
సన్నీ లియోన్ విన్యాసాలు
డంబుల్స్.. వాటిని చూస్తేనే అమ్మాయిల గుండెల్లో గుబుల్స్. కోరి కోరి అంత బరువుని నెత్తి మీద పెట్టుకుంటారా? దానికి ఎంతో ఖలేజా ఉండాలి. సన్నీ లియోన్‌కి ఆ దమ్ముంది. అంతే.. ఫొటోలో కనిపిస్తున్నట్లుగా డంబుల్స్‌ని నెత్తి మీద పెట్టుకున్నారు. అవి నిజమైనవేనంటారా? ఉత్తుత్తివే అని సన్నీ చెప్పలేదు కాబట్టి నిజమైనవే అనుకోవాలేమో. ఇంకో ఫొటోలో చూశారా? అందాల రాక్షసిలా కనిపిస్తున్నారు కదూ.
మరో ఫొటోలో ఏకంగా తాడుతో గాల్లో వేలాడుతున్నారు. మెడలో పాము వేసుకుని ఎంత హాయిగా నవ్వుతున్నారో చూశారా? వామ్మో సన్నీ ఎంత డేరింగ్ అండ్ డ్యాషింగో కదా. ఏంటి సన్నీ? ఏం జరిగింది? అంటే.. ఓ టీవీ షో కోసం సన్నీ ఈ విన్యాసాలు చేస్తున్నారు. మెడలో ఉన్నది నిజం పాము కాదు. ‘‘ఇంకా నయం.. దర్శక–నిర్మాతలు నాకు నిజం పాము ఇవ్వలేదు. బతికిపోయాను’ అని నవ్వేశారు సన్నీ లియోన్. ఇలాంటి సరదా ఫొటోలను చూస్తే సన్నీ లియోన్‌ను ఫన్నీ లియోన్ అనకుండా ఉండలేం కదా.