హీరోయిన్ కొన్నేళ్ల కల నెరవేరబోతోంది..
ముంబై: బాలీవుడ్ అందాలతార మాధురీ దీక్షిత్ అద్బుతమైన డాన్సరన్న విషయం తెలిసిందే. ఎన్నో చిత్రాల్లో సూపర్ హిట్ సాంగ్స్లో మాధురి అభిమానులను అలరించింది. రెండు దశాబ్దాలకుపైగా తన డాన్స్లతో బాలీవుడ్ను ఉర్రూతలూగించిన మాధురికి.. కొరియోగ్రాఫర్ కావాలనే కోరికఉందట. కొన్నేళ్లుగా ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆమెకు ఇప్పుడు ఆ కల నెరవేరనుంది. ఓ టీవీ షోలో కొరియోగ్రాఫర్గా పనిచేసే అవకాశం మాధురికి వచ్చింది. మాధురీ నృత్యదర్శకత్వంలో టెరెన్స్ లూయిస్, బొస్కో మార్టిస్, రణదీప్ హుడా, కాజల్ అగర్వాల్ కాలుకదపనున్నారు.
'కోరియాగ్రాఫర్ కావాలని ఎప్పట్నుంచో కోరుకుంటున్నా. ఆ కల టీవీ షో ద్వారా నెరవేరింది. టెరెన్స్, బొస్కొ, రణదీప్, కాజల్తో డాన్స్ చేయిస్తా' అని మాధురీ చెప్పింది. మాధురి జడ్జిగా వ్యవహరిస్తున్న 'సో యు థింక్ యు కెన్ డాన్స్ అబ్ ఇండియా కి బారీ' టీవీ షో త్వరలో ప్రసారం కానుంది.