నాన్న.. అమ్మ గొంతు కోసేశాడు! | 9 Year Old Watches Father Slit Moms Throat, And Then Hang Himself | Sakshi
Sakshi News home page

నాన్న.. అమ్మ గొంతు కోసేశాడు!

Published Wed, Feb 17 2016 12:54 PM | Last Updated on Thu, Aug 16 2018 4:30 PM

నాన్న.. అమ్మ గొంతు కోసేశాడు! - Sakshi

నాన్న.. అమ్మ గొంతు కోసేశాడు!

తొమ్మిదేళ్ల సమీక్షకకు సోమవారం రాత్రి ఓ పిడకలగా మిగిలిపోయింది. కన్నతండ్రే తల్లి గొంతును కోసి.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంటుండగా సమీక్ష నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. తన కళ్ల ముందే జరిగిన ఈ ఘోరాన్ని పోలీసులకు వివరించిన ఆ చిన్నారి.. ఆ సమయంలో తాను మేల్కొని ఉన్నానని, అయితే ఈ విషయం కాలయముడిగా మారిన తండ్రికి తెలిస్తే.. ఎక్కడ తనను కూడా చంపుతాడోనని భయంతో నిద్రపోతున్నట్టు నటించానని తెలిపింది.

తూర్పు ముంబైలో హనుమాన్ నగర్‌లో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. 37 ఏళ్ల నితిన్ పంద్కర్ తన భార్య సురేఖ గొంతుకోసి హతమార్చి.. ఆ తర్వాత ఆమె చీరతో సీలింగ్‌కు ఉరి వేసుకొని చనిపోయాడు. మృతిచెందిన ఈ దంపతులకు కూతురు సమీక్ష, కొడుకు యువరాజ్‌ (7) ఉన్నారు. భార్య సురేఖకు వివాహేతర సంబంధం ఉందని నితిన్ అనుమానించేవాడని, ఈ విషయంలో భార్యాభర్తలిద్దరికి తరచూ తగదాలు జరిగేవాని సమతా నగర్ పోలీసులు తెలిపారు. ఈ జంటకు 2007లో పెళ్లయిందని, అప్పటి నుంచి ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నారని చెప్పారు.

సాయి మోటార్ ట్రైనింగ్ స్కూల్‌ లో నితిన్ డ్రైవింగ్ శిక్షకుడిగా పనిచేస్తున్నాడు. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఘటనను గురించి బాలిక సమీక్ష పోలీసులకు వివరిస్తూ.. 'నేను నిద్రపోయాను. అలికిడి రావడంతో లేచిచూడగా పప్పా (నాన్న) మమ్మీ మీద కూచుని దిండుతో ఆమె మొఖాన్ని అదిమిపట్టాడు. ఆ తర్వాత దిండు తీసి కత్తితో ఆమె గొంతు కోసేశాడు. ఆ తర్వాత అమ్మ చీర గుంజుకొని నాన్న సీలింగ్‌కు ఉరివేసుకున్నాడు. ఈ ఘటనతో నేను చాలా భయపడ్డాను. కనీసం సాయం కోసం అరిచే ధైర్యం కూడా చేయలేదు. నిద్రపోతున్నట్టు నటిస్తూ నాకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాను. పొద్దున్న మేల్కొన్న వెంటనే మా ఆంటీ వద్దకు పరిగెత్తి ఈ విషయాన్ని చెప్పాను' అని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement