దివ్యాంగుడిగా నారా రోహిత్‌ | Nara Rohith Played A Handicapped In Veera Bhoga Vasantha Rayalu | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 21 2018 3:20 PM | Last Updated on Sat, Jul 21 2018 3:20 PM

Nara Rohith Played A Handicapped In Veera Bhoga Vasantha Rayalu - Sakshi

కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచి వరుసగా ప్రయోగాత్మక పాత్రలు చేస్తూ వస్తున్న యంగ్ హీరో నారా రోహిత్‌. డిఫరెంట్‌ జానర్‌ లో తెరకెక్కే సినిమాలతో పాటు మల్టీ స్టారర్‌ సినిమాలతోనూ అలరించిన ఈ యంగ్ హీరో తాజాగా మరో సాహసానికి రెడీ అవుతున్నాడు. హిట్‌ ఫ్లాప్‌ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న రోహిత్ తన నెక్ట్స్ సినిమాలో దివ్యాంగుడిగా కనిపించనున్నాడట.

నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్‌ బాబు, శ్రియ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ‘వీర భోగ వసంత రాయలు’. ఇంద్రసేన.ఆర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నారా రోహిత్ ఓ చాలెంజింగ్ రోల్‌ లో కనిపించనున్నాడట. ఇప్పటికే రిలీజ్‌ అయిన శ్రియ లుక్‌కు మంచి రెస్సాన్స్‌రాగా త్వరలో నారా రోహిత్‌ లుక్‌ను రివీల్‌ చేయనున్నారట. ఈ సినిమాలో రోహిత్ పాత్రకు కుడిచేయి ఉండదని తెలుస్తోంది. అయితే ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే లుక్‌ రిలీజ్‌ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement