ముంబయి: అనుకరణ అస్తిత్వాన్నే కాదు ఒక్కోసారి ప్రాణాలు కూడా తీస్తుంది. ఆ విషయాన్ని రుజువు చేస్తూ ముంబయిలో ఓ ఘటన చోటుచేసుకుంది. టీవీ సీరియల్స్లో ఎలా ఉరి వేసుకుంటారో తన సోదరికి చూపిస్తూ ఓ పదకొండేళ్ల బాలుడు ప్రాణాలుకోల్పోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతంలోగల బీద్ జిల్లాలో షేక్ సాజెద్ షేక్ వాజెద్ అనే విద్యార్థి ఓ ఉర్దూ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. స్కూల్ కు వెళ్లొచ్చి తన సోదరుడితో కలిసి భోజనం చేశాడు.
అనంతరం తన సోదరితో కలిసి టీవీ ముందు కూర్చున్నారు. టీవీ చూస్తూ చూస్తూ మధ్యలో తన సోదరితో మాట్లాడుతూ టీవీ సీరియల్స్ లో ఎలా ఉరివేసుకుంటారో ప్రదర్శనగా చూపించేందుకు ప్రయత్నించాడు. ఇది జరిగే సమయంలో ఇంట్లో పెద్దవాళ్లెవరూ లేరు. అలా ఉరి వేసుకుంటున్నట్లుగా నటించిన సాజెద్ మెడకు నిజంగా తాడు బిగుసుకుపోవడంతో అతడు ప్రాణాలు కోల్పోయారు. అనుకోకుండా జరిగిన సంఘటనగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
'అక్కా.. ఉరి ఎలా వేసుకుంటారో చూపించనా అంటూ..'
Published Wed, Jan 13 2016 5:16 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
Advertisement
Advertisement