
న్యూఢిల్లీ: అన్ని సక్రమంగా ఉన్న ఏదో ఒక కారణాలతో ఏమి చేయకుండా కూర్చొండిపోతారు. పైగా అన్ని అవయవాలు బాగా ఉన్నా ఏవో చిన్న చిన్న సాకులతో కష్టపడటానికి ఇష్టపడరు. కానీ ఇక్కడ ఒక పదేళ్ల బాలికకు కాళ్లు లేకపోయిన జిమ్నాస్టిక్ నైపుణ్యంతో అందరీ మనసులను గెలుచుకుంది.
(చదవండి: అమ్మో ఈ చేప ఖరీదు రూ.36 లక్షల!)
వివరాల్లోకెళ్లితే...ఒహియోకు చెందిన పైజ్ క్యాలెండైన్‌కు కాళ్లు లేవు. అయినా తన జిమ్నాస్టిక్ నైపుణ్యాలను అత్యంత అద్భుతంగా ప్రదర్శిసిస్తోంది. ఈ మేరకు ఆమె తన జిమ్నాస్టిక్ సాధనలో భాగంగా తాను చేసే రోజువారి ప్రాక్టీస్‌లకు సంబంధించిన వీడియోను ట్వీట్టర్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు నెటిజన్లు ఆమె నైపుణ్యాలను చూసి ఆశ్చర్యపోతూ ఆమె పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.
(చదవండి: ఒక గంట వ్యవధిలో ఐదువేల కిలోగ్రాములు బరువుని ఎత్తి రికార్డు సృష్టించాడు)
10-year-old Paige Calendine of Ohio is a force!🌟🏅🏆.
— GoodNewsCorrespondent (@GoodNewsCorres1) October 25, 2021
(🎥:heidi.calendine)💪😃💪
pic.twitter.com/DI23hHRO4r