
దుర్గారావు నుంచి వివరాలు తెలుసుకుంటున్న జేసీ లక్ష్మీశ
సాక్షి, తూర్పుగోదావరి : కనరాని దేవుడే కనిపించినాడె అన్నట్టుగా అయింది దివ్యాంగుడు దుర్గారావుకు. జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ దేవుడిలా దిగివచ్చి అతని కోర్కె తీర్చారు. వివరాల్లోకి వెళితే.. కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురానికి చెందిన దుర్గారావుకు చిన్నతనంలోనే పోలియో సోకింది. దాంతో అంVýæ వైకల్యానికి గురయ్యాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు దూరంగా కాగా భిక్షమెత్తుకొని జీవిస్తున్నాడు. గత ప్రభుత్వ హయాంలో పింఛన్‌కోసం కార్యాలయాల చుట్టూ, సదరన్ సర్టిఫికెట్ కోసం కొత్తపేట, కాకినాడ, రాజమహేంద్రవరం ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది.
అందరి ఆశా జ్యోతిగా నిలుస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన ‘స్పందన’లోనైనా తనకు పింఛన్ లభిస్తుందేమో అనే ఆశతో శుక్రవారం కలెక్టరేట్‌కు వచ్చాడు. కలెక్టర్ సమీక్షా సమావేశాల్లో ఉండడంతో ఆయనకోసం నిరీక్షిస్తున్న దుర్గారావు వద్దకు జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ వచ్చి వివరాలు తెలుసుకున్నారు. ‘మీరైనా పింఛన్ ఇప్పించి ఆదుకోండి’ అని జేసీ లక్ష్మీశను దుర్గారావు వేడుకున్నాడు. దుర్గారావు ఫోన్ నెంబర్‌ను జేసీ తీసుకున్నారు. ‘నీవు మళ్లీ కలెక్టరేట్‌కు వచ్చే పనిలేకుండా ఆస్పత్రికి తెలియజేసి సదరన్‌సర్టిఫికెట్ ఇప్పించి పింఛన్ వచ్చేలా చూస్తా’నని హామీ ఇచ్చారు. అంతేకాదు.. ఆయన సిబ్బందిని పిలిచి ఆటోలో బస్టాండ్‌కు తీసుకువెళ్లి అక్కడ నుంచి బస్సు ఎక్కించి అతనిని స్వగ్రామం పంపించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment