చేయడానికి వీలుగా ఉండే ప్రోస్థటిక్ లెగ్‌ను తెప్పించి పెట్టించారు. ఇప్పుడు ఆ కాలితో నడక ప్రాక్టీస్ చేస్తున్నాను. నడక మీద పట్టు వచ్చిన తర్వాత డాన్స్ చేస్తాను. – వాకా మంజులారెడ్డి -
జిమ్నాస్టిక్ చేయాలంటే కాళ్లు అవసరం లేదు!
న్యూఢిల్లీ: అన్ని సక్రమంగా ఉన్న ఏదో ఒక కారణాలతో ఏమి చేయకుండా కూర్చొండిపోతారు. పైగా అన్ని అవయవాలు బాగా ఉన్నా ఏవో చిన్న చిన్న సాకులతో కష్టపడటానికి ఇష్టపడరు. కానీ ఇక్కడ ఒక పదేళ్ల బాలికకు కాళ్లు లేకపోయిన జిమ్నాస్టిక్ నైపుణ్యంతో అందరీ మనసులను గెలుచుకుంది. (చదవండి: అమ్మో ఈ చేప ఖరీదు రూ.36 లక్షల!) వివరాల్లోకెళ్లితే...ఒహియోకు చెందిన పైజ్ క్యాలెండైన్కు కాళ్లు లేవు. అయినా తన జిమ్నాస్టిక్ నైపుణ్యాలను అత్యంత అద్భుతంగా ప్రదర్శిసిస్తోంది. ఈ మేరకు ఆమె తన జిమ్నాస్టిక్ సాధనలో భాగంగా తాను చేసే రోజువారి ప్రాక్టీస్‌లకు సంబంధించిన వీడియోను ట్వీట్టర్లో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు నెటిజన్లు ఆమె నైపుణ్యాలను చూసి ఆశ్చర్యపోతూ ఆమె పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. (చదవండి: ఒక గంట వ్యవధిలో ఐదువేల కిలోగ్రాములు బరువుని ఎత్తి రికార్డు సృష్టించాడు) 10-year-old Paige Calendine of Ohio is a force!🌟🏅🏆. (🎥:heidi.calendine)💪😃💪 pic.twitter.com/DI23hHRO4r — GoodNewsCorrespondent (@GoodNewsCorres1) October 25, 2021 -
అతను కూడా నాలాగే ఆమెను ప్రేమిస్తున్నాడు
న్యూఢిల్లీ: కొంతమంది మంచి మనుషులను చేసే గొప్ప గొప్ప పనులను చూస్తే మనకి అభినందించడం, మెచ్చుకోవడం వంటి మాటలు సరిపోవేమో అనేలా ఉంటుంది వారి వ్యక్తిత్వం. అలాంటి మహోన్నత వ్యక్తులు చాలా అరుదు. ఒకవేళ తారస పడితే మన అదృష్టంగా భావిస్తాం. అలాంటి వ్యక్తి ఒక అమ్మాయికి భర్తగా వస్తే ఆ అమ్మాయి ఆనందం మాటల్లో చెప్పలేం కదా! (చదవండి: రాజీనామా ఉపసంహరణ చేసుకున్న సిద్ధూ) అసలు విషయం ఏమిటంటే ప్రతి వ్యక్తి జీవితంలో వివాహ వేడుక అత్యంత మధురమైన ఘట్టం. అలాంటి వివాహతంతులో ఒక పెళ్లికూతురు తన కవల సోదరి దివ్యాంగురాలు. ఆమె కూడా ఆ తంతులో పెళ్లికూతురులా ముస్తాబవుతోంది. ఆమెను తమ వివాహ వేడుకకు తన కాబోయే భర్తే స్వయంగా అతని చేతులతో ఆమెను ఎత్తుకుని తీసుకు వస్తాడు. ఇది ఆ వివాహ వేడుకు వచ్చిన బంధువులందర్నీ ఆశ్చర్యానికి గురి చేయడమే కాక అందరీ హృదయాలను గెలుచుకున్నాడు. ఈ సంఘటనను వధువు వీడియో తీసి "ఇప్పుడు నేను అతన్ని నా భర్త అని మనస్పూర్తిగా పిలుస్తాను, నేను అతన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. అంతేకాదు నేను నా చెల్లెల్ని నేను ఎంత అమితంగా ప్రేమిస్తున్నానో తను అంతే ప్రేమిస్తున్నాడంటూ ట్యాగ్ లైన్ జోడించి మరీ పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ మేరకు నెటిజన్లు దయకు అర్థం అతనే అంటూ ఆ పెళ్లికొడుకుపై ప్రశంసలజల్లు కురిపిస్తున్నారు. (చదవండి: అమేజింగ్.. ప్రపంచంలోనే అత్యంత పొడగరి!) -
ఆమె ధైర్యం ముందు విధి సైతం చిన్నబోయింది!
చాలామంది చిన్నచిన్న కష్టాలకి కుంగిపోతారు! మరికొందరూ..ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వగానే నిరాశ నిస్ప్రుహలకి లోనై అక్కడితో ఆగిపోతారు. కొద్దిమంది మాత్రమే విధి విసిరిన సవాలును ఎదిరించి నిలబడి తనని తాను నిరూపించుకోవటానికి శతవిధాల ప్రయత్నిస్తూ ఆదర్శంగా నిలుస్తారు. ఈ కోవకు చెందిన బాలిక బిహార్‌కు చెందిన తనూ కుమారి. ఓ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన తనూ కుమారి.. కాళ్లనే చేతులుగా మార్చుకుని తన భవిష్యత్తును చెక్కుకుంటుంది. ఆ వివరాలు.. బిహార్ పట్నాకు చెందిన తనూ కుమారి ప్రస్తుతం పదో తరగతి చదువుతుంది. ఆమెకు రెండు చేతులు లేవు. 2014లో తనూ టెర్రస్ పై ఆడుకుంటూ అనుకోకుండా ఎలక్ట్రిక్ వైరులను పట్టుకోవడంతో తన రెండూ చేతులను కోల్పోయింది. అయినా కూడా తనూ వెనకడుగు వేయలేదు. కాళ్లనే చేతులుగా మార్చుకుంది. పట్టుదలో శ్రమించి కాలి వేళ్లతో రాయడం నేర్చుకుంది. అది మాత్రమే కాక పేయింటింగ్ కూడా ప్రాక్టీస్ చేసింది తనూ. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న తనూ కుమారి.. బాగా చదువుకుని భవిష్యత్తులో టీచర్ని అవుతానని ధీమా వ్యక్తం చేస్తోంది. (చదవండి: మహిళ చేతిలో కేంద్ర మంత్రికి ఘోర అవమానం) ఆటలు ఆడటం, పేయింటింగ్ వేయడం తనకు ఎంతో ఇష్టమంటుంది తనూ కుమారి. ఇప్పటికే పలు పేయింటింగ్ కాంపిటీషన్స్‌లో పాల్గొని.. ఎన్నో అవార్డులు గెలుచుకుంది. కూతురు ఆత్మస్థైర్యం చూస్తే తనకెంతో గర్వంగా ఉంటుందంటున్నారు ఆమె తల్లి సుహా దేవి. తన కూతురు ఆత్మస్థైర్యంతో వైకల్యాన్ని అధిగమించి దూసుకుపోతున్నందుకు తనకెంతో ఆనందంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆమె తండ్రి అనిల కుమార్ గ్యాస్ డెలివరి మెన్‌గా పనిచేస్తున్నాడు. తాను పేదవాడినని తమను ప్రభుత్వం ఆదుకుంటే బాగుండనని ఆమె తండ్రి అనిల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. (చదవండి: చెల్లితో పాములకు రాఖీ కట్టించబోయాడు.. ప్రాణాలు కోల్పోయాడు) ప్రభుత్వ సాయం చేయాలి.... ఆమెను మొదటిసారి చూసినప్పుడే ఆశ్చర్యపోయానని, ఇలాంటి ధైర్యవంతురాలికి ప్రభుత్వ అండగా నిలిస్తే ఆమె మరిన్ని విజయాలు సాధిస్తోందని తనూ సైన్య్ టీచర్ దివ్య కుమారి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమెకు మేము ఎల్లప్పుడు తోడుగా ఉంటాం, తనూ ఓడిపోదూ... ఆత్మస్థైర్యంతో దూసుకుపోతుందంటూ తనూ కుమారి స్నేహితులు కొనియాడారు. Bihar | Tanu Kumari, a Patna-based girl, who lost both her hands in an accident in 2014, gets promoted to class 10 "After the accident, I slowly learned how to write with my feet. I also like to participate in sports and painting activities. I want to become a teacher," she says pic.twitter.com/UcGYyqTlAm — ANI (@ANI) September 6, 2021 -
‘తను మాకు దేవుడిచ్చిన బహుమతి’
నవ మాసాలు మోసి కన్న తల్లికి బిడ్డ రంగు, రూపు గురించి పట్టింపు ఉండదు. వీటన్నింటికతీతంగా పిల్లల్ని ప్రేమించగలిగేది తల్లి మాత్రమే. ఆరోగ్యంగా ఉన్న పిల్లలకంటే వైకల్యంతో పుట్టిన పిల్లల పట్లనే తల్లికి ఎక్కువ ప్రేమ, సంరక్షణ ఉంటాయి. లోకమంతా వారిని ఎగతాళి చేసినా, అసహ్యించుకున్నా.. తల్లి మాత్రం వారిని కడుపులో పెట్టి చూసుకుంటుంది. తనను ఏమన్నా ఊరుకుంటుంది కానీ తన పిల్లలను తక్కువ చేసి మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోదు. వారికి తగిన విధంగా సమాధానం చెప్పి నోరు మూయిస్తుంది. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. వైకల్యంతో పుట్టిన తన చిన్నారిని కామెంట్ చేస్తున్నవారికి ఆ తల్లి చెప్పిన సమాధానం నెటిజన్ల మనసు గెలవడమే కాక ట్రోలర్స్ నోరు మూయించింది. వివరాలు.. మాంచెస్టర్‌కు చెందిన నఫ్ఫి, రాచెలి గోల్మాన్ అనే దంపతులకు కూతురు జన్మించింది. అయితే ఆ బిడ్డ పుట్టడమే అరుదైన వ్యాధితో జన్మించింది. చూపు లేదు, వినపడదు.. కనీసం తనకు తానుగా శ్వాసించలేదు కూడా. అంతేకాక ఆ చిన్నారి కళ్లు ఉబ్బిపోయి.. తల కూడా అసమానంగా ఉండంటమే కాక వెన్నెముక కూడా సరిగా లేదు. కూతుర్నిని చూడగానే ముందు ఆమె తండ్రి కూడా భయపడ్డాడంట. కానీ అది కాసేపే.. వెంటనే చిన్నారిని తన చేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకున్నాడట. తమకు ఇలాంటి బిడ్డ పుట్టిందని ఆ తల్లిదండ్రులు బాధపడలేదంట. ఎందుకంటే.. గర్భంలో ఉన్నప్పుడే ఆ చిన్నారికి ఇలాంటి సమస్యలు ఉన్నాయని.. అబార్షన్ చేయించుకోమని సలహా ఇచ్చారంట వైద్యులు. కానీ వారు ఆ మాటలు పట్టించుకోలేదు. బిడ్డను భూమ్మీదకు తీసుకురావాలనే నిర్ణయించుకున్నారు. చిన్నారి జన్మించిన తరువాత ఆ సంతోషాన్ని నలుగురితో పంచుకోవడం కోసం తమ చిన్నారి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో వారిని విపరీతంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు నెటిజన్లు. ‘దెయ్యం’, ‘చంపేయండి’ అంటూ కామెంట్ చేశారు. ఈ ట్రోలింగ్కి ముందు బాధపడినా.. తరువాత కామెంట్ చేసేవాళ్లకు తగిన సమాధానం ఇచ్చారు. ‘ఈ చిన్నారిని జాగ్రత్తగా చూసుకోవడం మాకు కష్టమే. కానీ తనను సృష్టించిన భగవంతుని మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. దేవుడెప్పుడు తప్పులు చేయడు. ఆయన మాకు కానుకగా ఇచ్చిన ఈచిన్నారిని ప్రేమగా సంరక్షిస్తాము’ అంటూ సమాధానమిచ్చారు. -
చనిపోనివ్వాలంటూ మోదీకి లేఖ
భోపాల్: దివ్యాంగులకు ప్రత్యేక అవకాశాలు కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓ వైపు మాట్లాడుతుండగా.. సాధారణ వ్యక్తి కంటే ఎక్కువ చదివినా తనకు ఉద్యోగం దొరకలేదని భోపాల్ కు చెందిన లక్ష్మీ యాదవ్ అనే దివ్యాంగురాలు ప్రధానమంత్రి కార్యాలయానికి(పీఎంవో)కు ఉత్తరం రాసింది. గత పదేళ్లుగా ప్రైవేటు ఉద్యోగం కోసం తిరిగినా దివ్యాంగురాలిననే కారణంతో తనను ఉద్యోగానికి ఎంపిక చేయడం లేదని, దయచేసి చనిపోయేందుకు అనుమతించాలని లేఖలో కోరింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లకు కూడా లక్ష్మీ లేఖలు రాసింది. లేఖలోని విషయాలు: గత 12 ఏళ్లుగా ఎంఫిల్, ఎల్ఎల్ఎమ్ డిగ్రీలు చేత పట్టుకుని కంపెనీల ఇంటర్వూలకు ఉద్యోగం కోసం తిరిగినట్లు లక్ష్మీ లేఖలో పేర్కొంది. దివ్యాంగులకు మూడు శాతం రిజర్వేషన్లు ఉన్నా ఉద్యోగం ఇవ్వడానికి కంపెనీలు సంశయించాయని ఆవేదన వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాలకు చాలా పథకాలు ప్రారంభించిందని పేర్కొంది. ప్రైవేటు కంపెనీల్లో ఇంటర్వూలకు వెళ్లిన ప్రతిసారీ చేదు అనుభవం ఎదురైనట్లు చెప్పింది. మెట్లు ఎక్కలేనని, సరిగా పనిచేయగలిగే సామర్ధ్యం ఉందా? లాంటి కారణాలతో తనను ఉద్యోగానికి ఎంపిక చేయలేదని తెలిపింది. అవకాశం ఇస్తేనే కదా తన సామర్ధ్యం తెలిసేదని లక్ష్మీ లేఖలో వాపోయింది. ఉద్యోగం రాని జీవితం తనకు వద్దని చనిపోవడానికి అవకాశం కల్పించాలని లేఖలో కోరింది.