క్రిష్ దర్శకత్వంలో పవన్..? | Pawan Kalyan and Krish to Team up for a Tv Show | Sakshi
Sakshi News home page

క్రిష్ దర్శకత్వంలో పవన్..?

Published Thu, Aug 4 2016 11:55 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

క్రిష్ దర్శకత్వంలో పవన్..? - Sakshi

క్రిష్ దర్శకత్వంలో పవన్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో క్రిష్ దర్శకత్వంలో నటించబోతున్నాడట. ప్రస్తుతం గౌతమీ పుత్ర శాతకర్ణి పనుల్లో బిజీగా ఉన్న క్రిష్, ఆ పనులు పూర్తవ్వగానే పవన్తో కలిసి పనిచేయబోతున్నాడు. అయితే ఈ ఇద్దరు పనిచేయబోయేది...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో క్రిష్ దర్శకత్వంలో నటించబోతున్నాడట. ప్రస్తుతం గౌతమీ పుత్ర శాతకర్ణి పనుల్లో బిజీగా ఉన్న క్రిష్, ఆ పనులు పూర్తవ్వగానే పవన్తో కలిసి పనిచేయబోతున్నాడు. అయితే ఈ ఇద్దరు పనిచేయబోయేది సినిమా కోసం కాదు.., ఓ టివి షో కోసం. ఇప్పటికే నార్త్లో సూపర్ హిట్ అయిన సత్యమేవ జయతే తరహాలో ఓ తెలుగు షో నిర్వించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఒక ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందట. నటుడిగానే కాక ప్రజా సేవలో కూడా ముందుండే పవన్ అయితేనే ఈ కార్యక్రమానికి వ్యాఖ్యతగా సరిపోతాడని భావించిన సదరు ఛానల్, పవన్ను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించే క్రిష్ దర్శకత్వంలో షో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉన్న ఈ షో తెరమీదకు వస్తే మాత్రం తెలుగు బుల్లితెర మీద సంఛలనం అవుతుందంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement