
కరీనా కపూర్
గ్లామరస్ క్యారెక్టర్లతో పాటు ట్రెడిషనల్ క్యారెక్టర్స్‌తోనూ సిల్వర్ స్క్రీన్‌పై ప్రేక్షకులను మెప్పిస్తున్నారు బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్. ఇప్పుడు ఆమె బుల్లితెరపై సందడి చేయబోతున్నారు. ఓ ప్రముఖ చానెల్‌కు చెందిన డ్యాన్స్ షోలో ఆమె న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్నారు. ఈ షో జూన్‌లో స్టార్ట్ కానుందని తెలిసింది. ఆల్రెడీ షో విధి విధానాలు, వాటికి సంబంధించిన విశేషాలను కరీనాకు వివరించారట నిర్వాహకులు. ఇప్పటికే రిహార్సల్స్ కూడా స్టార్ట్ చేశారామె. కరీనా బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వనుండటం ఇదే తొలిసారి. ఇక సినిమా విషయానికి వస్తే... ఇటీవలే ‘గుడ్‌న్యూస్’ షూటింగ్‌ను పూర్తి చేసి, ‘అంగ్రేజీ మీడియం’సినిమాతో బిజీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment