Zabardast
-
‘జబర్దస్త్’ భామ రొమాంటిక్ ఫొటోలు
-
జబర్దస్త్ కార్తీక్
టీవీ షోలు, పదికిపైగా సినివూల్లో నటించే అవకాశం కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు పగలు కాలేజీ, రాత్రి ఈవెంట్స్ అవకాశాలను అందిపుచ్చుకొని విజయాలు సాధిస్తున్న యువతేజం రెండో తరగతిలో ఉండగా జనవరి 26 సందర్భంగా వేసుకున్న మహాత్మా గాంధీ వేషధారణ అతడిలోని నటనా పటిమకు బీజాలు వేసింది. ఎలాగైనా అత్యుత్తమ కళాకారుడిగా ఎదగాలనే సంకల్పం పాఠశాల దశలోనే ఆ కుర్రాడి మదిలో మెదిలేది. అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు అహర్నిశలు కష్టపడ్డాడు. కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు అర్ధరాత్రి దాకా మిమిక్రీ ప్రోగ్రామ్స్ చేసేవాడు. మళ్లీ ఉదయాన్నే బీటెక్ క్లాస్‌లకు హాజరయ్యేవాడు. రూ.200 రెమ్యునరేషన్‌తో మొదలైన ఆయన కళా ప్రస్థానం ప్రస్తుతం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. సినిమాల్లోనూ నటించే అవకాశాలు వరించారుు. కృషి చేస్తే ఏదైనా సాధించొచ్చని నిరూపిస్తున్న ఖానాపురం మండలం బుధరావుపేట యువతేజం కార్తీక్‌పై కథనమిది. - ఖానాపురం ఖానాపురం మండలం బుధరావుపేటకు చెందిన ఓడపల్లి యూదగిరి, కరుణ దంపతుల కుమారుడు కార్తీక్. కార్తీక్ 2వతరగతిలో ఉండగా జనవరి 26న వుహాత్మాగాంధి వేషధారణలో చక్కటి హావభావాలతో అందరి మన్ననలు అందుకున్నాడు. అలా మొదలైన నటనా ప్రస్థానం తరగతులు పెరుగుతున్న కొద్దీ ఇనుమడిస్తూ పోరుుంది. పాఠశాల స్థారుులో హిందీ ఉపాధ్యాయుుడు రఫీ, తెలుగు ఉపాధ్యాయుుడు సురేష్ ఆయనకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చేవారు. బడిలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో కార్తీక్‌తో మిమిక్రీ, యూంకరింగ్ చేరుుంచేవారు. ఈ అభ్యాసం హన్మకొండలోని రావుప్ప ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్‌లో చేరిన తర్వాత కూడా కార్తీక్‌కు ఎంతో ఉపయోగపడింది. కళాశాలలో జరిగే కార్యక్రమాల్లో తోటి విద్యార్థుల నడుమ నటనా చాతుర్యాన్ని ప్రదర్శించే అవకాశం దక్కింది. రూ.200 రెమ్యునరేషన్‌తో మొదలు అప్పటిదాకా ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేస్తున్న కార్తీక్ తండ్రి యూదగిరికి పరకాలకు బదిలీ అరుుంది. ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్లిన తర్వాత, కొద్దిరోజులకు అనివార్య కారణాలతో ఉద్యోగం పోరుుంది. దీంతో వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందులు మరింత పెరిగారుు. అప్పుడు కార్తీక్ బీటెక్ చేస్తున్నారు. కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు ఉదయం కాలేజీ, రాత్రి ఈవెంట్స్‌కు వెళ్లేవారు. రెమ్యునరేషన్ రూ.200 కు మించి వచ్చేదికాదు. ఆ తర్వాత మెజీషియున్ కల్యాణ్‌తో కలిసి రాష్ట్రస్థాయి ఈవెంట్స్‌లో పాల్గొన్నారు కార్తీక్. ‘జబర్దస్త్’తో.. సినిమా చాన్స్ ‘ఈటీవీ’లో తఢాఖా కార్యక్రమం కోసం ఆడిషన్స్‌లో 400 వుంది పాల్గొనగా కేవలం 20 మందినే ఎంపికచేశారు. వారిలో కార్తీక్ కూడా ఉన్నారు. 2014 డిసెంబర్లో ఓ రోజు జబర్దస్త్‌లో పని చేస్తున్న ధన్‌రాజ్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ కార్యక్రమంలో కార్తీక్ 4 ఎపిసోడ్లలో పని చేశాడు. ఆ తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్‌లో ప్రకాశ్ టీంలో చేరారు. కొన్ని రోజుల తర్వాత రాకెట్ రాఘవ టీంలోకి మారారు. వుుసలవ్ము, తాగుబోతు రమేష్ క్యారెక్టర్లతో గుర్తింపు సంపాదించారు. శంకరాభరణం, ఇటీవల విడుదలైన ఎమ్మెల్యే భరత్, మరో 10 సినివూల్లో నటించే అవకాశాలు వరించారుు. బుల్లితెరపై తొలి అవకాశం బీటెక్ చివరి సంవత్సరంలో ఉండగా కార్తీక్‌కు ‘జీతెలుగు’ చానల్లో 2011 సంవత్సరంలో కామెడీ క్లబ్లో మిమిక్రీ ప్రదర్శన ఇచ్చే అవకాశం లభించింది. అందులో 3 ఎపిసోడ్లు చేశారు. మరో 2 నెలలకే ‘వూ గోల్డ్’ చానల్లో గోల్డ్ కెఫే కార్యక్రమంలో మిమిక్రీ ప్రదర్శించారు. అనంతరం హైదరాబాద్‌లో కార్తీక్ నిర్వహించిన ఓ ఈవెంట్‌ను టీవీ-1 డెరైక్టర్ సురేష్ చూసి, 2013 దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో ప్రదర్శన ఇచ్చే అవకాశమిచ్చారు. అమ్మానాన్నల ప్రోత్సాహం మరువలేనిది పాఠశాల దశ నుంచే నాకు నటన అంటే ఇష్టం. వుంచి ఆర్టిస్టు కావాలనే లక్ష్యంతో ఎన్నో ఈవెంట్స్ నిర్వహించా. నా పురోగతి వెనుక అమ్మానాన్నల ప్రోత్సాహం ఉంది. వారి సహాయ సహకారాలు లేకుంటే ఈ స్థారుుకి వచ్చేవాడిని కాదు. ‘మంచి కళాకారుడిగా ఎదగాలి బిడ్డా’ అంటూ అమ్మానాన్న చెప్పిన మాటలే తారక మంత్రాల్లా పనిచేసి నన్ను ముందుకు నడిపారుు. -
ముందు మనం మనుషులం: మంచు మనోజ్
హైదరాబాద్: కమెడియన్ 'జబర్దస్త్' వేణుపై జరిగిన భౌతికదాడిపై హీరో మంచు మనోజ్ స్పందించారు. వేణుపై దాడిని చావకబారు, అమానవీయ చర్యగా ఆయన పేర్కొన్నారు. కుల, మతాల కంటే ముందు మనం మనుషులం అన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. ఈమేరకు తన ట్విటర్ పేజీలో పోస్ట్ పెట్టారు. కమెడియన్ జబర్దస్త్ వేణుపై ఆదివారం ఫిల్మ్ నగర్లో గౌడ విద్యార్థి సంఘం నాయకులు దాడి చేశారు. ఈటీవీలో ప్రసారమౌతున్న 'జబర్దస్త్' కార్యక్రమంలో కల్లువృత్తిని, గౌడ మహిళలను అవమానించే విధంగా స్క్రిఫ్ట్‌ను ప్రదర్శించారన్న కోపంతో ఈ దాడికి పాల్పడ్డారు. కమెడియన్ వేణుపై జరిగిన దాడిని మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ తో పాటు పలువురు నటులు ఖండించారు. నవ్వులు పండిస్తున్న నటులను కొట్టడం అమానుషమని చిరంజీవి సోదరుడు నాగబాబు అన్నారు. మంచు మనోజ్ ట్వీట్ Soo cheap and inhuman to hit Actor Venu ... Cowards ... Wish I was at chamber then -
‘జబర్దస్త్’ వేణుపై దాడి
బంజారాహిల్స్: ఈటీవీలో ప్రసారమౌతున్న ‘జబర్దస్’్త షో ఫేం వేణుపై గౌడ కులస్తులు ఆదివారం ఉదయం దాడి చేశారు. ఈనెల 18న ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమంలో కల్లువృత్తిని, గౌడ మహిళలను అవమానించే విధంగా స్క్రిఫ్ట్‌ను ప్రదర్శించారని ఆరోపిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన గౌడ విద్యార్థి సంఘం నాయకులు ఫిలింనగర్‌లోని అయ్యప్ప ఆలయానికి వచ్చిన వేణును చుట్టుముట్టి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం కామెడీ కోసమే ఆ స్క్రిప్ట్ తయారు చేశానని, ఒక కులాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని అతను చెప్తుండగానే వారు దాడి చేశారు. దీంతో కిందపడిపోయిన వేణు వారి నుంచి తప్పించుకొని సమీపంలో ఉన్న ఫిలింనగర్ అవుట్‌పోస్ట్‌లో దూరాడు. గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వట్టికూట రామారావు గౌడ్ ఆధ్వర్యంలో పలువురు గౌడ విద్యార్థులు ఫిలించాంబర్ వద్దకు చేరుకున్నారు. వేణు ప్రదర్శించిన స్క్రిఫ్ట్ వల్ల కోటి మంది గౌడ కులస్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, అతను బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలని రామారావు డిమాండ్ చేశారు. జబర్దస్త్ టీమ్, ఈటీవీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీంతో రెండు గంటలపాటు ఫిలించాంబర్ వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. వేణును ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో కూడా గౌడ విద్యార్థులు అడ్డుపడి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇరువురిపై కేసు నమోదు తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వేణు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గౌడ విద్యార్థి సంఘం నేతలపై ఐపీసీ 341, 323 కింద కేసులు నమోదు చే శారు. వేణు కూడా తమపై దాడి చేశాడంటూ గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామారావుగౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వేణుపై ఐపీసీ 323, 509కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మిత్రహాస్యం
ఒకరిది నిజామాబాద్.. ఇంకొకరిది కరీంనగర్.. మరొక రిది తాడేపల్లిగూడెం.. వేరొకరిది విశాఖపట్నం.. ఇలా వాడవాడల నుంచి హైదరాబాద్ చేరుకున్న వీరిని మంచి మిత్రులను చేసింది మాత్రం హాస్యమే. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులున్నా.. కష్టనష్టాలున్నా.. వీరికి తెలిసింది నవ్వించడం ఒకటే. అందుకే ఈ స్నేహితులు కామెడీ ట్రాక్ ఎక్కిన ప్రతిసారీ నవ్వుల మతాబులు వెలుగుతూనే ఉంటాయి. వెండితెర, బుల్లితెర.. ఇలా వేదికేదైనా తమ పంచ్‌లతో దుమ్మురేపుతున్న పటాకాలను ‘సిటీప్లస్’ పలకరించింది. - శిరీష చల్లపల్లి జీవితంలో భాగం.. నేను 13 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలోనే ఉన్నాను. వైజాగ్ ఆంధ్ర రేడియో స్టేషన్లో అనౌన్స్మెంట్ చేసేవాణ్ని. మిమిక్రీ కూడా చేసేవాణ్ని. తర్వాతి కాలంలో దూరదర్శన్‌లో చిన్న చిన్న నాటికలు, స్కిట్స్ రాయడం, యాంకరింగ్ చేయడంతో గుర్తింపు వచ్చింది. దాని ద్వారా సినిమాల్లో అవకాశాలొచ్చాయి. 150 సినిమాల వరకూ చేశాను. మరిన్ని మంచి పాత్రలు వస్తాయని ఆశిస్తున్నాను. నాకు గుర్తింపు తెచ్చిన కామెడీని ఎప్పుడూ విడిచిపెట్టను. ఈ ట్రాక్‌లోకి రాకపోయి ఉంటే.. టీచర్‌గా ఉండేవాడినేమో. ధన్‌రాజ్, వేణు వీళ్లంతా ఎప్పటి నుంచో మంచి స్నేహితులు. హైదరాబాద్, సినీఫీల్డ్ నా జీవితంలో భాగమైపోయాయి. - రాఘవ బ్రహ్మాండంగా చేయాలని.. నేను బేసిక్‌గా మిమిక్రీ ఆర్టిస్ట్‌ని. నాకు అన్నయ్య, అమ్మ.. వీళ్లే నా లోకం. నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో నా మిమిక్రీని చూసిన పక్క అపార్ట్మెంట్లో ఉన్న డెరైక్టర్ వి.ఎన్.ఆదిత్య గారు నన్ను మెచ్చుకుని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆయన నాకు సాయం చేయలేదు. జీవితాన్నే ఇచ్చారు. ఆయన మేలు నేనెన్నటికీ మరువను. నాకు బ్రహ్మానందం గారే ఇన్స్పిరేషన్. నా జీవిత లక్ష్యం కూడా అదే. ఆయనంత స్థాయికి ఎదగాలని. అందుకే యే స్కీట్లు, యే షూట్లు చేసినా రియలిస్టిక్‌గా చేస్తుంటాను. అందుకు నిదర్శనం.. నా వంటి మీద ఉన్న గాయాలే. నాకు ధన్‌రాజ్ అంటే అమ్మలాగా, అన్న లాగా.. ఆయన పక్కనుంటే నాకెంతో ధైర్యం. - రాకేశ్ అమితాబ్‌తో చేశా.. సినిమాల్లో కనిపించడానికి 1999లో కరీంనగర్ నుంచి పారిపోయి హైదరాబాద్ వచ్చాను. మా అమ్మానాన్నలకు తొమ్మిది మంది సంతానం. నేనే చిన్నవాడ్ని. అందరూ గారాబంగా చూసేవాళ్లు. వాళ్లు తిన్నా తినకపోయినా.. నాకు మాత్రం మూడు పూటలా తిండి పెట్టేవారు. ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లయింది. ఇంట్లో ముప్పొద్దులా తినే అలవాటాయె.. ఇక్కడ అష్టకష్టాలు పడ్డాను. అన్నపూర్ణ స్టూడియో బయట గేటు దగ్గర ఎన్నో రోజులు, వచ్చిపోయే వాళ్లను చూస్తూ ఉండేవాణ్ని. సెట్లు వేసి తీసే పని, చెత్త తీసే పని ఒక్కటని కాదు ఎన్నెన్నో చేశాను. సెట్బాయ్గా, అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేశాను. అలా పనిచేస్తూ.. ‘జై’ సినిమాలో మొదటిసారి కనిపించాను. తెలుగు సినిమాలే కాదు, 3 తమిళ సినిమాల్లో నటించాను. ఒక హిందీ సినిమాలో అమితాబ్‌తో ఒక షాట్ చేశాను. నేను, ధన్‌రాజ్, చంద్ర కలిసి పలు సినిమాల ఆడియో ఫంక్షన్స్‌లో కామెడీ స్కిట్స్ చేశాం. నన్ను చేరదీసి, తిండిపెట్టి.. ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి ‘కత్తపల్లి శేషు’ అండ్ ‘చిత్రం శ్రీను’. వీరిద్దరినీ మరిచిపోలేను. నేను మొదట్లో చిత్రం శ్రీనుకి మేకప్ వేసేవాడిని. ఆయనే నాకు ఇన్స్పిరేషన్, ప్రాణ మిత్రుడు అన్నీ..! - వేణు వీళ్లే ఆ నలుగురు.. మాది నిజామాబాద్. 10వ తరగతి దగ్గరే నా చదువుకు ఫుల్స్టాప్ పడింది. చిన్నప్పటి నుంచి ఇరుగు పొరుగు ఇళ్లలో జరిగే గొడవలను చూసేవాణ్ని. తర్వాత అద్దంలో చూసుకుంటూ వాటినే ఇమిటేట్ చేసేవాడిని. ఆడోళ్లను బాగా ఇమిటేట్ చేసేవాణ్ని కదా.. అందుకే ఇప్పుడు చీరకట్టుతో అదరగొడుతున్నాను. ఇప్పటి వరకు 35 సినిమాలు చేశాను. వీటిలో కొన్ని రిలీజ్ కావాల్సినవి ఉన్నాయి. నేను, వేణు, తాగుబోతు రమేష్, శ్రీను, రామ్‌ప్రసాద్ మంచి స్నేహితులం. కష్టనష్టాలు పంచుకోవడానికి నలుగురు ఉంటే బాగుండునని అందరూ అనుకుంటారు. ఆ నలుగురు నాకు వీళ్లే. ఫైట్స్ లేని విలన్‌గా.. మాది తాడేపల్లిగూడెం. మా ఇంటి గోడలకు మొత్తం సినిమా పోస్టర్లు అతికించి ఉండేవి. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ.. తింటున్నా.. కూర్చున్నా.. ఏం చేసినా.. వాటిని చూడటమే నా పని. వన్ ఫైన్ డే చిరంజీవి నటించిన యముడికి మొగుడు సినిమా పోస్టర్ చూసి యాక్టర్ అవ్వాలని ఫిక్సయిపోయాను. టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయాక.. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా.. బస్సెక్కి హైదరాబాద్ వచ్చేశాను. 12 ఏళ్ల కిందటి ముచ్చట. జై సినిమాలో మొదటిసారి కనిపించా. తర్వాత 70 సినిమాల దాకా చేశాను. హీరోగా కూడా ఒక సినిమా చేశాను. విలన్ క్యారెక్టర్ నా డ్రీమ్ రోల్. ఫైటింగ్‌లు లేనివేనండోయ్. రఘువరన్‌లా అదరగొట్టాలని ఉంది. అలాగని నాకు తిండి పెట్టిన కామెడీని మాత్రం వదలను. హైదరాబాద్ పుష్పక విమానం లాంటింది. ఎందరొచ్చినా.. ఇంకొకరికి కచ్చితంగా ప్లేస్ ఉంటుంది. - ధన్‌రాజ్ జర్నలిస్ట్ అయ్యేవాణ్ని.. నేను 2005 నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. మొదట్లో మా టీవీ, టీవీ 9, టీవీ 1, లోకల్ చానల్స్‌లో స్క్రిప్ట్ రైటర్‌గా, డెరైక్టర్‌గా పనిచేశాను. కామెడీ సైడ్ రాకపోయుంటే.. జర్నలిస్ట్‌గా స్థిరపడేవాణ్ని. ఇప్పుడిప్పుడే సినిమాల్లో చాన్స్‌లు వస్తున్నాయి. ఎప్పటికైనా ప్రకాశ్‌రాజ్‌లా మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావాలని కోరుకుంటున్నాను. టాలెంట్, పట్టుదల ఉంటే చిత్ర పరిశ్రమ ఆదరిస్తుందని గట్టిగా నమ్ముతాను. నాతో కష్టసుఖాలు పంచుకునే సుధీర్, రాంప్రసాద్ మంచి స్నేహితులు. - శ్రీను -
నవ్వుల రారాజు..
మాది చిట్యాల మండలంలోని వెల్లంపల్లి. నాన్న మల్లయ్య సింగరేణి ఉద్యోగి. అమ్మ సరోజన గృహిణి. ఒకటి నుంచి పదో తరగతి వరకు ఆదిలాబాద్ జిల్లా మందమర్రి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా. హన్మకొండలోని సరస్వతి కాలేజీలో ఇంటర్మీడియెట్, అరోరా డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశా. కాకతీయ విశ్వవిద్యాలయంలో ‘డిప్లొమా ఇన్ మిమిక్రీ’లో గోల్డ్ మెడల్ అందుకున్నా. అనుకరణే.. కమెడియన్‌ను చేసింది. చిన్నప్పటి నుంచే తోటివారిని అనుకరించేవాడిని. స్నేహితులతో ఉపాధ్యాయుల్లా మాట్లాడేవాడిని. విషయం తెలిసిన టీచర్లు మమ్మల్నే ఇమిటేట్ చేస్తావా అంటూ బెత్తం దెబ్బలు వేసేవారు. ఇక సినిమాలంటే విపరీతమైన పిచ్చి. హీరోలు, కమెడియన్ల డైలాగులు చూసి వారిలా ఊహించుకుంటూ సినిమా హాల్లోనే యాక్టింగ్ చేసేవాడిని. మందమర్రి నుంచి హన్మకొండకు రావడంతో నా దశ తిరిగింది. ఇంటర్మీడియెట్ చదువుతున్నప్పుడు మిత్రుల వద్ద మిమిక్రీ చేసేవాడిని. విద్యాసాగర్ అనే వ్యక్తి.. ‘హీరోలను భలే అనుకరిస్తున్నావు స్టేజీ ప్రోగాములు ఇవ్వొచ్చు కదా’ అని ప్రోత్సహించాడు. ఆయన ప్రోద్బలంతో మిమిక్రీ షోలు చెయ్యడం మొదలుపెట్టా. అలా వందలాది ప్రదర్శనలు ఇచ్చాను. అప్పటి హన్మకొండ సీఐలు కిరణ్‌కుమార్, ఫణికుమార్ నా వెన్నుతట్టి ధైర్యం చెప్పారు. సినిమాల్లోకి వెళ్లాలని ఒత్తిడి చేశారు. నా సంతోషానికి అవధుల్లేకుండా పోయింది హైదరాబాద్ వెళ్లి టీవీల్లో అవకాశాలు వెతుక్కుంటానని ఇంట్లో చెప్పగానే అడ్డుచెప్పకుండా వెళ్లి ప్రయత్నించమన్నారు. దీంతో ఓ టీవీ చానల్‌కు వెళ్లి ప్రదర్శన ఇచ్చా. నిర్వాహకులు వెంటనే శభాష్ అంటూ కితాబిచ్చారు. తమ చానల్లో రోజూ గంటపాటు కార్యక్రమం నిర్వహించాలని సూ చించారు. దీంతో నా సంతోషానికి అవధుల్లేకుండా పో యాయి. అలా నవ్వుల డాన్.. రేడియో జాకీగా ప్రస్థానాన్ని ప్రారంభించా. తర్వాత 91.1ఎఫ్ఎంలో కార్యక్రమాలు చేసే అవకాశం లభించింది. ప్రస్తుతం ఏడు చానళ్లలో, రేడియోలో కమెడియన్‌గా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. ఓరుగల్లు వీధుల్లో వినాయకుడి వేదికలపై నవ్వుల పువ్వులు పూయించిన వెంకీ.. నేడు వెండి, బుల్లి తెరలపై కడుపుబ్బా నవ్విస్తున్నాడు. అద్భుత నటనతో ఆకట్టుకుంటున్నాడు. స్నేహితుల ప్రోద్బలంతో టెలివిజన్ ఇంటర్య్వూకు వెళ్లిన ఆయన ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. బుల్లి తెరపై నవ్వుల రారాజుగా పేరుగాంచిన వెంకీ అసలు పేరు బొజ్జపల్లి వెంకటేశ్వర్లు. టీవీ వీక్షకుల హృదయాలు దోచుకుంటున్న ఈ వరంగల్ కుర్రోడు హన్మకొండ సుబేదారిలోని తన నివాసంలో ‘సాక్షి’తో మాట్లాడాడు. అంతరంగాన్ని ఆవిష్కరించాడు. వివరాలు ఆయన మాటల్లోనే.. - వరంగల్ అర్బన్ ‘జబర్దస్త్’తో సినిమా అవకాశాలు జబర్దస్త్ టీం లీడర్లు చంద్ర, ధన్‌రాజ్, చిత్రం శ్రీనులతో కలిసి విజయవాడలో ఓ కార్యక్రమం నిర్వహించే అవకాశం లభించింది. అక్కడ నా ప్రదర్శన చూసి మెచ్చుకున్నారు. ఆ వెంటనే ‘జబర్దస్త్’లోకి కమెడియన్‌గా వస్తావా అని నన్ను అడిగారు. ఎగిరి గంతేశా. మొత్తం 74 షోలు చేశా. మహిళ గెటప్‌తోనే 50షోలు చేశా. ‘వద్దురా రాములా’ అనే డైలాగ్ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. రేసుగుర్రంలోనూ ఓ చిన్నపాత్ర చేశా. ఇది నాకు నిజంగా కొత్త జీవితమే. ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్, ఈ వర్షం సాక్షిగా, ఈజీ మనీ, ఓరే సాంబ రాసుకోరాతోపాటు పలు సినిమాల్లో నటిస్తున్నా. పేరుపెట్టని ఓ సినిమాలో హీరోయిన్ ప్రియమణిని ప్రేమించే ఓ పెద్ద క్యారెక్టర్ చేస్తున్నా. సుబేదారి నుంచి రోజూ హైదరాబాద్‌కు వెళ్లి వస్తున్నా. అయితే బిజీ కావడం వల్ల అక్కడికే మకాం మార్చాలని అనుకుంటున్నా. ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నా. సంపాదించిన సొమ్ములో కొంత సేవకు ఉపయోగిస్తున్నా. ప్రతిభ ఉండి చదువుకు దూరమైన నలుగురు నిరుపేద విద్యార్థుల బాగోగులు చూసుకుంటున్నా. సినిమాల్లో అవకాశం రావడంతో నా జన్మ ధన్యమైంది. కష్టపడితే తప్పకుండా విజయం వరిస్తుంది. నా ఎదుగుదలకు ప్రోత్సహించిన నా తల్లిదండ్రులకు, స్నేహితులకు, కమెడియన్లకు, హీరోహీరోయిన్లకు కృతజ్ఞతలు.