
మట్టితో సెయింట్‌మేరి విగ్రహం తయారు చేసిన ఓ దివ్యాంగుడు
కణేకల్లు: వారంతా దివ్యాంగులు...కానీ తమ అద్భుత కళా నైపుణ్యంతో అందరి చేత ఔరా అనిపించారు. కణేకల్లు క్రాస్‌లోని ఆర్డీటీ ఫీల్డ్ కార్యాలయంలో మంగళవారం సెంటర్‌స్థాయి దివ్యాంగుల ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహించారు. కణేకల్లు, కదిరి, బత్తలపల్లి, బుక్కరాయసముద్రం, ఉరవకొండ, రాప్తాడు ప్రాంతాల దివ్యాంగులు రంగోళి, పిక్చర్ పెయింటింగ్, పేపర్ కటింగ్, మట్టిబొమ్మల తయారీ, న్యాచురల్ కొల్లేజ్ (ప్రకృతిలో దొరికే వస్తువులతో బొమ్మల తయారీ) పోటీల్లో పాల్గొని తమ కళానైపుణ్యం ప్రదర్శించారు. ఆర్డీటీ సీబీఆర్ డైరెక్టర్ దశరథరాముడు మాట్లాడుతూ, దివ్యాంగుల కళానైపుణ్యం అమోఘమని ప్రశంసించారు. సెంటర్‌స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన 18 మంది జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో ఆర్ట్‌ఫెస్టివల్ ప్రోగ్రామ్ మేనేజర్ నవ్య, ఎస్టీఎల్ నారాయణ, పద్మావతి ఉరవకొండ రీజనల్ డైరెక్టర్ మహబూబ్‌బీ, ఆర్డీటీ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment