జబర్దస్త్ కార్తీక్ | Zabardast Karthik | Sakshi
Sakshi News home page

జబర్దస్త్ కార్తీక్

Published Wed, Apr 13 2016 1:09 AM | Last Updated on Sun, Sep 3 2017 9:47 PM

జబర్దస్త్ కార్తీక్

జబర్దస్త్ కార్తీక్

టీవీ షోలు, పదికిపైగా సినివూల్లో నటించే అవకాశం
కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు పగలు కాలేజీ, రాత్రి ఈవెంట్స్
అవకాశాలను అందిపుచ్చుకొని  విజయాలు సాధిస్తున్న యువతేజం    

 

రెండో తరగతిలో ఉండగా జనవరి 26 సందర్భంగా వేసుకున్న మహాత్మా గాంధీ వేషధారణ అతడిలోని నటనా పటిమకు బీజాలు వేసింది. ఎలాగైనా అత్యుత్తమ కళాకారుడిగా ఎదగాలనే సంకల్పం పాఠశాల దశలోనే ఆ కుర్రాడి మదిలో మెదిలేది. అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు  అహర్నిశలు కష్టపడ్డాడు. కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు అర్ధరాత్రి దాకా మిమిక్రీ ప్రోగ్రామ్స్ చేసేవాడు. మళ్లీ ఉదయాన్నే బీటెక్ క్లాస్‌లకు హాజరయ్యేవాడు. రూ.200 రెమ్యునరేషన్‌తో మొదలైన ఆయన కళా ప్రస్థానం ప్రస్తుతం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. సినిమాల్లోనూ నటించే అవకాశాలు వరించారుు. కృషి చేస్తే ఏదైనా సాధించొచ్చని నిరూపిస్తున్న ఖానాపురం మండలం బుధరావుపేట యువతేజం కార్తీక్‌పై కథనమిది.  - ఖానాపురం

 

ఖానాపురం మండలం బుధరావుపేటకు చెందిన ఓడపల్లి యూదగిరి, కరుణ దంపతుల కుమారుడు కార్తీక్. కార్తీక్ 2వతరగతిలో ఉండగా జనవరి 26న వుహాత్మాగాంధి వేషధారణలో చక్కటి హావభావాలతో అందరి మన్ననలు అందుకున్నాడు. అలా మొదలైన నటనా ప్రస్థానం తరగతులు పెరుగుతున్న కొద్దీ ఇనుమడిస్తూ పోరుుంది. పాఠశాల స్థారుులో హిందీ ఉపాధ్యాయుుడు రఫీ, తెలుగు ఉపాధ్యాయుుడు సురేష్ ఆయనకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చేవారు. బడిలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో కార్తీక్‌తో మిమిక్రీ, యూంకరింగ్ చేరుుంచేవారు. ఈ అభ్యాసం హన్మకొండలోని రావుప్ప ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్‌లో చేరిన తర్వాత కూడా కార్తీక్‌కు ఎంతో ఉపయోగపడింది. కళాశాలలో జరిగే కార్యక్రమాల్లో తోటి విద్యార్థుల నడుమ నటనా చాతుర్యాన్ని ప్రదర్శించే అవకాశం దక్కింది. 


రూ.200 రెమ్యునరేషన్‌తో మొదలు
అప్పటిదాకా ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేస్తున్న కార్తీక్ తండ్రి యూదగిరికి పరకాలకు బదిలీ అరుుంది. ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్లిన తర్వాత, కొద్దిరోజులకు అనివార్య కారణాలతో ఉద్యోగం పోరుుంది. దీంతో వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందులు మరింత పెరిగారుు. అప్పుడు కార్తీక్ బీటెక్ చేస్తున్నారు. కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు ఉదయం కాలేజీ, రాత్రి ఈవెంట్స్‌కు వెళ్లేవారు. రెమ్యునరేషన్ రూ.200 కు మించి వచ్చేదికాదు. ఆ తర్వాత మెజీషియున్ కల్యాణ్‌తో కలిసి రాష్ట్రస్థాయి ఈవెంట్స్‌లో పాల్గొన్నారు కార్తీక్.

 

‘జబర్దస్త్’తో.. సినిమా చాన్స్
‘ఈటీవీ’లో తఢాఖా కార్యక్రమం కోసం ఆడిషన్స్‌లో 400 వుంది పాల్గొనగా కేవలం 20 మందినే ఎంపికచేశారు. వారిలో కార్తీక్ కూడా ఉన్నారు.  2014 డిసెంబర్‌లో ఓ రోజు జబర్దస్త్‌లో పని చేస్తున్న ధన్‌రాజ్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ కార్యక్రమంలో కార్తీక్ 4 ఎపిసోడ్‌లలో పని చేశాడు. ఆ తర్వాత ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో ప్రకాశ్ టీంలో చేరారు. కొన్ని రోజుల తర్వాత రాకెట్ రాఘవ టీంలోకి మారారు. వుుసలవ్ము, తాగుబోతు రమేష్ క్యారెక్టర్‌లతో గుర్తింపు సంపాదించారు. శంకరాభరణం, ఇటీవల విడుదలైన ఎమ్మెల్యే భరత్, మరో 10 సినివూల్లో నటించే అవకాశాలు వరించారుు. 

 

బుల్లితెరపై తొలి అవకాశం
బీటెక్  చివరి సంవత్సరంలో ఉండగా కార్తీక్‌కు ‘జీతెలుగు’ చానల్‌లో 2011 సంవత్సరంలో కామెడీ క్లబ్‌లో మిమిక్రీ ప్రదర్శన ఇచ్చే అవకాశం లభించింది. అందులో 3 ఎపిసోడ్‌లు చేశారు. మరో 2 నెలలకే ‘వూ గోల్డ్’ చానల్‌లో గోల్డ్ కెఫే కార్యక్రమంలో మిమిక్రీ ప్రదర్శించారు. అనంతరం హైదరాబాద్‌లో కార్తీక్ నిర్వహించిన ఓ ఈవెంట్‌ను టీవీ-1 డెరైక్టర్ సురేష్ చూసి, 2013 దీపావళి స్పెషల్ ఎపిసోడ్‌లో ప్రదర్శన ఇచ్చే అవకాశమిచ్చారు.

 

అమ్మానాన్నల ప్రోత్సాహం మరువలేనిది
పాఠశాల దశ నుంచే నాకు నటన అంటే ఇష్టం. వుంచి ఆర్టిస్టు కావాలనే లక్ష్యంతో ఎన్నో ఈవెంట్స్ నిర్వహించా. నా పురోగతి వెనుక అమ్మానాన్నల ప్రోత్సాహం ఉంది. వారి సహాయ సహకారాలు లేకుంటే ఈ స్థారుుకి వచ్చేవాడిని కాదు. ‘మంచి కళాకారుడిగా ఎదగాలి బిడ్డా’ అంటూ అమ్మానాన్న చెప్పిన మాటలే తారక మంత్రాల్లా పనిచేసి నన్ను ముందుకు నడిపారుు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement