తెలుగు ప్రేక్షకులకు ఎంటర్ టైన్‌మెంట్ అంటే టీవీ షోలు గుర్తొస్తుంటాయి. పలు ఛానెల్స్ ఎప్పటికప్పుడు ఈ విషయంలో పోటీపడుతూనే ఉంటాయి. అయితే షో ఏదైనా సరే ఆర్గనైజర్స్.. కమెడియన్స్ కచ్చితంగా ఉండేలా చూసుకుంటారు. అలా ఇప్పటికే బోలెడంత మంది గుర్తింపు తెచ్చుకున్నారు. కమెడియన్ చలాకీ చంటి ఈ లిస్టులో ముందుంటాడు. అతడు చాలారోజుల తర్వాత మళ్లీ స్టేజీపై కనిపించాడు.
(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్‌పై బాడీ షేమింగ్.. ఆయన వల్ల!)
నాని 'భీమిలి కబడ్డీ జట్టు' సినిమాతో హాస్య నటుడిగా ఎంట్రీ ఇచ్చిన చంటి... ఆ తర్వాత 'జబర్దస్త్' షోలో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాల్లో అవకాశాలు వల్ల ఆ షోకి వస్తూ పోతూ ఉండేవాడు. అయితే గతేడాది 'బిగ్‌బాస్' షోలో పాల్గొన్న చంటి.. కొన్ని వారాలపాటు బాగానే ఎంటర్ టైన్ చేశాడు గానీ ఆ తర్వాత పెద్దగా ఫెర్ఫార్మ్ చేయలేదు. దీంతో హౌస్ నుంచి బయటకొచ్చేశాడు.
ఈ షోలో పాల్గొన్న తర్వాత పెద్దగా సినిమాలు చేయలేదు, షోల‍్లోనూ కనిపించలేదు. అలాంటిది సడన్‌గా ఈ ఏడాది ఏప్రిల్ చివరి వారంలో చంటికి గుండెపోటు వచ్చిందనే న్యూస్ బయటకొచ్చింది. ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కొన‍్నప్పటికీ, దాన్నుంచి బయటపడ్డాడు. ఇది జరిగిన మూడు నెలలు కూడా కాలేదు. ఇప్పుడు ప్రముఖ కామెడీ షోలో ప్రత్యక్షమయ్యాడు. అయితే చూడటానికి కాస్త డల్‌గానే కనిపించాడు. దీంతో ఫ్యాన్స్.. చంటి హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నారు. కుదుటపడినట్లేనా అని యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు.
(ఇదీ చదవండి: 'రంగబలి' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజే)
Comments
Please login to add a commentAdd a comment