![My twin sister, who has special needs, came down at my wedding with my fiancé - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/16/Bride.jpg.webp?itok=vv0lOm2v)
న్యూఢిల్లీ: కొంతమంది మంచి మనుషులను చేసే గొప్ప గొప్ప పనులను చూస్తే మనకి అభినందించడం, మెచ్చుకోవడం వంటి మాటలు సరిపోవేమో అనేలా ఉంటుంది వారి వ్యక్తిత్వం. అలాంటి మహోన్నత వ్యక్తులు చాలా అరుదు. ఒకవేళ తారస పడితే మన అదృష్టంగా భావిస్తాం. అలాంటి వ్యక్తి ఒక అమ్మాయికి భర్తగా వస్తే ఆ అమ్మాయి ఆనందం మాటల్లో చెప్పలేం కదా!
(చదవండి: రాజీనామా ఉపసంహరణ చేసుకున్న సిద్ధూ)
అసలు విషయం ఏమిటంటే ప్రతి వ్యక్తి జీవితంలో వివాహ వేడుక అత్యంత మధురమైన ఘట్టం. అలాంటి వివాహతంతులో ఒక పెళ్లికూతురు తన కవల సోదరి దివ్యాంగురాలు. ఆమె కూడా ఆ తంతులో పెళ్లికూతురులా ముస్తాబవుతోంది. ఆమెను తమ వివాహ వేడుకకు తన కాబోయే భర్తే స్వయంగా అతని చేతులతో ఆమెను ఎత్తుకుని తీసుకు వస్తాడు. ఇది ఆ వివాహ వేడుకు వచ్చిన బంధువులందర్నీ ఆశ్చర్యానికి గురి చేయడమే కాక అందరీ హృదయాలను గెలుచుకున్నాడు.
ఈ సంఘటనను వధువు వీడియో తీసి "ఇప్పుడు నేను అతన్ని నా భర్త అని మనస్పూర్తిగా పిలుస్తాను, నేను అతన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. అంతేకాదు నేను నా చెల్లెల్ని నేను ఎంత అమితంగా ప్రేమిస్తున్నానో తను అంతే ప్రేమిస్తున్నాడంటూ ట్యాగ్ లైన్ జోడించి మరీ పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ మేరకు నెటిజన్లు దయకు అర్థం అతనే అంటూ ఆ పెళ్లికొడుకుపై ప్రశంసలజల్లు కురిపిస్తున్నారు.
(చదవండి: అమేజింగ్.. ప్రపంచంలోనే అత్యంత పొడగరి!)
Comments
Please login to add a commentAdd a comment